చూస్తూ ఊరుకోవాలా? అంపైర్‌పై కేఎల్ రాహుల్ ఫైర్‌! వీడియో వైర‌ల్‌ | KL Rahul Facing Post-match Chat With Umpires After Spat With Kumar Dharmasena, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

IND vs ENG: చూస్తూ ఊరుకోవాలా? అంపైర్‌పై కేఎల్ రాహుల్ ఫైర్‌! వీడియో వైర‌ల్‌

Aug 2 2025 9:05 AM | Updated on Aug 2 2025 11:32 AM

KL Rahul facing post-match chat with umpires after spat with Kumar Dharmasena

ది ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య జ‌రుగుతున్న ఐదో టెస్టులో ఆట‌తో పాటు మాటలు కూడా హైలెట్‌గా నిలుస్తున్నాయి. రెండో రోజు ఆట సంద‌ర్బంగా అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇంగ్లండ్ ఓపెన‌ర్ బెన్ డ‌కెట్‌ను ఔట్ చేసిన అనంత‌రం ఆకాష్ దీప్ అత‌డి భుజంపై చెయ్యి వేసి మ‌రి సెంఢాప్ ఇవ్వ‌డం.. మైదానంలో ప్ర‌శాంతంగా ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే జో రూట్, ప్ర‌సిద్ధ్ కృష్ణతో గొడవపడడం వంటి సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం ఆన్‌ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేనతో మాటల యుద్దానికి దిగాడు.

అసలేమి జరిగిందంటే?
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో జో రూట్.. ఐదో బంతిని థర్డ్‌ మ్యాన్‌ మీదుగా బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో రూట్ వైపు చూస్తూ ప్రసిద్ద్ ఏదో అన్నాడు. దీం‍తో రూట్ కూడా బదులుగా కృష్ణపై సీరియస్ అయ్యాడు.

అంతేకాకుండా రూట్ అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ప్రసిద్ద్ మద్దతుగా కేఎల్ రాహుల్ నిలిచాడు. గొడవ దేని గురించి అని తెలుసుకోవడానికి కుమార్ ధర్మసేనతో రాహుల్ మాట్లాడాడు. కానీ ధర్మసేన ఇచ్చిన సమాధానంపై కేఎల్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో కాసేపు అంపైర్‌తో రాహుల్ వాదించాడు. ఆ తర్వాత ఎవరి ఫీల్డింగ్ స్దానాలకు వారు వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.

అంపైర్‌-రాహుల్ మధ్య జరిగిన సంభాషణ ఇదే..
రాహుల్: మమ్మల్ని ఏం చేయమంటారు? నిశ్శబ్దంగా ఉండమంటారా?

ధర్మసేన: ఏ బౌలర్ అయినా నీ దగ్గరికి వచ్చి గొడవ పడితే నీకు నచ్చుతుందా రాహుల్‌?  ప్ర‌సిద్ద్ అలా చేయ‌డం క‌ర‌క్ట్ కాదు. మ‌నం అలా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు.

రాహుల్: అవ‌త‌లి వ్య‌క్తి మ‌మ్మ‌ల్ని దూషిస్తే.. చూస్తూ ఊరుకోవాలా?  బ్యాటింగ్‌, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్ల‌మంటారా?

ధర్మసేన: మ్యాచ్ ముగిశాక మనం మాట్లాడదాం. నువ్వు అలా మాట్లాడడం మాత్రం స‌రికాదు

ఈ సంభాషణంతా స్టంప్ మైక్‌లో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్‌  18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్‌(51), ఆకాష్ దీప్‌(4) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.
చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్‌..

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement