ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి | Virat Kohli Smashes Stunning Century Against New Zealand, Breaks Multiple World Records In 3rd ODI, Check Story Inside | Sakshi
Sakshi News home page

ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి

Jan 19 2026 9:45 AM | Updated on Jan 19 2026 10:44 AM

Virat Kohli breaks Sehwag Ponting World Record Becomes 1st Player To

న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి అద్భుత శతకంతో అలరించాడు. ఇండోర్‌ వేదికగా ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌.. 91 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 108 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. పది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 124 పరుగులు సాధించాడు.

ప్రపంచ రికార్డులు బద్దలు
తద్వారా వన్డే ఫార్మాట్‌లో తన పేరిట ఉన్న అత్యధిక సెంచరీ (53)ల రికార్డును కోహ్లి సవరించాడు. ఈ మ్యాచ్‌ సందర్భంగా 54వ  వన్డే సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్‌గా 85వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లి రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.

 

పాంటింగ్‌, సెహ్వాగ్‌లను దాటేసి
న్యూజిలాండ్‌పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కాగా న్యూజిలాండ్‌పై కోహ్లికి వన్డేల్లో ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. తద్వారా కివీస్‌పై అత్యధిక వన్డే శతకాలు బాదిన క్రికెటర్లుగా కొనసాగుతున్న భారత దిగ్గజం వీరేందర్‌ సెహ్వాగ్‌ (6), ఆస్ట్రేలియా లెజెండ్‌ రిక్కీ పాంటింగ్‌ (6) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.

కలిస్‌ను అధిగమించి
అంతేకాదు.. మూడు ఫార్మాట్లలో కలిపి న్యూజిలాండ్‌పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గానూ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్‌పై కోహ్లి 73 ఇన్నింగ్స్‌లో కలిపి 10 సెంచరీలు చేశాడు. తద్వారా సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్‌ కలిస్‌ (9) వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.

కాగా ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో కివీస్‌ యువ పేసర్‌ క్రిస్టియన్‌ క్లార్క్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లి పెవిలియన్‌ చేరాడు. కోహ్లితో పాటు నితీశ్‌ కుమార్‌ రెడ్డి (53), హర్షిత్‌ రాణా (52) మాత్రమే రాణించారు. మిగిలిన వారు విఫలం కాగా.. భారత్‌ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్‌కు వన్డే సిరీస్‌ను కోల్పోయింది.

న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లు
విరాట్‌ కోహ్లి- 36 ఇన్నింగ్స్‌లో 7 సెంచరీలు
వీరేందర్‌ సెహ్వాగ్‌- 51 ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు
రిక్కీ పాంటింగ్‌- 23 ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు
సనత్‌ జయసూర్య- 47 ఇన్నింగ్స్‌లో 5 సెంచరీలు
సచిన్‌ టెండుల్కర్‌- 42 ఇన్నింగ్స్‌లో 5 సెంచరీలు

న్యూజిలాండ్‌పై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లు
విరాట్‌ కోహ్లి- 73 ఇన్నింగ్స్‌లో 10 సెంచరీలు
జాక్వెస్‌ కలిస్‌- 76 ఇన్నింగ్స్‌లో 9 సెంచరీలు
జో రూట్‌- 71 ఇన్నింగ్స్‌లో 9 సెంచరీలు
సచిన్‌ టెండుల్కర్‌- 80 ఇన్నింగ్స్‌లో 9 సెంచరీలు.

చదవండి: అతడు అద్భుతం.. నితీశ్‌ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement