తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు హనుమంత వాహనంపై కోదండ రాముని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ధనుస్సు, బాణం ధరించి, తన పరమభక్తుడైన హనుమంతునిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
వాహనం ముందు భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


