
ఐపీఎల్-2025 సీజన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘోర ఓటమితో ముగించింది. ఆదివారం ఢిల్లీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో కేకేఆర్ పరాజయం చవిచూసింది. ఈ ఏడాది సీజన్ అసాంతం దారుణ ప్రదర్శన కనబరిచిన డిఫెండింగ్ ఛాంపియన్.. వరుస ఓటములతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.
శ్రేయస్ అయ్యర్ స్ధానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వెటరన్ ఆటగాడు అజింక్య రహానే జట్టును విజయం పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదన్పించినప్పటికి, కెప్టెన్‌గా మాత్రం రహానే పూర్తిగా తేలిపోయాడు.
ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఐదింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్ధానంలో నిలిచింది. ఈ క్రమంలో కేకేఆర్ మెనెజ్‌మెంట్‌పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. రహానే టాప్-3లో బ్యాటింగ్‌కు రావడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు.
"కెప్టెన్ టాప్ త్రీలోనే బ్యాటింగ్ చేయాలని ఎక్కడా రాసిలేదు. పంత్‌ను చూసి నేర్చుకోండి. అతడు తన ఫామ్‌లో లేని అని తెలిసి మిగితా ఆటగాళ్లను తనకంటే ముందు బ్యాటింగ్‌కు పంపుతున్నాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు టాపర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడంతో లక్నో భారీ స్కోర్ సాధించగలుగుతుంది.
కేకేఆర్ అలాగే చేసి ఉంటే బాగుండేది. అది టీమ్ మెనెజ్‌మెంట్, కోచింగ్ స్టాప్ బాధ్యత. నిన్న గుజరాత్‌తో మ్యాచ్‌లో కూడా సీఎస్‌కే అదే పనిచేసింది. ఫామ్‌లో ఉన్న డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబేలను ముందు బ్యాటింగ్‌కు పంపారు" అని క్రిక్‌బజ్ లైవ్ షో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండి: చెప్పింది వినరా?.. సహనం కోల్పోయిన ధోని.. పతిరణ, దూబేపై ఫైర్!