సిమన్స్ విధ్వంసం.. ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్‌ | West Indies Champions defeated England Champions by 9 wickets to win the WCL 2026 Final | Sakshi
Sakshi News home page

సిమన్స్ విధ్వంసం.. ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్‌

Oct 19 2026 3:00 AM | Updated on Oct 19 2026 3:00 AM

West Indies Champions defeated England Champions by 9 wickets to win the WCL 2026 Final

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)-2026 విజేతగా వెస్టిండీస్ ఛాంపియన్ నిలిచింది. ఆదివారం షార్జా వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని విండీస్ ముద్దాడింది. ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఇంగ్లండ్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 

ఇంగ్లండ్ బ్యాటర్లలో మొయిన్‌ అలీ(60), ఓవైద్‌ షా(38) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు. విండీస్‌ బౌలర్లలో డ్వేన్‌ బ్రావో మూడు వికెట్లు పడగొట్టగా.. ఫిడెల్‌ ఎడ్వర్డ్స్‌, కాట్రెల్‌, రీఫర్‌ తలా వికెట్‌ సాధించారు.

సిమన్స్‌ విధ్వంసం
అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 17 ఓవర్లలో చేధించింది. విండీస్‌ ఓపెనర్‌ లెండల్‌ సిమన్స్‌(53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77), చాడ్విక్‌ వాల్టన్‌(35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58) విధ్వంసకర హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు. 

ఇంగ్లండ్ బౌలర్లలో అజ్మల్ షాజాద్ ఒక్కడే వికెట్ సాధించాడు. కాగా చాడ్విక్ వాల్టన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కగా.. డ్వేన్ బ్రావో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా నిలిచాడు.
చదవండి: IND vs ZIM: టీమిండియా ఓపెనర్‌ ప్రపంచ రికార్డు.. తొలి ప్లేయర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement