దూసుకొచ్చిన న్యూజిలాండ్‌ | New Zealand climbs to number three on WTC standings | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన న్యూజిలాండ్‌

Jun 30 2026 9:31 AM | Updated on Jun 30 2026 10:31 AM

New Zealand climbs to number three on WTC standings

ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ అద్భుత విజయం తర్వాత వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ గెలుపుతో సిరీస్‌ను సైతం  చేజిక్కించుకున్న న్యూజిలాండ్‌ (2-1తో), టేబుల్‌లో టాప్-3లోకి ప్రవేశించింది.

యాషెస్‌ ఆధిపత్యం, వెస్టిండీస్‌పై క్లీన్‌ స్వీప్‌ తర్వాత ఆస్ట్రేలియా 87.50 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో డిఫెండింగ్‌ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ సౌతాఫ్రికా (75) నిలిచింది. తాజా విజయం తర్వాత న్యూజిలాండ్‌ 72.22 పాయింట్ల శాతంతో మూడో స్థానానికి దూసుకొచ్చింది.

పాకిస్తాన్‌పై సంచలన విజయాల తర్వాత బంగ్లాదేశ్‌ నాలుగో స్థానాన్ని కాపాడుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 58.33 పాయింట్ల శాతం కలిగి ఉంది. భారత్‌ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక ఆరులో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి తర్వాత కూడా ఇంగ్లండ్‌ ఏడో స్థానంలో నిలబడింది.

తాజాగా శ్రీలంకపై భారీ విజయం సాధించిన తర్వాత కూడా వెస్టిండీస్‌ ర్యాంకింగ్‌లో మార్పు లేదు. ఆ జట్టు ఎనిమిదో స్థానంలోనే కొనసాగుతోంది. చివరిగా పాక్‌ తొమ్మిదో స్థానంలో తిష్ట వేసి కూర్చుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే.. ఆస్ట్రేలియా–దక్షిణాఫ్రికా–న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోటీ ఉండే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement