breaking news
World Championship Of Legends
-
చాడ్విక్, పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్.. ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025)లో ఇంగ్లండ్ చాంపియన్స్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. వెస్టిండీస్ చాంపియన్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. పది పరుగుల తేడాతో విండీస్ చేతిలో పరాజయం పాలై.. రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూసీఎల్ టీ20 టోర్నమెంట్లో ఆతిథ్య జట్టు తొలుత పాకిస్తాన్ చాంపియన్స్‌తో తలపడి ఓడిపోయింది. అనంతరం ఆస్ట్రేలియా చాంపియన్స్‌తో పోటీపడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైపోయింది. తాజాగా తమ మూడో టీ20లో ఇంగ్లండ్ వెస్టిండీస్‌ను ఢీకొట్టింది.నార్తాంప్టన్ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ మెరుపు అర్ధ శతకం సాధించాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు.చాడ్విక్కు తోడుగా కీరన్ పొలార్డ్ (16 బంతుల్లో 30) కూడా దంచికొట్టాడు. ఇక కెప్టెన్ క్రిస్ గేల్ (19 బంతుల్లో 21) మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మరోవైపు.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ మేకర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అజ్మల్ షెహజాద్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిగతా వారిలో సమిత్ పటేల్, ఆర్జే సైడ్‌బాటమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.విండీస్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ చాంపియన్స్ ఆది నుంచే తడ‘బ్యా’టుకు గురైంది. ఓపెనర్లలో సర్ అలిస్టర్ కుక్ డకౌట్ కాగా.. ఇయాన్ బెల్ (5) కూడా నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ మొయిన్ అలీ (0) కూడా చేతులెత్తేయగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (9) కూడా విఫలమయ్యాడు.ఇలా టాపార్డర్ కుదేలైన వేళ రవి బొపారా (24), సమిత్ పటేల్ (36 బంతుల్లో 52) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ వీరికి మిగతా వారి నుంచి సహకారం లేకపోవడంతో విండీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చాంపియన్స్ తలవంచాల్సి వచ్చింది. ఫిడెల్ ఎడ్వర్డ్స్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ జట్టు పతనాన్ని శాసించగా.. షనన్ గాబ్రియెల్, డ్వేన్ బ్రావో రెండేసి వికెట్లు పడగొట్టారు. సులేమాన్ బెన్ కూడా ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 154 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా వెస్టిండీస్ చాంపియన్స్ పది పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చాంపియన్స్‌ను ఎదుర్కొన్న విండీస్ బాలౌట్‌లో ఓటమిపాలైంది.Classic Caribbean flair on display 🔥🌴Chadwick Walton's dazzling 83 off 50 - just the kind of 𝕎𝕚𝕟𝕕𝕚𝕖𝕤 𝕗𝕚𝕣𝕖𝕨𝕠𝕣𝕜𝕤 we love 😍#WCL2025 pic.twitter.com/4OIQC3OIKM— FanCode (@FanCode) July 22, 2025 -
2007 వరల్డ్ కప్ సీన్ రిపీట్.. బౌల్ అవుట్లో గెలిచిన సౌతాఫ్రికా
2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన బౌల్-అవుట్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోలేడు. టై అయిన మ్యాచ్‌లో బౌల్-అవుట్ నియమం ద్వారా భారత్ విజయం సాధించింది. ఇప్పడు అచ్చెం అటువంటి సీన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో రిపీటైంది.ఈ టోర్నీలో భాగంగా శనివారం వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ అవుట్ ద్వారా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రిస్ గేల్(2), పొలార్డ్(0) వంటి స్టార్ ప్లేయర్లు నిరాశపరచగా.. లెండల్ సిమ్మన్స్(28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో ఫంగిసో రెండు, విల్జోయెన్, స్మట్స్, ఓలీవర్ తలా వికెట్ సాధించారు. అనంతరం సౌతాఫ్రికా లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 81 పరుగులగా నిర్ణయించారు.లక్ష్యాన్ని చేధించే క్రమంలో సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత ఓవర్లలో 80 పరుగులే చేయగల్గింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్లు బౌల్ అవుట్ విధానాన్ని ఎంచుకున్నారు. సౌతాఫ్రికా ఆరు బంతుల్లో రెండు బౌల్డ్‌లు చేయగా.. విండీస్ ఒక్క బౌల్డ్ కూడా చేయలేకపోయింది.దీంతో సౌతాఫ్రికా విజేతగా నిలిచింది. కాగా ఛాన్నాళ్ల తర్వాత ప్రొపిషనల్ క్రికెట్ ఆడిన సఫారీ దిగ్గజం ఎబీ డివిలియర్స్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.Bowl-Out Decides SA vs WI Thriller 🍿You can't write this drama! After the match ended in a tie, South Africa Champions edge out the Windies Champions 2-0 in a tense bowl-out 🎯#WCL2025 pic.twitter.com/lemLX9R0Ac— FanCode (@FanCode) July 19, 2025 -
అన్నా.. నీవు ఇప్పటికి మారలేదా? పాక్ ఆటగాడిపై సెటైర్లు
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025) టోర్నమెంట్‌ను పాకిస్తాన్ ఛాంపియన్స్ విజయంతో ఆరంభించింది. శుక్రవారం ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించినప్పటికి.. ఆ జట్టు వికెట్ కీపర్ కమ్రాన్ ఆక్మల్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు.తొలుత బ్యాటింగ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన ఆక్మల్.. అనంతరం ఫీల్డింగ్‌లో గల్లీ స్ధాయి వికెట్ కీపర్‌ను తలపించాడు. షోయబ్ మాలిక్ బౌలింగ్‌లో ఆక్మల్ ఈజీ స్టంపింగ్‌ను మిస్ చేసి నవ్వులు పాలయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన షోయబ్ మాలిక్.. ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ మస్టర్డ్‌కు ఫుల్ ఔట్‌సైడ్ ఆఫ్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని మస్టర్డ్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి పిచ్ అయిన వెంటనే షర్ఫ్గా టర్న్ అవుతూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. నేరుగా చేతి లోకి వెళ్లిన బంతిని అందుకోలేక స్టంప్ ఔట్ చేసే అవకాశాన్ని కమ్రాన్ కోల్పోయాడు.దీంతో 23 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మస్టర్డ్ ఏకంగా హాఫ్ సెంచరీ బాదేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో నెటిజన్లు నీవు అన్నా.. నీవు ఇప్పటికి ఇంకా మారలేదా? అంటూ ట్రోలు చేస్తున్నారు. కాగా ఆక్మల్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే సమయంలో కూడా ఇటువంటి వికెట్ కీపింగ్‌తో చాలా మ్యాచ్‌ల్లో పాక్ కొంపముంచాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ ఇచ్చిన ఈజీక్యాచ్ను జారవిడిచిన ఆక్మల్.. పాక్ ఓటమికి కారణమయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఆరంభంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న టేలర్.. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుత మ్యాచ్‌లో పాక్ గెలవకపోయింటే అందుకు ఆక్మల్ కారణమయ్యేవాడు.చదవండి: ODI WC 2011: యువీని సెలక్ట్ చేద్దామా?.. ధోని నిర్ణయం మాత్రం అదే!Kamran Akmal Wicket keeping -Then, Now & Forever.....His wicket keeping costs Shoaib Akhter career - Ross Taylor assault in 2011 WC.#WCL2025 pic.twitter.com/HNcMCLRXUE— alekhaNikun (@nikun28) July 19, 2025 -
WCL 2025: హఫీజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన పాకిస్తాన్
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025) టోర్నమెంట్‌కు శుక్రవారం తెర లేచింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ టీ20 టోర్నీ తాజా సీజన్ తొలి మ్యాచ్‌లో.. ఇంగ్లండ్ చాంపియన్స్- పాకిస్తాన్ చాంపియన్స్ (ENG vs PAK)తో తలపడింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ చాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు కమ్రాన్ అక్మల్ (8), షార్జీల్ ఖాన్ (12) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఉమర్ అమీన్ (6) కూడా నిరాశపరిచాడు.హఫీజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ఇలా టాపార్డర్ కుదేలైన వేళ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 34 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. మిగతా వారిలో ఆమీర్ యామిన్ (13 బంతుల్లో 27 నాటౌట్) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.ఇక ఇంగ్లండ్ చాంపియన్స్ బౌలర్లలో లియామ్ ప్లంకెట్, క్రిస్ ట్రెమ్లెట్ రెండేసి వికెట్లు కూల్చగా.. విన్స్, మాస్కరన్హస్, ఆర్జే సైడ్‌బాటమ్, స్టువర్ట్ మీకర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడిన ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు.ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠఓపెనర్ ఫిల్ మస్టర్డ్ (58) అర్ధ శతకంతో రాణించగా.. మరో ఓపెనర్ సర్ అలిస్టర్ కుక్ (7)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన జేమ్స్ విన్స్ (7) విఫలమయ్యారు. ఆఖర్లో ఇయాన్ బెల్ (35 బంతుల్లో 51).. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (16)తో కలిసి జట్టును గెలుపుతీరాలకు చేర్చే దిశగా పయనించాడు. అయితే, ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో పాకిస్తాన్ బౌలర్ సొహైల్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేసి.. బెల్‌పై పైచేయి సాధించాడు.ఇయాన్ బెల్ పోరాటం వృథాఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 155 పరుగుల వద్ద నిలిచిన ఇంగ్లండ్ చాంపియన్స్.. ఐదు పరుగుల స్వల్ప తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. పాక్ బౌలర్లలో ఆమిర్ యమిన్, రాయిస్, సొహైల్ తన్వీర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికిన మాజీ క్రికెటర్లతో కూడిన ఆరుజట్లు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో తలపడుతున్నాయి. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఈసారి బరిలోకి దిగింది.చదవండి: WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
దిగ్గజ క్రికెటర్లు మరోసారి మైదానంలో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వింటేజ్ ఇన్నింగ్స్‌ను గుర్తుచేసేలా మరోసారి బ్యాట్ ఝులిపించేందుకు యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, జాక్వెస్ కలిస్.. వికెట్ల వేట కొనసాగించేందుకు బ్రెట్ లీ, ఇమ్రాన్ తాహిర్ వంటి మాజీలు సన్నద్ధమయ్యారు. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)తో వినోదం పంచేందుకు సై అంటున్నారు. మరి టీ20 టోర్నమెంట్ షెడ్యూల్, జట్లు, ప్రత్యక్ష ప్రసారం తదితర అంశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆరు జట్లు ఈ టీ20 టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇందులో భాగమయ్యాయి.బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇండియా చాంపియన్స్ జట్టుకు సహ యజమానిగా ఉన్నాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. నాకౌట్స్ ద్వారా విజేత ఎవరో తేలుతుంది. ఇండియా చాంపియన్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.జట్లుఇండియా చాంపియన్స్యువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్దార్థ్ కౌల్, గురుకీరత్ మాన్.ఆస్ట్రేలియా చాంపియన్స్షాన్ మార్ష్, ఆరోన్ ఫించ్, కల్లమ్ ఫెర్గూసన్, టిమ్ పైన్ (వికెట్ కీపర్), బెన్ డంక్, డేనియల్ క్రిస్టియన్, బ్రెట్ లీ (కెప్టెన్), బ్రాడ్ హాడిన్, క్రిస్ లిన్, రాబ్ క్వినీ, జాన్ హేస్టింగ్స్, జేవియర్ దొహర్టి, మోజెస్ హెండ్రిక్స్, పీటర్ సిడిల్, నాథన్-కౌల్టర్ నీల్, డిర్క్ నాన్స్.సౌతాఫ్రికా చాంపియన్స్హర్షల్ గిబ్స్, హషీం ఆమ్లా, ఏబీ డివిలియర్స్, జేపీ డుమిని, జేజే స్మట్స్, డేన్ విల్లాస్, రిచర్డ్ లెవీ, నీల్ మెకంజీ, ఎస్జే ఎర్వీ, మోర్నీ మ్యాన్ విక్, జాక్వెస్ కలిస్, క్రిస్ మోరిస్, రియాన్ మెక్లారెన్, అల్బీ మోర్కెల్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్, వైన్ పార్నెల్, రోరీ క్లెన్‌వెల్ట్, హార్డస్ విల్జోన్, ఆరోన్ ఫంగిసో, డువాన్ ఓలీవర్.పాకిస్తాన్ చాంపియన్స్సర్ఫరాజ్ అహ్మద్, యూనిస్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్, షోయబ్ మసూద్, మిస్బా ఉల్ హక్, షార్జిల్ ఖాన్, ఆసిఫ్ అలీ, షాహిద్ ఆఫ్రిది, ఇమాద్ వాసిం, షోయబ్ మాలిక్, ఆమేర్ యామిన్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, సొహైల్ తన్వీర్, రమన్ రాయీస్.ఇంగ్లండ్ చాంపియన్స్కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, అలిస్టర్ కుక్, ఫిలిప్ మస్టార్డ్, ఇయాన్ బెల్, క్రిస్ షోఫీల్డ్, టిమ్ ఆంబ్రోస్, రవి బొపారా, సమిత్ పటేల్, మొయిన్ అలీ, దిమిత్రి మస్కార్హ్నస్, స్టువర్ట్ మేకర్, రియాన్ సైడ్‌బాటమ్, లియామ్ ప్లంకెట్, టిమ్ బ్రెస్నాన్, సాజిద్ మహమూద్, అజ్మల్ షెహజాద్.వెస్టిండీస్ చాంపియన్స్క్రిస్ గేల్, శివ్‌నరైన్ చందర్‌పాల్, జొనాథన్ కార్టర్, చాడ్విక్ వాల్టన్, విలియమ్ పెర్కిన్స్, డేవ్ మహ్మద్, క్రిస్ గేల్, డారెన్ సామీ, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, డ్వేన్ స్మిత్, షెల్డన్ కార్టెల్, సామ్యూల్ బద్రీ, షనన్ గాబ్రియెల్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, రవి రాంపాల్, ఆష్లే నర్స్, నికిత మిల్లర్, సులేమాన్ బెన్.షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం👉జూలై 18 (శుక్రవారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 19 (శనివారం): వెస్టిండీస్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 19 (శనివారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 20 (ఆదివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 22 (మంగళవారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 22 (మంగళవారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 23 (బుధవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 24 (గురువారం): సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 26 (శుక్రవారం): పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 26 (శనివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 26 (శనివారం): పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 27 (ఆదివారం): సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 27 (ఆదివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 29 (మంగళవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 29 (మంగళవారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 31 (గురువారం): తొలి సెమీ ఫైనల్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 31 (గురువారం): రెండో సెమీ ఫైనల్- రాత్రి 9 గంటలకు👉ఆగష్టు 2 (శనివారం): ఫైనల్- రాత్రి 9 గంటలకు.వేదికలు: ది ఓవల్, ఎడ్జ్‌బాస్టన్, హెడింగ్లీ, గ్రేస్ రోడ్, నార్తాంప్టన్ మైదానాలు.ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ?👉ఇండియాలో..టీవీ: స్టార్ స్పోర్ట్స్ 1డిజిటల్/ఓటీటీ: ఫ్యాన్‌కోడ్👉అమెరికా, కెనడాలో: విల్లో టీవీ👉యునైటెడ్ కింగ్డమ్: టీఎన్టీ స్పోర్ట్స్👉ఆస్ట్రేలియా: ఫాక్స్ స్పోర్ట్స్ స్ట్రీమ్, కయో స్పోర్ట్స్.👉సౌతాఫ్రికా: సూపర్‌స్పోర్ట్.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? -
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) సీజన్ 2 కోసం ఇండియా ఛాంపియన్స్ మెనెజ్‌మెంట్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి ఎంపికయ్యాడు. 2024లో అరంగేట్ర ఎడిషన్‌లో యువీ సారథ్యంలోనే భారత జట్టు విజేతగా నిలిచింది.ఇక ఈ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో శిఖర్ ధావన్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో ఇండియా జట్టు సమతుల్యంగా కన్పిస్తోంది.పేస్ బౌలింగ్ విభాగంలో వరుణ్ ఆరోన్, సిద్ధార్థ్ కౌల్, వినయ్ కుమార్ చోటు దక్కించుకోగా.. స్పిన్ బాధ్యతలు హర్భజన్, పియూష్ చావ్లా, పవన్ నేగి నిర్వహించనున్నారు. ఇక బ్యాటింగ్ లైనప్‌లో యువీ, ధావన్, సురేష్ రైనా వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.తొలి పోరు పాక్‌తోనే..ఇక డబ్ల్యూసీఎల్ సెకెండ్ సీజన్ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లండ్‌లోని నాలుగు వేదికలలో జరగనుంది. ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ టోర్నీలో భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. ఈ మెగా ఈవెంట్ రౌండ్-రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్దానాల్లో నిలిచే జట్లు సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఇక ఇండియా ఛాంపియన్స్ తమ తొలి మ్యాచ్‌లో జూలై 20న పాకిస్తాన్‌తో తలపడనుంది.ఇండియా ఛాంపియన్స్ జట్టుయువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, గురుకీరత్ మాన్, వినయ్ కుమార్, సిద్దార్థ్ కౌల్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, పవన్ నేగి మిథున్ -
28 బంతుల్లో సెంచరీ.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఏబీ డివిలియర్స్
సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB DE Villiers) మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 (World Championship Of Legends) లీగ్ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్ (South Africa Champions) జట్టులో జాయిన్ కానున్నాడు. ఈ లీగ్‌లో ఏబీడీ సౌతాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌతాఫ్రికా జట్టులో ఏబీడీతో పాటు హషీమ్ ఆమ్లా, క్రిస్ మోరిస్, అల్బీ మోర్కెల్, వేన్ పార్నెల్, హార్డస్ విల్యోన్, ఆరోన్ ఫాంగిసో తదితర దిగ్గజాలు ఉన్నారు.2021 నవంబర్‌లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీడీ.. ఇటీవలే ఓ సారి బ్యాట్ పట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడి తన సహజ శైలిలో రెచ్చిపోయాడు. ఆ మ్యాచ్‌లో టైటాన్స్ లెజెండ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఏబీడీ.. బుల్స్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇందులో 15 సిక్సర్లు ఉన్నాయి.ఆ మ్యాచ్ తర్వాత ఏబీడీ తిరిగి జులైలో బ్యాట్ పట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్టు ఏబీడీని సంప్రదించగా.. అతను ఒప్పుకున్నాడు. 41 ఏళ్ల ఏబీడీ తన అభిమానుల కోసమే ఈ లీగ్‌లో ఆడటానికి ఒప్పుకున్నానని చెప్పాడు.కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ 2025 ఇంగ్లండ్ వేదికగా జులైలో జరుగనుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్, నార్తంప్టన్, లీడ్స్, లీసెస్టర్ నగరాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు (ఇండియా ఛాంపియన్స్, దక్షిణాఫ్రికా ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, ఇంగ్లాండ్ ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్ మరియు పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటాయి. ఈ లీగ్‌లో ఇది రెండో ఎడిషన్. గతేడాది ఈ లీగ్ పురుడు పోసుకుంది. గతేడాది కూడా జులైలో జరిగిన ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత్ పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. అంబటి రాయుడు 50, యూసఫ్ పఠాన్ 30 పరుగులు చేసి భారత్ విజయంలో ప్రధాన పాత్రలు పోషించారు.ఏబీడీ కెరీర్ విషయానికొస్తే.. ఈ ప్రొటీస్ విధ్వంసకర బ్యాటర్ దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడి 20,014 పరుగులు చేశాడు. ఏబీడీ తన అంతర్జాతీయ కెరీర్లో 47 సెంచరీలు, 99 అర్ద సెంచరీలు సాధించాడు. ఏబీడీ 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా వన్డేల్లో ఇప్పటికి అతని పేరిటే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉంది. 2015లో జోహనెస్‌బర్గ్‌లో అతను వెస్టిండీస్‌పై 31 బంతుల్లో సెంచరీ చేశాడు. ఏబీడీకి ఐపీఎల్‌లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. లీగ్ ప్రారంభం నుంచి క్యాష్ రిచ్ లీగ్ ఆడిన ఏబీడీ 2021లో రిటైరయ్యాడు. ఈ లీగ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడిన ఇతను.. 184 మ్యాచ్‌ల్లో 151.68 స్ట్రైక్-రేట్‌తో 5162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
సౌతాఫ్రికా కెప్టెన్‌గా డివిలియర్స్.. టీ20 టోర్నీతో రీఎంట్రీ
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(AB De Villiers) పునరాగమనానికి రంగం సిద్ధమైంది. మరోసారి అతడు ప్రొటిస్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని డివిలియర్స్ మంగళవారం స్వయంగా ప్రకటించాడు. తాను రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.కాగా సౌతాఫ్రికా(South Africa) తరఫున 2004లో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తనదైన బ్యాటింగ్ శైలితో లెజెండ్‌గా ఎదిగాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సౌతాఫ్రికా జట్టు కెప్టెన్‌గానూ పనిచేసిన అనుభం ఉంది. ఇక ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. తన ఇంటర్నేషనల్ కెరీర్లో 114 టెస్టు మ్యాచ్‌లు ఆడి 8765 పరుగులు చేశాడు.అదే విధంగా 228 వన్డేల్లో కలిపి 9577 రన్స్ సాధించాడు. ఇక ప్రొటిస్ జట్టు తరఫున 78 టీ20 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ 1672 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో డివిలియర్స్ 22 టెస్టు సెంచరీలు, 25 వన్డే శతకాలు నమోదు చేశాడు.ఐపీఎల్‌లోనూ హవాఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చాలా ఏళ్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుకు ఆడాడు ఏబీ డివిలియర్స్. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో మొత్తంగా 184 మ్యాచ్‌లు ఆడి.. మూడు శతకాల సాయంతో 5162 పరుగులు చేశాడు.ఈ క్రమంలో నలభై ఏళ్ల ఏబీ డివిలియర్స్ 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కుటుంబంతో కలిసి సమయం గడపడంతో పాటు.. సేవా కార్యక్రమాలు, బ్రాడ్‌కాస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. యూట్యూబర్‌గానూ అభిమానులకు ఎల్లప్పుడూ చేరువగా ఉంటున్న మిస్టర్ ‘360’.. కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని ఉందంటూ ఇటీవలే రీఎంట్రీ గురించి సంకేతాలు ఇచ్చాడు.తాజాగా తన పునరాగమనాన్ని ఖరారు చేస్తూ వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship of Legends- WCL) బరిలో దిగనున్నట్లు ఏబీడీ ప్రకటించాడు. ‘‘నాలుగేళ్ల క్రితం నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను.ఇక నాలో క్రికెట్ ఆడే కోరిక మిగిలి లేదని భావించి నా నిర్ణయాన్ని వెల్లడించాను. కాలం గడిచింది. ఇప్పుడు నా కుమారులు నాలో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. మళ్లీ క్రికెట్ ఆడేలా ప్రేరేపించారు. నా పిల్లలతో కలిసి ఆడిన ప్రతిసారి.. తిరిగి మైదానంలో దిగాలనే కోరిక బలపడింది. అందుకే జిమ్‌కు తరచుగా వెళ్లి వ్యాయామం చేయడంతో పాటు.. నెట్స్‌లోనూ ప్రాక్టీస్ చేస్తున్నా. జూలైలో జరిగే డబ్ల్యూసీఎల్ టోర్నీకి నేను సంసిద్ధంగా ఉన్నాను’’ అని డివిలియర్స్ తెలిపాడు.ఆరు జట్లుకాగా డబ్ల్యూసీఎల్ ఒక ప్రీమియర్ టీ20 టోర్నమెంట్. ఇందులో రిటైర్ అయిన, నాన్- కాంట్రాక్ట్ క్రికెట్ దిగ్గజాలు ఆడతారు. గతేడాది డబ్ల్యూసీఎల్ తొలి ఎడిషన్ జరిగింది. భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇందులో పాల్గొనగా.. భారత్ మొట్టమొదటి చాంపియన్‌గా అవతరించింది. ‘సిక్సర్ల కింగ్’ యువరాజ్ సింగ్ సారథ్యంలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఇక ఈసారి ఈ లీగ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్ బరిలోకి దిగనుండటం అదనపు ఆకర్షణ కానుంది. కాగా ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగష్టు 2 వరకు ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 టోర్నీ జరుగనుంది. సౌతాఫ్రికా తరఫున గత సీజన్లో జాక్వెస్ కలిస్, హర్షల్ గిబ్స్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్ తదితరులు బరిలోకి దిగారు.చదవండి: Ind vs Pak: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. డబ్ల్యూసీఎల్ షెడ్యూల్ విడుదల -
Ind vs Pak: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త!.. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship Of Legends T20 League) రెండో సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీ షెడ్యూల్‌ను నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు. కాగా భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ తదితర ఆరు జట్లు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(WCL)లో భాగమవుతున్న విషయం తెలిసిందే.యువీ కె ప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లో ఆయా దేశాలకు ప్రాతినిథ్యం వహించిన టాప్ క్రికెటర్లు ఈ టీ20 లీగ్‌తో మరోసారి వినోదాన్ని పంచుతున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రవేశపెట్టిన WCLలో ఇండియా చాంపియన్స్ జట్టు ఫైనల్లో.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చాంపియన్స్ టీమ్‌పై గెలుపొందింది. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో.. దాయాదిని ఐదు వికెట్ల తేడాతో ఓడించి WCLలో మొట్టమొదటి చాంపియన్‌గా నిలిచింది.పాక్‌ను ఓడించి టైటిల్ కైవసంపాక్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి టైటిల్ కైవసం చేసుకుంది. ఇక వచ్చే ఏడాది లీగ్ దశలో భాగంగా భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మధ్య జూలై 20న తొలి మ్యాచ్ జరుగనుంది. కాగా ఇంగ్లండ్ వేదికగా WCL టోర్నీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 షెడ్యూల్👉జూలై 18- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 19- వెస్టిండీస్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 19- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 20- ఇండియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 22- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 22- ఇండియా చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 23- ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 24- సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్👉జూలై 25- పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 26- ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 27- సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 27- ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్👉జూలై 29- ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 29- ఇండియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 31- సెమీ ఫైనల్ 1(ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హాం)👉జూలై 31- సెమీ ఫైనల్ 2(ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హాం)👉ఆగష్టు 2- ఫైనల్(ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హాం).చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!?