పంజాబ్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ | James Hopes, Brad Haddin Leave Punjab Kings | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ కింగ్స్‌కు భారీ షాక్‌

Oct 8 2026 2:44 PM | Updated on Oct 8 2026 2:48 PM

James Hopes, Brad Haddin Leave Punjab Kings

source: X

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ (ఆస్ట్రేలియా), ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ (ఆస్ట్రేలియా) తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరికి బిగ్ బాష్ లీగ్ (BBL)లో కొత్త బాధ్యతలు లభించినట్లు తెలుస్తోంది. అందుకే పంజాబ్‌ కింగ్స్‌తో బంధం తెంచుకున్నారని సమాచారం​.

పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్, ఆస్ట్రేలియనే అయిన రికీ పాంటింగ్‌కు హాడిన్‌, హోప్స్‌ వృత్తిపరంగా అత్యంత సన్నిహితులు. ముఖ్యంగా హోప్స్‌కు పాంటింగ్‌తో మరింత సన్నిహిత సంబంధం ఉంది. పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌లోకి వచ్చిన సమయంలోనే హోప్స్‌ను కూడా అతనితో తెచ్చుకున్నాడు. హాడిన్ మాత్రం అంతకుముందు పంజాబ్ కింగ్స్‌కు కోచ్‌గా ఉన్న ట్రెవర్ బేలిస్ హయాం నుంచి కొనసాగుతున్నాడు.

మరోవైపు స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే కూడా ఇప్పటికే పంజాబ్ కింగ్స్‌ను వీడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే బహుతులే రాజీనామా చేసి, గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలోని భారత జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా చేరాడు.

కోచింగ్‌ టీమ్‌లో కీలక వ్యక్తులు వైదొలగడంతో పంజాబ్‌ కింగ్స్‌ కొత్త వారి కోసం అన్వేషిస్తుంది. ఈ బాధ్యతను ప్రధాన కోచ్‌ పాంటింగ్‌కే అప్పగించినట్లు తెలుస్తోంది. యాజమాన్యం కొన్ని పేర్లను సూచించినప్పటికీ, తుది నిర్ణయం మాత్రం ప్రధాన పాంటింగ్‌దేనని జట్టు వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: జట్టులో నో ఛాన్స్‌.. సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం!


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement