ప్రియాంశ్‌ ఆర్యకు గుండెకోత.. పరుగు తేడాతో డబుల్‌ సెంచరీ మిస్‌ | Priyansh Arya Falls For 199 In Ranji Trophy | Sakshi
Sakshi News home page

ప్రియాంశ్‌ ఆర్యకు గుండెకోత.. పరుగు తేడాతో డబుల్‌ సెంచరీ మిస్‌

Oct 18 2026 7:17 PM | Updated on Oct 18 2026 7:17 PM

Priyansh Arya Falls For 199 In Ranji Trophy

source: IPL X

రంజీ ట్రోఫీలో ఢిల్లీ ఓపెనర్ ప్రియాంశ్‌ ఆర్య (ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విధ్వంసకర బ్యాటర్‌)కు గుండెకోత మిగిలింది. గుజరాత్‌తో ఇవాళ ప్రారంభమైన మ్యాచ్‌లో అతడు ఒక్క పరుగు తేడాతో డబుల్‌ సెంచరీ మిస్‌ అయ్యాడు. ఈ విషయం అతడితో పాటు అతడి అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. సోషల్‌మీడియాలో ప్రియాంశ్‌పై సానుభూతి పెల్లుబుకుతోంది.

అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.. డబుల్‌ సెంచరీకి అర్హుడంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. గత ఐపీఎల్‌ సీజన్‌లోనూ ప్రియాంశ్‌ ఓ మ్యాచ్‌లో అర్హమైన సెంచరీని చేజార్చుకున్నాడు. న్యూ ఛండీఘడ్‌తో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అతడు 37 బంతుల్లో 93 పరుగుల వద్ద ఔటయ్యాడు. మొత్తంగా రంజీ ట్రోఫీ 2026-27 రెండో రౌండ్‌ మ్యాచ్‌ల తొలి రోజు ప్రియాంశ్‌ డబుల్‌ సెంచరీ మిస్‌ అంశం హైలైట్‌ అయ్యింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ప్రియాంశ్‌ తృటిలో డబుల్‌ సెంచరీ మిస్‌ (220 బంతుల్లో 199; 24 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసుకోగా.. కెప్టెన్‌ ఆయుశ్‌ బదోని (115) అజేయ శతకంతో క్రీజ్‌లో ఉన్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ స్కోర్‌ 381-4గా ఉంది. బదోనికి జతగా సుమిత్‌ మాథుర్‌ (0) క్రీజ్‌లో ఉన్నాడు. గుజరాత్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 2, మనన్‌ హింగ్రాజియా ఓ వికెట్‌ పడగొట్టగా.. ఆయుశ్‌ దొసేజా (29) రనౌటయ్యాడు. 

ఇదీ చదవండి: వరుసగా రెండో మ్యాచ్‌లో శతక్కొట్టిన రింకూ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement