అతడు అద్భుతం.. నితీశ్‌ రెడ్డికి అందుకే ఛాన్స్‌: గిల్‌ | Disappointed Need Improvement: Gill Reacts ODI Series Loss To NZ | Sakshi
Sakshi News home page

అతడు అద్భుతం.. నితీశ్‌ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్‌

Jan 19 2026 8:29 AM | Updated on Jan 19 2026 8:45 AM

Disappointed Need Improvement: Gill Reacts ODI Series Loss To NZ

సొంతగడ్డపై టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఇండోర్‌లో ఇప్పటి వరకు వన్డే ఓటమి రుచి చూడని భారత జట్టుకు న్యూజిలాండ్‌ షాకిచ్చింది. మూడో వన్డేలో టీమిండియాను ఓడించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. భారత బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి శతక్కొట్టినా మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు.

ఈ నేపథ్యంలో సిరీస్‌ ఓటమిపై భారత జట్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) స్పందించాడు. ‘‘తొలి మ్యాచ్‌లో గెలిచాం. రెండో వన్డేలో వాళ్లు గెలిచి 1-1తో సమం చేశారు. అయితే, ఇక్కడ ఈరోజు మా ఆట తీరు నన్నెంతగానో నిరాశపరిచింది.

విరాట్‌ భాయ్‌ అద్భుతం.. హర్షిత్‌ సూపర్‌
మేము ఆటను సరిదిద్దుకోవాల్సి ఉంది. పొరపాట్లను సరిచేసుకుంటాం. విరాట్‌ (Virat Kohli) భాయ్‌ బ్యాటింగ్‌ చేసిన తీరు అద్భుతం. ఈ మ్యాచ్‌లో మాకు అదే అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈ సిరీస్‌లో ఎనిమిదో స్థానంలో వచ్చి హర్షిత్‌ రాణా బ్యాటింగ్‌ చేసిన తీరు కూడా ఆకట్టుకుంది.

నితీశ్‌ రెడ్డిని అందుకే ఆడించాం
అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. మా ఫాస్ట్‌ బౌలర్లు సిరీస్‌ ఆసాంతం మెరుగ్గా బౌలింగ్‌ చేశారు. ప్రపంచకప్‌ టోర్నీని దృష్టిలో పెట్టుకుని నితీశ్‌ కుమార్‌ రెడ్డి (Nitish Kumar Reddy)కి అవకాశాలు ఇస్తున్నాం. సరిపడా ఓవర్లు వేయించడంతో పాటు బ్యాటింగ్‌ కూడా చేయిస్తున్నాం.

వివిధ రకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్నాం. ఇందులో నితీశ్‌ కూడా భాగం. అతడి బౌలింగ్‌ తీరును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం’’ అని గిల్‌ పేర్కొన్నాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చింది.

41 పరుగుల తేడాతో ఓటమి
ఈ క్రమంలో తొలుత వన్డే సిరీస్‌ జరుగగా.. వడోదరలో టీమిండియా.. రాజ్‌కోట్‌లో కివీస్‌ గెలిచాయి. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచి న్యూజిలాండ్‌ సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది.

లక్ష్య ఛేదనలో 46 ఓవర్లలో భారత్‌ కేవలం 296 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ (124) చేయగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (53), హర్షిత్‌ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు. మిగిలిన వారిలో గిల్‌ (23) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. 

చదవండి: IND vs NZ: ఏంటి రోహిత్ ఇది..? ఛాన్స్ వ‌చ్చినా కూడా! వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement