బ్రెవిస్‌, కాన్వే, మాత్రే మెరుపులు.. సీఎస్‌కే భారీ స్కోర్‌ | Brevis, Conway fifties power Chennai Super Kings to 230-5 against GT | Sakshi
Sakshi News home page

IPL 2025: బ్రెవిస్‌, కాన్వే, మాత్రే మెరుపులు.. సీఎస్‌కే భారీ స్కోర్‌

May 25 2025 5:29 PM | Updated on May 25 2025 6:00 PM

Brevis, Conway fifties power Chennai Super Kings to 230-5 against GT

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాట‌ర్లు జూలు విధిల్చారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 230 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. 

సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌(23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 57), డెవాన్ కాన్వే(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) అద్బుత‌మైన హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగ‌గా.. ఆయూష్ మాత్రే(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 34), ఉర్విల్ ప‌టేల్‌(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 37) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయికిషోర్‌, రషీద్ ఖాన్‌, షారుఖ్ ఖాన్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ ఏడాది సీజన్‌లో సీఎస్‌కేకే ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు ఏకంగా 15 సిక్సర్లు బాదారు. అదేవిధంగా గుజరాత్‌ను 121 పరుగులలోపు ఆలౌట్ చేస్తే పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానం నుంచి సీఎస్‌కే బయటపడుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సీఎస్‌కే పదో స్దానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement