నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 160 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది.
కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్(151), డెవాన్ కాన్వే(157) భారీ సెంచరీలతో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌట్ అయింది.
కివీస్ యువ బౌలర్ నాథన్ స్మిత్ స్వింగ్ బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. ఫలితంగా న్యూజిలాండ్‌కు 84 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్(113) సెంచరీతో రాణించగా.. హ్యారీ బ్రూక్(58) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.
కాగా రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కాస్త తడబడింది. ఒక దశలో తక్కువ స్కోరుకే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. . కానీ, డారిల్ మిచెల్ ఒంటరి పోరాటం చేస్తూ అద్భుతమైన అజేయ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
అతనికి తోడుగా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను 288/9 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆతిథ్య ఇంగ్లండ్ ముందు 373 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 212 పరుగులకే కుప్పకూలింది.
బెన్ స్టోక్స్ శకం ముగింపు
ఇక ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. తన చివరి మ్యాచ్‌లో అభిమానులను అలరించడానికి స్టోక్స్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 20 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కివీస్ ఆటగాళ్లు ఆయనకు 'గార్డ్ ఆఫ్ హానర్' ఇచ్చి గౌరవించారు


