ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో కీలక పోరుకు తెరలేచింది. రెండో సెమీ ఫైనల్లో భారత్- ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ముంబైలోని వాంఖడే వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది.
UPDATES:
సంజూ శాంసన్ అవుట్
13.1: సంజూ శాంసన్ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.
విల్ జాక్స్‌బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించి.. ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు రాబట్టాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. దూబే 18 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 160-3(13.1)
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
9.3: మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించిన ఇషాన్ కిషన్.. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 18 బంతుల్లో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు. శివం దూబే క్రీజులో వచ్చాడు. సంజూ 66 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 117-2(9.3).
8.3: వంద పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా
Another must-win game, another Sanju Samson masterclass! 🔥
His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏
ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026
సంజూ హాఫ్ సెంచరీ
వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారీ హాఫ్ సెంచరీ బాదిన సంజూ.. తాజా మ్యాచ్‌లోనూ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. డాసన్ బౌలింగ్‌లో సిక్స్ బాది మరీ ఈ మైలురాయి చేరుకున్నాడు.
పవర్ ప్లేలో భారత్ స్కోరు: 67-1(6)
సంజూ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 41 పరుగులతో ఉండగా.. ఇషాన్ కిషన్ 9 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
తొలి వికెట్ డౌన్
1.6: విల్ జాక్స్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (7 బంతుల్లో 9) అవుట్. సంజూ 11 పరుగులతో ఉండగా.. ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 20-1(2)
సైలెంట్ చేసేస్తాం
టాస్ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ బాగుంది. వికెట్ పాతబడే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అనుకుంటున్నాం. అందుకే మేము ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాము.
ఒక మార్పుతో బరిలోకి
టీమిండియాకు ఈ పిచ్‌పై ఆడిన అనుభవం మాకంటే ఎక్కువే. అయితే, టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. టీమిండియా మద్దతుదారులు నిశ్శబ్దంగా ఉండేలా చేస్తాం. రెహాన్ అహ్మద్ స్థానంలో ఓవర్టన్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.
అదే జట్టు..
ఇక టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘సెమీ ఫైనల్. బిగ్ గేమ్. మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. ఇక్కడ అంతగా డ్యూ ఉంటుందని అనుకోవడం లేదు. పిచ్ బాగుంది. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు ధన్యవాదాలు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.
Harry Brook calls it right, and England will bowl first in the semi-final! ✌️
What do you make of the decision? 👀
ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/Zabmv2MsVT— Star Sports (@StarSportsIndia) March 5, 2026
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లు
భారత్
అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్
ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.


