చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ ఓపెనర్లు | Tom Latham And Devon Conway Centuries Help NZ Script Never Seen Before Record vs ENG | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ ఓపెనర్లు

Jun 25 2026 11:08 PM | Updated on Jun 25 2026 11:08 PM

Tom Latham And Devon Conway Centuries Help NZ Script Never Seen Before Record vs ENG

ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జూన్‌ 25) మొదలైన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వే చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్‌లో భారీ శతకాలతో కదంతొక్కిన ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 317 పరుగులు జోడించారు. తద్వారా న్యూజిలాండ్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పిన జోడీగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. భారీ శతకాల అనంతరం లాథమ్‌ 151 పరుగులు, కాన్వే 157 పరుగుల వద్ద ఔటయ్యారు.

ఈ ఇన్నింగ్స్‌లతో లాథమ్‌, కాన్వే మరిన్ని రికార్డులు కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన తొలి న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీ రికార్డుల్లోకెక్కారు. అంతేకాదు, ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్‌ జోడీ వీరిదే.

22 ఏళ్ల తర్వాత కెప్టెన్ సెంచరీ
లాథమ్ తన టెస్టు కెరీర్‌లో 17వ సెంచరీ నమోదు చేయగా, న్యూజిలాండ్ కెప్టెన్‌గా ఇంగ్లండ్‌లో టెస్టు శతకం బాదిన తొలి కెప్టెన్‌గా 22 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. కాన్వే తన 9వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు.

2,000 పరుగుల మైలురాయి
లాథమ్-కాన్వే జోడీ మరో అరుదైన ఘనతను కూడా అందుకుంది. టెస్టు క్రికెట్‌లో 2,000 పరుగులు పూర్తి చేసిన తొలి న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీగా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే కివీస్ తరఫున అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా ఉన్న వీరు, ఇప్పుడు ఆ రికార్డును మరింత బలోపేతం చేశారు.

లెజెండ్స్ సరసన
టెస్టుల్లో రెండోసారి 200కిపైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన లాథమ్-కాన్వే జోడీ, న్యూజిలాండ్ దిగ్గజ జోడీలు మార్టిన్‌ క్రో-ఆండ్రూ జోన్స్‌, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌-కేన్‌ విలియమ్సన్‌ సరసన చేరారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసింది. లాథమ్‌, కాన్వేతో పాటు హెన్రీ నికోల్స్‌ (36), రచిన్‌ రవీంద్ర (7) ఔట్‌ కాగా.. విలియమ్‌ ఓరూర్కీ (0) క్రీజ్‌లో ఉన్నాడు. ఇం​గ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌, ఆర్చర్‌, స్టోక్స్‌, రూట్‌ తలో వికెట్‌ తీశారు. 

కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ తొలి టెస్ట్‌ గెలవగా.. న్యూజిలాండ్‌ రెండో టెస్ట్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టు సిరీస్‌ కైవసం​ చేసుకుంటుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement