తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. వేణుగాన లీలలను స్ఫురింపజేసే శ్రీకృష్ణుని నర్తన రూపం భక్తులను పరవశింపజేసింది.
నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీవారి దర్శనం భగవంతుని దివ్యలీలలను స్మరింపజేసింది.
చంద్రుని శీతల కాంతులు, శ్రీకృష్ణుని లీలామాధుర్యం, శ్రీవారి దివ్య తేజస్సు మేళవించిన ఈ వాహనసేవ తిరుమలలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేసింది.


