న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమైన రోహిత్.. ఇప్పుడు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు. 338 పరుగుల లక్ష్య చేధనలో హిట్‌మ్యాన్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాడు. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన జకారీ ఫౌల్క్స్ బౌలింగ్‌లో రోహిత్ ఔటయ్యాడు.
మిడాన్‌లో క్లార్క్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. అయితే అదే ఓవర్‌లో నాలుగో బంతికి రోహిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వికెట్ కీపర్ మిచిల్ హే జారవిడిచాడు. కానీ తనకు లభించిన అవకాశాన్ని రోహిత్ అందిపుచ్చుకోలేకపోయాడు. రోహిత్ కేవలం 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ సిరీస్ మొత్తంగా రోహిత్ కేవలం 61 పరుగులు చేశాడు. అంతకుముందు జరిగిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ రోహిత్ దుమ్ములేపాడు. కానీ ఆ ఫామ్‌ను కివీస్‌పై మాత్రం కొనసాగించలేకపోయాడు. వన్డే ప్రపంచకప్-2027 ప్రణాళికలలో ఉన్న హిట్‌మ్యాన్ నుంచి టీమ్ మెనెజ్‌మెంట్ మెరుగైన ప్రదర్శలను ఆశిస్తోంది.
తడబడుతున్న భారత్..
కాగా 338 పరుగుల లక్ష్య చేధనలో భారత్ తడబడుతోంది. కేవలం 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శుభ్‌మన్ గిల్ 23 పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్(3), కేఎల్ రాహుల్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. క్రీజులో విరాట్ కోహ్లి(35), నితీశ్ కుమార్ రెడ్డి(7) ఉన్నారు. కివీస్ బౌలర్లలో ఇప్పటివరకు ఫౌల్క్స్, క్లార్క్, లినిక్స్, జేమిసన్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్..


