
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో పాకిస్తాన్‌తో జరగాల్సిన సెమీఫైనల్‌ను ఇండియా ఛాంపియన్స్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. పాక్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా యువరాజ్ సింగ్ బృందం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే విషయంపై పాకిస్తాన్ ఛాంపియన్స్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు.
ఇండియా జట్టు తీసుకున్న నిర్ణయం తమను నిరాశపరిచిందని అఫ్రిది అన్నాడు. కాగా ఈ లెజెండ్స్ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ జట్టు తొలుత పాకిస్తాన్‌తో లీగ్ స్టేజి మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసింది. దీంతో మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే యాదృఛ్చికంగా భారత్-పాకిస్తాన్ జట్లు తొలి సెమీఫైనల్లో తలపడాల్సి వచ్చింది.
అయితే లీగ్ స్టేజిలో పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన భారత జట్టు.. కీలకమైన సెమీస్‌లో ఆడుతుందా? అన్న సందేహం నెలకొంది. అంతలోనే సెమీస్‌కు ముందు షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు యువీ అండ్ కోనే కాకుండా ప్రతీ భారత పౌరుడికి కూడా ఆక్రోశం తెప్పించింది.
‘‘భారత జట్టు ఏ ముఖం పెట్టుకుని మాతో ఆడుతుందో చూడాలని ఉంది. మాతో ఆడటం తప్ప వాళ్లకు ఇప్పుడు మరోదారి లేదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. అందుకు కౌంటర్‌గా కొద్ది గంటల్లోనే సెమీఫైనల్‌ను బహిష్కరిస్తూ భారత జట్టు ప్రకటన విడుదల చేసింది. అయితే అప్పుడు భారత జట్టుపై విషం చిమ్మిన అఫ్రిది.. ఇప్పుడు మొసలి కన్నీరు కరుస్తున్నాడు.
"ఇరు దేశాల మధ్య దౌత్యాన్ని అభివృద్ధి చేయడానికి క్రికెట్‌కు మించిన క్రీడా మరొకటి లేదు. గతంలోనూ భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు అంత మంచిగా లేవు. కానీ క్రీడల్లో మాత్రం ఎటువంటి తారతామ్యాలు కన్పించేవి కావు. ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగాలి.
క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతడి వ్యాఖ్యలు భారత క్రికెట్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. నీవు మారవా అఫ్రిది అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా శనివారం జరగనున్న ఫైనల్లో సౌతాఫ్రికా ఛాంపియన్స్, పాక్ ఛాంపియన్స్ తలపడనున్నాయి.
Shahid Afridi's Statement after India 🇮🇳 Champions refused to play against Pakistan 🇵🇰 Champions in WCL Semi Final 🧐
A must watch video 👇🏻 pic.twitter.com/dCwxEs02iF— Richard Kettleborough (@RichKettle07) August 1, 2025