
తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్-2025లో ఫైనల్ బెర్త్‌ను ఆర్సీబీ ఖారారు చేసుకుంది. గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ.. నాలుగోసారి ఈ క్యాష్‌రిచ్ లీగ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్బుతంగా రాణించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఆర్సీబీ బౌలర్లు చెలరేగడంతో కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో మార్కస్ స్టోయినిస్ (17 బంతుల్లో 26 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 102 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత విజయం సాధించిన బెంగళూరు టీమ్ పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.
ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే..
👉ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో ప్రత్యర్ధిని 15 ఓవర్లలోపే ఆలౌట్ చేసిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డులెక్కింది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేదు.
👉అదేవిధంగా ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్(20 ఓవర్ల ఫుల్ గేమ్)లో బంతులపరంగా అతిపెద్ద విజయాన్ని సాధించిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఈ మ్యాచ్‌ను ఆర్సీబీ 60 బంతులు మిగిలూండగానే ముగించింది. ఇంతకుముందు ఈ రికార్డు కోల్‌కతా నైట్‌రైడర్స్ పేరిట ఉండేది. ఐపీఎల్-2024 ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 57 బంతులు మిగిలూండగానే కేకేఆర్ విజయం సాధించింది. తాజా మ్యాచ్‌తో కేకేఆర్ నైట్‌రైడర్స్ రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది.
👉అయితే 2017 సీజన్‌లో ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేకేఆర్ కేవలం 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కానీ ఆ మ్యాచ్‌ను వర్షం కారణంగా ఆరు ఓవర్లకు కుదించారు.