breaking news
Oval Test
-
ఒక్క సిక్స్‌తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఫిట్నెస్ సమస్యల వల్ల ఈ టూర్లో కేవలం మూడు టెస్టులే ఆడగా.. అతడి గైర్హాజరీలో ఈ హైదరాబాదీ బౌలర్ పేస్ దళాన్ని ముందుండి నడిపించాడు.సిరీస్ మొత్తానికే హైలైట్అలుపున్నదే ఎరుగక ఐదు టెస్టుల్లోనూ అవిరామంగా ఆడి.. ఈ సిరీస్‌లో వెయ్యికి పైగా బంతులు బౌల్ చేశాడు సిరాజ్. మొత్తంగా ఐదు టెస్టుల్లో కలిపి 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. ఇక ఆఖరిదైన ఐదో టెస్టులో చివరి రోజు సిరాజ్ ఆట సిరీస్ మొత్తానికే హైలైట్‌గా నిలిచిందని చెప్పవచ్చు.ముఖ్యంగా.. తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ గెలుపునకు ఏడు పరుగుల దూరంలో ఉన్న వేళ సిరాజ్.. ఆఖరి వికెట్ కూల్చి భారత్‌ను విజయతీరాలకు చేర్చిన తీరు చిరకాలం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. అయితే, నరాలుతెగే ఉత్కంఠ నెలకొన్న ఆ తరుణంలో తాను ఎలాంటి వ్యూహాన్ని అమలు చేశానో సిరాజ్ తాజాగా వెల్లడించాడు.సింగిల్స్‌తో మేనేజ్ చేసిన అట్కిన్సన్ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయిన తర్వాత గస్ అట్కిన్సన్కు క్రిస్ వోక్స్ తోడయ్యాడు. భుజం విరిగినప్పటికీ జట్టు కోసం వోక్స్ అప్పుడు క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో సింగిల్స్‌తో మేనేజ్ చేసిన అట్కిన్సన్.. ఓవర్లో ఆఖరి బంతికి కూడా సింగిల్తీసి స్ట్రైక్ తనే అట్టిపెట్టుకుంటూ వోక్స్‌కు ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు.ఈ క్రమంలో సిరాజ్.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి రనౌట్‌కు ప్లాన్ చేయగా.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కారణంగా అది మిస్సయింది. ఆ తర్వాత సిరాజ్ తన వ్యూహం మార్చేసి అద్భుత డెలివరితో అట్కిన్సన్ను బౌల్డ్ చేయడంతో టీమిండియా విజయం ఖరారైంది.ఒక్క సిక్స్‌తో అంతా తలకిందులయ్యేదితాజాగా ఇందుకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సిరాజ్.. ‘‘ఒక ఓవర్లో నేను యార్కర్ వేశాను. అలాంటి సందర్భంలో మరుసటి బంతి లెంగ్త్ బాల్‌గా సంధిస్తారని బ్యాటర్ అనుకుంటాడు. అంతేకాదు.. అంతకుముందు నేను వేసిన లెంగ్త్ బాల్‌ను అతడు సిక్సర్‌గా మలిచాడు.నేను బౌలింగ్ చేసేందుకు పరుగు మొదలుపెట్టినపుడు నా బౌలింగ్ శైలి ఎలా ఉండాలో నిర్ణయించుకుంటా. విజయానికి ఆరు పరుగులు.. వాళ్లు ఒక్క సిక్సర్ కొట్టినా మ్యాచ్ మా నుంచి చేజారిపోతుంది.అందుకే నేను బ్యాటర్‌ను తికమకపెట్టి బౌల్డ్ చేయడం ద్వారా ఫలితాన్ని మార్చివేయగలిగాను. నేను ఎలా బౌలింగ్ చేయాలనుకున్నానో దానిని పక్కాగా అమలు చేసి సఫలమయ్యాను. నిజంగా అదో అద్భుత అనుభవం.ఐదు రోజుల పాటు ఆసక్తిగా సాగిన టెస్టు మ్యాచ్‌లో ఆఖరి రోజు చివర్లో గెలవడం సూపర్‌గా అనిపించింది. నా మనసు ఎంతో ప్రశాంతంగా మారిపోయింది’’ అని పేర్కొన్నాడు. తనకు ఈ మ్యాచ్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని సిరాజ్ రెవ్‌స్పోర్ట్స్‌తో చెప్పుకొచ్చాడు.2-2తో సమంగాకాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ-2025లో భాగంగా జూన్ 20- ఆగష్టు 4 వరకు ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఐదు టెస్టులు జరిగాయి. లీడ్స్‌లో ఇంగ్లండ్.. బర్మింగ్‌హామ్‌లో భారత్ గెలవగా.. లార్డ్స్‌లో మరోసారి ఆతిథ్య జట్టుదే పైచేయి అయింది. ఈ క్రమంలో మాంచెస్టర్ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. ఓవల్‌లో విజయం సాధించి 2-2తో సమం చేసింది.చదవండి: Sachin Tendulkar: ‘అతడొక గొప్ప టెస్టు ప్లేయర్.. చూడగానే కెప్టెన్ అవుతాడని చెప్పాను’ -
‘సిరాజ్‌ను ఆగమని నేనెలా చెప్తా.. గెలిస్తే చాలు దేవుడా అనుకున్నా’
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు మంచి ఆరంభమే లభించింది. అతడి సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-2తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య జరిగిన ఈ ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో గిల్ 754 పరుగులు సాధించి.. టాప్ రన్ స్కోరర్‌గానూ నిలిచాడు.సిరాజ్.. సూపర్హిట్ఇక టీమిండియా ఇంగ్లండ్‌తో సిరీస్‌ను సమం చేసుకోవడంలో పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)ది కీలక పాత్ర. ముఖ్యంగా ఆఖరిదైన ఓవల్ టెస్టులో చివరి రోజు ఈ హైదరాబాదీ బౌలర్ అద్భుతమే చేశాడు. విజయానికి ఇంగ్లండ్ 35 పరుగులు.. భారత్ నాలుగు వికెట్ల దూరంలో ఉన్న వేళ.. ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) ఒక వికెట్ తీయగా... సిరాజ్ మూడు వికెట్లు కూల్చి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.అయితే, ఐదో టెస్టు ఆఖరి రోజు ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోగానే.. భుజం విరిగినప్పటికీ టెయిలెండర్ క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు.అప్పటికి క్రీజులో ఉన్న అట్కిన్సన్ వోక్స్‌కు ఇబ్బంది కలగకుండా తానే సింగిల్స్ తీస్తూ.. ఓవర్ ముగిసే సరికి తానే క్రీజులోకి వచ్చేలా చూసుకున్నాడు.రనౌట్ ప్లాన్ఈ క్రమంలో కెప్టెన్ గిల్‌తో కలిసి సిరాజ్ ఈ జోడీని రనౌట్ చేయాలని ప్రణాళిక రచించారు. ఇందుకు అనుగుణంగా నాటి మ్యాచ్ 84 ఓవర్లో వైడ్ యార్కర్ వేయాలని వీరు ప్లాన్ చేశారు. ఇక సిరాజ్ సంధించిన డెలివరీని మిస్సయినప్పటికీ.. అట్కిన్సన్ సింగిల్ తీసేందుకు వెళ్లాడు. అయితే, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మాత్రం సరైన సమయంలో బంతిని అందుకోలేకపోయాడు.దీంతో రనౌట్ ఛాన్స్ మిస్ కాగా.. గిల్‌పై సిరాజ్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. జురెల్‌కు ముందే మన ప్లాన్ చెప్పి ఉండవచ్చు కదా అని అన్నాడు. విజయానంతరం గిల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఇక ధ్రువ్ జురెల్ కూడా తాజా ఈ విషయంపై స్పందించాడు.సిరాజ్‌ను ఆగమని నేనెలా చెప్తా‘‘ఆరోజు అంతా త్వరత్వరగా జరిగిపోయింది. మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బాల్ బాగా స్వింగ్ అవుతోంది. అప్పుడు నా కుడివైపు.. గిల్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ‘యార్.. సిరాజ్ ఇప్పుడు వైడ్ యార్కర్ వేయబోతున్నాడు’ అని నాతో చెప్పాడు.అయితే, నేను బదులిచ్చేలోపే సిరాజ్ బౌలింగ్ వేసేందుకు తన పరుగు మొదలుపెట్టాడు. అప్పుడు.. ‘నువ్వు కాస్త ఆగు’ అని సిరాజ్‌కు చెప్పడం సరికాదనిపించింది. నేను కుదురుకునేలోపే సిరాజ్ బంతి వేయడం.. బ్యాటర్లు పరుగుకు వెళ్లడం జరిగిపోయింది.గెలిస్తే చాలు దేవుడా అనుకున్నానిజానికి అది రనౌట్ కావాల్సింది. కానీ.. నా చేతుల్లో గ్రిప్ అంతగా లేదు. సరైన సమయంలో స్పందించలేకపోయాను. అప్పుడు ఒకటే అనుకున్నా.. ‘దేవుడా.. ఎలాగైనా మమ్మల్ని ఈ మ్యాచ్‌లో గెలిపించు’’ అని ప్రార్థించా.ఆరోజు రనౌట్ చేసేందుకు నాకు మంచి అవకాశం ఉంది. కానీ నేను మిస్సయిపోయా. ఏదేమైనా సిరాజ్ ఆరోజు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మేము కచ్చితంగా మ్యాచ్ గెలుస్తామని అనుకున్నాం. అనుకున్నదే జరిగింది’’ అని ధ్రువ్ జురెల్ పేర్కొన్నాడు. వివేక్ సేతియా పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదికాగా రనౌట్ ప్రమాదం నుంచి అట్కిన్సన్- వోక్స్ తప్పించుకునే సమయానికి ఇంగ్లండ్ విజయానికి కేవలం ఎనిమిది పరుగుల దూరంలో ఉంది. ఒకవేళ జురెల్ రనౌట్ మిస్ చేసిన తర్వాత.. సిరాజ్ అట్కిన్సన్ను బౌల్డ్ చేయకపోయి ఉంటే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. ఎట్టకేలకు ఆఖరికి ఆరు పరుగుల తేడాతో ఓవల్‌లో గెలిచి 2-2తో సిరీస్‌ను సమం చేయగలిగింది.చదవండి: ఛతేశ్వర్ పుజారా నెట్‌వర్త్ ఎంతో తెలుసా? -
అదొక హేయమైన చర్య: టీమిండియా మేనేజ్మెంట్పై మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయంతో బాధపడుతున్న ఆటగాడిపై కనికరం చూపకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. కొంతమంది ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేసి.. మరికొందరిని మాత్రం రేసు గుర్రాల్లా ఎందుకు పరుగెత్తిస్తున్నారంటూ మండిపడ్డాడు.అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్ (IND vs ENG)తో చావోరేవో తేల్చుకోవాల్సిన ఐదో టెస్టులో టీమిండియా ఆఖరి వరకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఓవల్ టెస్టులో భారత్ విధించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111) శతకాలతో చెలరేగి తమ జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.ఇంజక్షన్ తీసుకున్నావా?ఆరంభంలోనే ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. ఈ తరుణంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. పేసర్ ఆకాశ్ దీప్‌ను ఉద్దేశించి.. ‘‘ఇంజక్షన్ తీసుకున్నావా’’ అంటూ ఆరా తీయడం స్టంప్ మైకులో రికార్డయింది. కాగా వెన్నునొప్పి వల్ల నాలుగో టెస్టుకు దూరమైన ఈ రైటార్మ్ పేసర్‌కు.. ఐదో టెస్టులోనూ కాలికి గాయమైంది. అయినా సరే అతడిని ఆటలో కొనసాగించారు.ఎట్టకేలకు ఆఖరిదైన ఐదో రోజు టీమిండియా విజయానికి నాలుగు వికెట్లు అవసరం కాగా.. మహ్మద్ సిరాజ్ మూడు, ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీసి జట్టును గెలిపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. ‘‘ఆకాశ్ దీప్ ఇంజక్షన్ తీసుకున్నాడా? లేదా? అన్న విషయం గురించి అడిగినట్లు ఇంగ్లిష్ కామెంట్రీలో స్పష్టంగా వినిపించింది.హేయమైన చర్యఓ బౌలర్‌కు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కూడా టెస్టు మ్యాచ్ ఆడిస్తున్నారా? ఫిట్‌గా ఉన్న లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మాత్రం బెంచ్ మీదే ఉంచుతారు. ఆకాశ్ బదులు అతడిని ఎందుకు ఆడించరు?పూర్తి ఫిట్‌గా లేని ఆటగాడితో బరిలోకి దిగడం నేరం లాంటిదే. హేయమైన తప్పిదం. మీ జట్టులోని మరో ఇద్దరు బౌలర్లు పూర్తి ఫిట్‌గా ఉన్నా వారిని ఆడించరు. రేసుగుర్రాల్లా మిగతావారిని పరిగెత్తిస్తారు.సిరాజ్‌కు విశ్రాంతే లేదుసిరాజ్ను కూడా మీరు వరుస మ్యాచ్‌లలో వాడుకున్నారు. అతడు కూడా పూర్తిగా అలసిపోయాడు. అదే ఇంగ్లండ్ జట్టును చూడండి. వాళ్లు నలుగురు పేస్ బౌలర్లను ఆడించారు. అందులో ఒక్కరు గాయపడినా.. మిగతా ముగ్గురు బాగానే ఉన్నారు.మీకు మాత్రం ముగ్గురంటే ముగ్గురే బౌలర్లు. అందులో ఒకరు సగం సగం ఫిట్‌గా ఉంటారు. అయినా ఇందులో ఆకాశ్ దీప్ తప్పేం లేదు’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు టీమిండియా మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు. ఇదిలా ఉంటే.. పనిభారం తగ్గించే దృష్ట్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఇంగ్లండ్‌లో ఐదింట కేవలం మూడు మ్యాచ్‌లలోనే యాజమాన్యం ఆడించింది.వారిద్దరు ఒక్క మ్యాచ్ ఆడకుండానే..మరోవైపు.. సిరాజ్ మాత్రం ఐదింటిలోనూ ఆడి వెయ్యికి పైగా బంతులు వేసి 23 వికెట్లు కూల్చాడు. ఇక.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోగా.. అర్ష్‌దీప్ సింగ్ టెస్టు అరంగేట్రం కూడా వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని టీమిండియా 2-2తో సమం చేసింది. చదవండి: చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్ -
చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్
టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ Harry Brook) చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. ఓవల్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే.పందొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj).. ఆ వెంటనే బౌండరీ లైన్ తొక్కేశాడు. దీంతో లైఫ్‌లైన్ పొందిన బ్రూక్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ధనాధన్ దంచికొట్టి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.చెవి వెనుక అతికించి.. ఆపైకేవలం 98 బంతుల్లోనే హ్యారీ బ్రూక్.. 111 పరుగులతో సత్తా చాటి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపునకు తిప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో డ్రింక్స్ విరామ సమయంలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. డ్రింక్స్‌తో తన శరీరాన్ని హైడ్రేట్ చేసుకున్న తర్వాత.. చెవి వెనుక అతికించి పెట్టిన చ్యూయింగ్ గమ్ తీసి నోట్లో వేసుకున్నాడు. అంటే అప్పటికి దానిని బాగా నమిలిన బ్రూక్.. డ్రింక్స్ బ్రేక్ కోసం చెవి వెనక పెట్టాడన్న మాట!ఛీ! ఇదేం పని బ్రూక్ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘‘ఛీ! ఇదేం పని బ్రూక్.. చ్యూయింగ్ గమ్ అంటే మరీ ఇంత పిచ్చి ఉంటుందా?’’ అంటూ నెటిజన్లు అతడిని సరదాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆ సమయంలో కామెంటేటర్లు రిక్కీ పాంటింగ్, రవిశాస్త్రి తమదైన శైలిలో బ్రూక్‌పై చణుకులు విసిరారు.ఎక్కడో దాచి ఉంటాడు‘‘రిక్కీ.. నువ్వు చూశావా? అదైతే చెవికి సంబంధించిన వస్తువు కాదు. అది కచ్చితంగా చ్యూయింగ్ గమ్ అని చెప్పగలను’’ అని రవిశాస్త్రి అన్నాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. ఇలాంటిది నేనైతే ఇంతకు ముందెన్నడూ చూడలేదు. నాకు తెలిసి అతడి దగ్గర మరో రెండు పీసులు ఉండి ఉంటాయి. వాటిని ఎక్కడో దాచి ఉంటాడు’’ అని రిక్కీ పాంటింగ్ జోక్ చేశాడు.ఇక ఇందుకు స్పందనగా.. ‘‘అతడు నీళ్లు తాగేశాడు. ఆ వెంటనే గమ్ అతడి నోట్లోకి వెళ్లింది. మళ్లీ బయటకు.. మళ్లీ లోపలకు. ప్రతిసారి అతడు చ్యూయింగ్ గమ్ నములుతూనే ఉంటాడు’’ అని రవిశాస్త్రి అనగానే రిక్కీ పాంటింగ్ గట్టిగా నవ్వేశాడు.టీమిండియా విజయం.. సిరీస్ సమంఇదిలా ఉంటే.. ఓవల్ టెస్టులో బ్రూక్ మెరుపులు వృథా అయ్యాయి. ఆఖరిదైన ఐదో రోజు ఇంగ్లండ్‌కు 35 పరుగులు కావాల్సి ఉండగా.. సిరాజ్ అద్బుత రీతిలో రాణించి ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించాడు. విజయానికి ఆరు పరుగుల దూరంలో ఉన్న వేళ ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి.. టీమిండియాను గెలిపించాడు. ఫలితంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ 2-2తో సమమైంది. హెడింగ్లీ, లార్డ్స్‌లో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్, ఓవల్‌లో టీమిండియా విజయం సాధించింది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు డ్రా అయింది. చదవండి: నువ్వు టీమిండియాలోకి ఎలా వచ్చావో మర్చిపోవద్దు: జైస్వాల్‌తో రోహిత్ View this post on Instagram A post shared by We Are England Cricket (@englandcricket) -
IND vs ENG: అసదుద్దీన్ ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదే.. పోస్ట్ వైరల్
ఇంగ్లండ్ గడ్డ మీద అదరగొట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది. ఓడిపోతామనుకున్న ఆఖరి టెస్టు (IND vs ENG 5th Test)లో అద్భుత ప్రదర్శనతో సిరాజ్ భారత్‌ను గెలిపించిన తీరు.. అమోఘమంటూ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులూ కొనియాడుతున్నారు. ఆల్వేస్ వి న్నర్ఇందులో భాగంగా సిరాజ్ మియాను ఉద్దేశించి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసాపూర్వక ట్వీట్ చేశారు. ‘‘‘ఎల్లప్పుడూ విజేతే.. మన హైదరాబాదీ శైలిలో చెప్పాలంటే.. పూరా ఖోల్ దియే పాషా!’’ అంటూ ఒవైసీ సిరాజ్‌ను అభినందించారు. బౌలర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడని కితాబు ఇచ్చారు. ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదేఇక సిరాజ్ కూడా ఇందుకు బదులిస్తూ.. ‘‘ధన్యవాదాలు సార్.. ఎల్లవేళలా నన్ను ప్రోత్సహిస్తూ చీర్ చేస్తున్నందకు కృతజ్ఞతలు’’ అంటూ హార్ట్ సింబల్‌తో పాటు నమస్కారం పెడుతున్నట్లుగా ఉండే ఎమోజీని షేర్ చేశాడు. సిరాజ్ ఈ మేరకు ఒవైసీకి థాంక్యూ చెబుతూ చేసిన పోస్ట్ అర మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.కెరీర్ బెస్ట్ ర్యాంకులో సిరాజ్ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయాడు. ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో 9 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఈ హైదరాబాదీ బౌలర్.. బుధవారం విడుదల చేసిన ఐసీసీ బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు ఎగబాకాడు. సిరాజ్ 674 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. గతంలో సిరాజ్ అత్యుత్తమంగా 16వ ర్యాంక్ సాధించాడు.ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా (889 పాయింట్లు) అగ్ర స్థానంలో కొనసాగుతుండగా... భారత్ నుంచి రవీంద్ర జడేజా (17వ స్థానం) కూడా టాప్–20లో ఉన్నాడు. టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్ (792 రేటింగ్ పాయింట్లు)కు చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జైస్వాల్ 2 సెంచరీలు సహా మొత్తం 411 పరుగులు చేశాడు.ఈ జాబితాలో జో రూట్ (908) తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకోగా... రిషభ్ పంత్ (8వ), శుబ్‌మన్ గిల్ (13వ)లకు టాప్–20లో చోటు లభించింది. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (405 పాయింట్లు) నిలకడగా నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా... వాషింగ్టన్ సుందర్ 16వ ర్యాంక్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌లో సన్మానం! ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల పోరులో అత్యధికంగా 23 వికెట్లు తీసి సిరీస్‌ను భారత్ సమంగా ముగించడంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ సొంతగడ్డకు చేరుకున్నాడు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో సన్నిహితులు, అభిమానులు అతనికి స్వాగతం పలికారు. ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌తో కలిసి లండన్ నుంచి నేరుగా ముంబైకి చేరుకున్న సిరాజ్ ఆ తర్వాత స్వస్థలానికి వచ్చాడు. వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ వరకు భారత జట్టు ఎలాంటి మ్యాచ్‌లు ఆడటం లేదు.ఈ నేపథ్యంలో నగరంలోనే ఉండనున్న సిరాజ్‌కు త్వరలోనే ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) యోచిస్తోంది. ప్రస్తుతానికి అధ్యక్ష, కార్యదర్శులు వివిధ ఆరోపణలతో జైలులో ఉన్నందుకు ఈ కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: Asia Cup 2025: అతడు భేష్.. ఇతడు ఓకే.. టీమిండియా సెలక్టర్లకు తలనొప్పి! -
నువ్వు గొప్పోడివి సిరాజ్: విరాట్ కోహ్లి సోదరి పోస్ట్ వైరల్
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓవల్ టెస్టు (Oval Test)లో తీవ్రమైన ఒత్తిడి ఉన్నా.. అతడు భారత్‌ను విజయతీరాలకు చేర్చడమే ఇందుకు కారణం. ఇంగ్లండ్ విజయానికి ఏడు పరుగులు.. టీమిండియా గెలుపునకు ఒక వికెట్ కావాల్సిన వేళ సిరాజ్ తనలోని అత్యుత్తమ బౌలర్‌ను వెలికితీసి అద్భుతం చేశాడు.సూపర్ డెలివరీతో గస్ అట్కిన్సన్ (17)ను పదో వికెట్‌గా వెనక్కి పంపి.. ఇంగ్లండ్ ఆట కట్టించాడు. దీంతో ఆఖరిదైన ఐదో టెస్టులో ఆరు పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చడం విశేషం.ఓ పొరపాటు.. తీవ్రమైన ఒత్తిడిఅయితే, ఓవల్ టెస్టులో నాలుగో రోజు ఆటలో భాగంగా సిరాజ్ కారణంగా పెద్ద పొరపాటే జరగింది. హ్యారీ బ్రూక్ (Harry Brook) 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టిన ఈ రైటార్మ్ పేసర్.. అనూహ్యంగా బౌండరీ లైన్ తొక్కేశాడు. దీంతో అవుట్ కావాల్సిన హ్యారీ బ్రూక్ సిక్సర్‌తో పండుగ చేసుకోవడమే కాదు.. ఆ తర్వాత ధనాధన్ ఇన్నింగ్స్‌తో శతక్కొట్టి (98 బంతుల్లో 111) మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పే ప్రయత్నం చేశాడు.అయితే, ఆఖరికి బ్రూక్ సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ తొలుత క్యాచ్ డ్రాప్ చేసినందుకు సిరాజ్‌పై విమర్శలు వచ్చాయి. అయినాసరే ఒత్తిడిని జయించిన సిరాజ్.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగి ఐదో రోజు అద్భుత ప్రదర్శనతో టీమిండియాను గెలిపించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిలతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సిరాజ్ మియాపై ప్రశంసలు కురిపించారు. ఇక విరాట్ కోహ్లి అక్క భావనా కోహ్లి ధింగ్రా సైతం సిరాజ్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ రాయడం విశేషం.సిరాజ్.. నువ్వు గొప్పోడివి‘‘ఈ ఆట ఎల్లప్పుడూ అద్భుతమైన అనుభవాలను అందించడంలో విఫలం కాదు. ఆశావహ, సానుకూల దృక్పథంతో.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ స్పూర్తిదాయక హీరోలు ఉన్నంత వరకు ఈ ఆట ఇలాకాక.. ఇంకెలా ఉంటుంది?! మహ్మద్ సిరాజ్.. నువ్వు గొప్పోడివి’’ అంటూ భావనా కోహ్లి ధింగ్రా తన ఇన్‌స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టగా.. వైరల్ అవుతోంది. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లండ్, రెండో టెస్టులో భారత్ గెలవగా.. మూడో టెస్టులో ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది. అనంతరం నాలుగో టెస్టు డ్రా కాగా.. ఐదో టెస్టులో భారత్ గెలిచింది. ఓవల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సిరాజ్ నిలవగా.. భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.చదవండి: బీసీసీఐ వేటు!.. నా ఫ్యామిలీ లాంటిది అంటూ భావోద్వేగం -
వ్యాజ్‌లెన్ వాడారు: టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు
ఓటమి ఖాయమనుకున్న సిరీస్‌లో టీమిండియా అద్భుతమే చేసింది. ఓవల్ టెస్టులో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా ఊహించని రీతిలో పుంజుకుని అసాధారణ ఆట తీరుతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆఖరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ (IND vs ENG)పై ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.అయితే, భారత దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ (Rohit Sharma) లేకుండానే.. ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా ఇలాంటి ప్రదర్శన చేయడం విశేషం. టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్.. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా మంచి మార్కులే దక్కించుకున్నాడు.అందరూ సమిష్టిగా రాణించిరికార్డు స్థాయిలో 754 పరుగులు సాధించడంతో పాటు.. ఎన్నో చిరస్మరణీయ రికార్డులు సొంతం చేసుకున్నాడు. మరోవైపు.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, పేసర్లు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ సత్తా చాటగా.. మహ్మద్ సిరాజ్ ఏకంగా 23 వికెట్లు కూల్చి సిరీస్‌ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.సూపర్ సిరాజ్ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన టెస్టులో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ విజయానికి ఏడు పరుగులు.. టీమిండియా ఒక వికెట్ దూరంలో ఉన్న వేళ.. అద్భుత డెలివరీతో చివరి వికెట్ తీసి భారత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు ఈ హైదరాబాదీ బౌలర్.ఈ నేపథ్యంలో గిల్ సేనతో పాటు సిరాజ్‌ను మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం.. ముఖ్యంగా దిగ్గజ బ్యాటర్ జో రూట్ సిరాజ్ నైపుణ్యాలను కొనియాడటం విశేషం.ఓర్వలేని పాక్ మాజీ క్రికెటర్.. సంచలన ఆరోపణలుటీమిండియా మొత్తం సంతోషంలో మునిగిన వేళ.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ దాయాది జట్టుపై విద్వేషం చిమ్మాడు. బాల్ ట్యాంపరింగ్ అంటూ భారత జట్టుపై నిరాధార ఆరోపణలు చేశాడు.‘‘నాకు తెలిసి.. ఇండియా బంతిపై వ్యాజ్‌లెన్ రాసి ఉంటుంది. అందుకే 80కి పైగా ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత కూడా.. బంతి ఇంకా కొత్తదానిలాగే మెరుస్తోంది. అంపైర్ ఆ బంతిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాలి’’ అని పాక్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షబ్బీర్ అహ్మద్ ఖాన్ ‘ఎక్స్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఇంతకు కుళ్లు దేనికి?ఈ నేపథ్యంలో షబ్బీర్ అహ్మద్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘టీమిండియా సంబరాలు చూసి ఓర్వలేకపోతున్నావా?.. దాయాది జట్టుపై ఇంత అక్కసు దేనికి?.. అక్కడా ఎవరూ అసలు దీని గురించి మాట్లాడలేదు. నీకెందుకు మరి ఈ చెత్త డౌట్ వచ్చింది.ఓహో మీ జట్టుకు ఇలాంటివి చేయడం.. ముఖ్యంగా ఫాస్ట్‌బౌలర్‌గా నీకు ఇలాంటివి బాగా అలవాటు కాబోలు. అందుకే పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా అన్నట్లు టీమిండియాను చూసినా నీకు అదే అనిపిస్తోంది. అయినా ఫేమస్ అవ్వడానికి ఈ మధ్య నీలాంటి వాళ్లు బాగానే తయారయ్యారు’’ అంటూ గట్టిగా చురకలు అంటిస్తున్నారు. కాగా పాకిస్తాన్ తరఫున 10 టెస్టులు, 32 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన షబ్బీర్ అహ్మద్.. ఆయా ఫార్మాట్లలో 51, 33 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20లలో బౌలర్‌గా అసలు అతడు బోణీ కొట్టలేదు. చదవండి: Dhruv Jurel: అతడికి నువ్వెందుకు చెప్పలేదు? గిల్‌తో సిరాజ్.. కొంప మునిగేదే! -
టీమిండియా గెలుస్తుందని నాకు ముందే తెలుసు: సౌరవ్ గంగూలీ
లండన్‌లోని ది ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా 6 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా ఐదో రోజు ఆటలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మ్యాజిక్ చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు కావల్సిన నేపథ్యంలో సిరాజ్ బంతితో ప్రత్యర్ధి జట్టును బోల్తా కొట్టించాడు. చివరి రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ 9 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ 8 వికెట్లు సాధించాడు. కాగా ఓవల్‌లో చారిత్రత్మక విజయం సాధించిన భారత జట్టు సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆఖరి టెస్టులో గెలిచి భారత్ సిరీస్ సమం చేస్తుందని తనకు ముందే తెలుసని టీమిండిమా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు."నాలుగవ రోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా గెలుస్తుందనే నమ్మకం నాకు కలిగింది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంది. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశారు" అని గంగూలీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్కంఠపోరులో విజయం తర్వాత భారత జట్టును కొనియాడుతూ గంగూలీ ఓ ట్విట్ కూడాచేశాడు."అసాధారణ సిరీస్. అమోఘమైన ఫలితం. జడేజా, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, సిరాజ్... అందరూ నిలకడగా ఆడారు. భారత జట్టు విజయాల ఆకలితో ఉన్నట్లు మనవాళ్లు తమ ఆటతీరుతో నిరూపించారు" దాదా ఎక్స్‌లో రాసుకొచ్చారు.చదవండి: మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
నాన్నంటే వాడికి ప్రాణం.. ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు నాతో ఏమన్నాడంటే..
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం మార్మోగిపోతున్న పేరు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj). ఇంగ్లండ్‌తో ఓవల్ టెస్టులో ఈ హైదరాబాదీ అద్బుతమే చేశాడు. ఓటమి కోరల్లో చిక్కుకున్న టీమిండియాను తన అద్భుతమైన డెలివరీతో విజయతీరాలకు చేర్చాడు.బాగా ఆడి ఇండియాను గెలిపించాలిఇంగ్లండ్తో ఓవరాల్‌గా ఐదు టెస్టుల్లో 185 ఓవర్లు బౌల్ చేసి.. ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని భారత్ 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు బయల్దేరే ముందు సిరాజ్ తన తల్లితో అన్న మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.ఈ విషయం గురించి సిరాజ్ తల్లి షబానా బేగం టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘అమ్మా.. నాకోసం ప్రార్థన చేస్తూ ఉండు. నేను బాగా ఆడి ఇండియాను గెలిపించాలని ప్రార్థించు’’ అని కుమారుడు తనతో చెప్పాడన్నారు.నాన్నంటే వాడికి ప్రాణంఅదే విధంగా.. తండ్రి అంటే సిరాజ్‌కు ప్రాణమని.. ‘‘సిరాజ్‌కు వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. ఆయనను ఎంతగానో ప్రేమిస్తాడు. తండ్రి కోసం ఏం చేసేందుకైనా సిరాజ్ వెనకాడేవాడు కాదు. సిరాజ్ కోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను. నా కుమారుడు చేసే ప్రతి పనిలో విజయవంతం అయ్యేలా ఆ అల్లా దీవించాలి’’ అని షబానా మాతృప్రేమను చాటుకున్నారు.కాగా సిరాజ్ క్రికెటర్‌గా ఎదగడంలో అతడి కుటుంబం పాత్ర కీలకం. తండ్రి మహ్మద్ గౌస్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూనే.. కుమారుడి కల నెరవేరేలా ప్రోత్సహించారు. సిరాజ్ అంటే ఆయనకూ ప్రాణమే. ఆయన కోరుకున్నట్లే కొడుకు టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.కుమారుడి ఎదుగుదల చూడకుండానేముఖ్యంగా తనకు ఇష్టమైన టెస్టు ఫార్మాట్లో ఆడేందుకు సిద్ధమైన తరుణంలోనే.. దురదృష్టవశాత్తూ గౌస్ కన్నుమూశారు. 2021లో సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా గౌస్ మరణించారు. అయితే, దేశం కోసం ఆడటమే ముఖ్యమని ఆయన నేర్పిన విలువలకు తగ్గట్లుగా అక్కడే ఉండిపోయిన సిరాజ్ తండ్రిని కడసారి చూసుకోలేకపోయాడు.తండ్రి సమాధి దర్శించుకున్న తర్వాతేఅయితే, ఆయన కోరుకున్నట్లుగానే టీమిండియా టాప్ పేసర్‌గా ఎదిగి ఇలా ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా తాను సిరీస్ ఆడేందుకు సన్నద్ధమయ్యే ముందు ముందుగా సిరాజ్ తన తండ్రి సమాధిని దర్శించుకుని అక్కడ ప్రార్థన చేస్తాడు. తాజాగా ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు కూడా సిరాజ్ ఈ ఆనవాయితీని పాటించాడు. అత్యుత్తమ ప్రదర్శనతో భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.చదవండి: ‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా..All heart. All hustle. All 𝘋𝘩𝘢𝘢𝘬𝘢𝘥 💪A fightback that will go down in Indian cricket history ✨#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/bvXrmN5WAL— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025 -
ఇక్కడున్నా బిర్యానీ తక్కువే.. ఆ ఫుడ్ అసలే తినడు: సిరాజ్ సోదరుడు
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని టీమిండియా సమం చేయడంలో మహ్మద్ సిరాజ్‌ది కీలక పాత్ర. ఈ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఓటమి తప్పదనుకున్న చోట సిరాజ్ తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి భారత జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో సిరాజ్ మియా తొమ్మిది వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.ఒకే ఒక్కడు.. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు సిరీస్ అసాంతం మహ్మద్ సిరాజ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా సిరాజ్ ఫిట్నెస్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. ఈ సిరీస్‌లో తన సహచర ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యలతో ఒకట్రెండు మ్యాచ్‌లకు దూరమైనప్పటికి.. సిరాజ్ మాత్రం అలుపెరుగని యోధుడిలా అన్ని మ్యాచ్‌లల్లోనూ ఆడాడు. ఇంగ్లండ్ - భారత్ టెస్టు సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఏకైక బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ఎటువంటి వర్క్ లోడ్ భావించకుండా ఈ సిరీస్‌లో దాదాపు వెయ్యికి పైగా బంతులు వేశాడు. ఎన్నో లాంగ్ స్పెల్స్ కూడా బౌలింగ్ చేశాడు. కానీ ఎప్పుడూ కూడా సిరాజ్ అలిసిపోయినట్లు కన్పించలేదు. తాజాగా మహ్మద్ సిరాజ్ ఫిట్నెస్ సీక్రెట్‌ను అతడి సోదరుడు మొహమ్మద్ ఇస్మాయిల్ భయటపెట్టాడు."సిరాజ్ తన ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తాడు. అతడు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు. సరైన డైట్ ప్లాన్‌ను పాటిస్తాడు. సిరాజ్ హైదరాబాద్‌లో ఉన్నా కూడా బిర్యానీని చాలా అరుదుగా తింటాడు. అది కూడా ఇంట్లో తాయారు చేస్తే తింటాడు. కానీ పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్ల జోలికి అస్సలు పోడు. తన శరీరం పట్ల చాలా క్రమశిక్షణతో ఉంటాడు" అని ఇస్మాయిల్ ఇండియా టూడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో సిరాజ్ మొత్తంగా 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు ఫైవ్ వికెట్ హాల్స్ ఉన్నాయి.చదవండి: ‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా.. -
‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా..
భారత జట్టు చివరిసారిగా ఇంగ్లండ్ గడ్డపై 2007లో 1–0తో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత నాలుగుసార్లు మన టీమ్ అక్కడకు వెళ్లింది. 2011లో 0–4తో చిత్తుగా ఓడిన జట్టు... 2014, 2018లలోనూ సిరీస్‌లు కోల్పోయింది. 2021 సిరీస్‌ను మాత్రం సమంగా ముగించగలిగింది. ఈసారి జట్టు ఇంగ్లండ్ బయల్దేరినప్పుడు కూడా ఎన్నో సందేహాలు. కోహ్లి, రోహిత్, అశ్విన్ రిటైర్ అయిన తర్వాత ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో పాటు ఎక్కువ మందికి అనుభవం పెద్దగా లేకపోవడంతో కూడా అంచనాలు తక్కువగా ఉన్నాయి.అవును.. ‘డ్రా’ కూడా గెలుపు సంబరమేభారత మాజీ క్రికెటర్లు సహా ప్రసారకర్తల బృందంలో ఉన్నవారంతా ఇంగ్లండ్ సిరీస్ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. భారత్ కొంత వరకు పోరాడుతుందని, సిరీస్ తుది ఫలితంలో మాత్రం మార్పు ఉండదని వారంతా వ్యాఖ్యానించారు. కానీ టీమిండియా తమ అసాధారణ ఆటతో అందరి నోళ్లు మూయించింది.ఈ పర్యటనకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడి, ఆపై ఆస్ట్రేలియాలో 1–3తో చిత్తయిన జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లి ఈ తరహా ఫలితంతో తిరిగి రావడం చాలా గొప్ప ప్రదర్శన. అంకెల్లో చూస్తే సిరీస్ ‘డ్రా’గా ముగిసిందని, భారత్ గెలవలేదని అనిపించవచ్చు కానీ మన కోణంలో చూస్తే ఇది విజయంతో సమానం. సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు చూసినవారు ఎవరైనా ఇదే విషయాన్ని అంగీకరిస్తారు. ఐదు టెస్టుల్లో వేర్వేరు దశల్లో, సెషన్లలో మన జట్టు ఆధిక్యం కనబర్చిన తీరు, వెనకబడిన ప్రతీసారి కోలుకున్న పట్టుదల చూస్తే ‘డ్రా’ కూడా గెలుపు సంబరమే. హోరాహోరీ పోరులో సత్తా చాటి... తొలి టెస్టులో భారత్ చిత్తుగా ఏమీ ఓడలేదు. మన జట్టు తరఫున ఐదు సెంచరీలు నమోదయ్యాయి. ఆ జట్టు దూకుడుగా ఆడి 371 పరుగులు ఛేదించగలిగింది. రెండో టెస్టులో ఏకంగా 336 పరుగులతో ఘన విజయం సాధించి సరైన రీతిలో మనం బదులిచ్చాం. లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్కోరు సమం. చివర్లో కాస్త అదృష్టం కలిసొస్తే ఈ మ్యాచ్ కూడా మన సొంతమయ్యేది. ఓల్డ్ట్రఫోర్డ్లో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 311 పరుగులు వెనుకబడి కూడా పోరులో నిలవడం, ఓటమిని తప్పించుకోవడం మన పోరాటపటిమను చూపించింది.రెండో ఇన్నింగ్స్‌లోనైతే సున్నాకి 2 వికెట్లు కోల్పోయిన తర్వాత మరో 2 వికెట్లు మాత్రమే చేజార్చుకొని 425 పరుగులు చేయడం అసాధారణం. ఒకదశలో ‘డ్రా’ కోసం ఇంగ్లండ్ ముందుకు రావడం, మన ఆటగాళ్లు నిరాకరించడం జట్టులో పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. ఇది తర్వాతి టెస్టులో కనిపిస్తుందని వేసిన అంచనాలు సరిగ్గా నిజమయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసి, ఆపై దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే నిలువరించగలిగింది. ఆకట్టుకున్న వ్యక్తిగత ప్రదర్శనలు... సిరీస్‌లో సమష్టి ప్రదర్శన జట్టును ముందంజలో నిలిపింది. సిరాజ్ 23 వికెట్లు పడగొట్టగా, 3 మ్యాచ్‌లలో బుమ్రా 14 వికెట్లు తీశాడు. పరుగులు భారీగా ఇచ్చినా... ప్రసిధ్ కృష్ణ (14), ఆకాశ్‌దీప్ (13) కీలక సమయాల్లో వికెట్లు తీశారు. జడేజా బౌలర్‌గా విఫలమైనా ఆ లోటును బ్యాటింగ్‌తో పూరించాడు. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేసి తామేంటో చూపించారు.శుబ్‌మన్ గిల్ (754), కేఎల్ రాహుల్ (532), జడేజా (516) చెలరేగగా... పంత్ (479), జైస్వాల్ (411) కూడా తమవంతు పాత్ర పోషించారు. మున్ముందు అశ్విన్ స్థానాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయగల ఆల్‌రౌండర్‌గా సుందర్ నిరూపించుకున్నాడు. మాంచెస్టర్‌లో సెంచరీతో పాటు చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను బాదిన 4 సిక్సర్లు తుది ఫలితంపై ప్రభావం చూపాయి. క్రికెట్‌ను మరో అవకాశం అడిగిన కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడకపోయినా...చివరి టెస్టు హాఫ్ సెంచరీ అతడికి మరో అవకాశం కల్పించవచ్చు.ఇద్దరికీ పాస్ మార్కులు... గెలుపు విలువ వారికే తెలుసుఈ టెస్టు సిరీస్ ప్రధానంగా కెప్టెన్‌గా గిల్, కోచ్ గంభీర్‌లకు వ్యక్తిగతంగా ఎంతో కీలకమైంది. ఈ సిరీస్‌కు ముందు పేలవ సగటుతో బ్యాటర్‌గా కూడా గొప్ప రికార్డు లేని గిల్ అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా కూడా నిరూపించుకోవాల్సిన స్థితి. ఇందులో ఏది విఫలమైనా అతనిపై తీవ్ర విమర్శలు వచ్చేవి. అయితే గిల్ ఇప్పుడు విజయవంతంగా దీనిని ముగించాడు. టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు కెప్టెన్‌గా సిరీస్‌ను కోల్పోలేదు.అక్కడక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా తొలి సిరీస్ కాబట్టి క్షమించే పరిస్థితి ఉంది. ఇక గత రెండు టెస్టు సిరీస్‌లు కోల్పోయిన తర్వాత గంభీర్‌పై కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. ముఖ్యంగా కోహ్లి, రోహిత్‌లను తానే సాగనంపి జట్టుపై పూర్తి పట్టు పెంచుకున్నాడనే వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో అతని ప్రతీ ప్రణాళికపై అందరి దృష్టీ ఉంది.ముఖ్యంగా ఇక్కడ ఓడితే కొన్ని అనూహ్య ఎంపికలకు అతను సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చేది. ఇక తాజా ప్రదర్శనతో గంభీర్ నిశ్చింతగా ఉండవచ్చు. భారత్ తమ తదుపరి టెస్టు సిరీస్‌ను స్వదేశంలో వెస్టిండీస్‌తో ఆడనుంది. 27 ఆలౌట్ తర్వాత ఆ జట్టు ఆడనున్న తొలి మ్యాచ్ ఇక్కడే కానుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత మన జట్టు ప్రదర్శనను విశ్లేషిస్తే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా జోరు కొనసాగడం ఖాయం. -సాక్షి క్రీడా విభాగం చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్.... గూస్బంప్స్ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్ -
ఓడినా సంతృప్తిగానే ఉన్నాం.. గొడవలు సహజమే.. అయితే..: స్టోక్స్
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ (IND vs ENG Tests) అంతే రసవత్తరంగా ముగిసింది. చారిత్రక ఓవల్ మైదానంలో ఆఖరిదైన ఐదో టెస్టులో.. చివరి రోజు వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. నువ్వా- నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన పోరులో ఆరు పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని 2-2తో సమం చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ఐదో టెస్టులో తమ ఓటమిపై స్పందించాడు.ఓడినా.. ఆ విషయంలో సంతృప్తిగా ఉంది‘‘ఇంతటి కీలకమైన మ్యాచ్‌కు గాయం వల్ల దూరం కావడం కాస్త కఠినంగానే తోచింది. విజయం కోసం ఇరు జట్లూ మరోసారి తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. ఇక్కడ గెలవలేకపోవడం నిరాశ కలిగించినా మా జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా.సిరీస్ మొత్తం చాలా గొప్పగా సాగింది. ప్రతీ ఒక్కరూ ఎన్నో సందర్భాల్లో తమ భావోద్వేగాలు ప్రదర్శించారు. ఆరంభంలోనే ఒక బౌలర్ తప్పుకొన్నా రెండో ఇన్నింగ్స్‌లో మిగతా వారు ఎంతో పోరాటపటిమ కనబర్చారు.ఇలా జరిగి ఉంటే బాగుండేదనే క్షణాలు గత ఐదు రోజుల్లో ఎన్నో వచ్చాయి. ఇవన్నీ ఆటను గొప్పగా మార్చాయి. అయితే మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వమని మాత్రమే మా ఆటగాళ్లకు చెప్పాం. ఆ విషయంలో సంతృప్తిగా ఉంది.నాలాగే గిల్ కూడా గర్వపడతాడుకానీ సిరీస్ గెలవలేకపోయామనే నిరాశ కూడా ఉంది. క్రిస్ వోక్స్ ఆఖరి రోజు బ్యాటింగ్ చేయడానికి ముందే సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో ఎలా బ్యాటింగ్ చేయాలో సన్నద్ధమయ్యాడు.విరిగిన వేళ్లు, ఫ్రాక్చర్ అయిన పాదాలతో ఆటగాళ్లు బరిలో దిగడం.. దేశానికి ప్రాతినిథ్యం వహించడం పట్ల వారికి ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని తెలియజేస్తాయి. వోక్స్ విషయంలో నేను గర్వపడుతున్నాను. నాకు తెలిసి శుబ్‌మన్ గిల్ కూడా ఇలాగే గర్వపడుతూ ఉంటాడు’’ అని స్టోక్స్ పేర్కొన్నాడు.ఆటలో ఇవి సహజం.. అయితే వాటినే తలచుకుని..అదే విధంగా.. ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన వాగ్యుద్ధాల గురించి మీడియా ప్రశ్నించగా.. ‘‘ఇండియా- ఇంగ్లండ్ సిరీస్ ఇరుజట్లకు ఎంతో కీలకమైనది. భావోద్వేగాలతో ముడిపడిన ఈ సిరీస్‌లో జరిగిన ఎలాంటి ఘటనలూ వ్యక్తిగతంగా ఆటగాళ్లపై ప్రభావం చూపవు.మైదానంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఎవరూ నిద్ర పాడుచేసుకోరు. ఇరుజట్ల ఆటగాళ్లు ఇలాగే ఆలోచిస్తారు. ఆటలో ఇవన్నీ భాగం’’ అని బెన్ స్టోక్స్ బదులిచ్చాడు.అపుడు పంత్.. ఇపుడు వోక్స్ఇదిలా ఉంటే.. ఐదో టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ భుజం విరిగింది. అయితే, ఐదో రోజు ఆటలో నిలవాలంటే అతడు బ్యాటింగ్‌కు దిగాల్సి రాగా.. ఒంటిచేత్తోనే ఆడేందుకు వోక్స్ మైదానంలో దిగాడు. అయితే, అతడు ఒక్క బంతి కూడా ఎదుర్కోవాల్సిన అవసరం రాలేదు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ గస్ అట్కిన్సన్ (17)ను బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడగా.. టీమిండియా విజయం ఖరారైంది.మరోవైపు.. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో కుడికాలి బొటనవేలు ఫ్రాక్చర్ అయినా టీమిండియా స్టార్ రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు తిరిగి వచ్చి.. అర్ధ శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఐదు రోజులపాటు సాగి టెస్టు క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా అందించాయి.చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్.... గూస్బంప్స్ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్All heart. All hustle. All 𝘋𝘩𝘢𝘢𝘬𝘢𝘥 💪A fightback that will go down in Indian cricket history ✨#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/bvXrmN5WAL— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025 -
నేను ఆ క్యాచ్ పట్టి ఉంటేనా: సిరాజ్ ఎమోషనల్.. గిల్ రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) క్యాచ్ మిస్ చేయడంపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) స్పందించాడు. తాను ఒకవేళ ఆ క్యాచ్ సరిగ్గా పట్టి ఉంటే.. ఆట ఐదో రోజుకు చేరి ఉండకపోయేదని అభిప్రాయపడ్డాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా కలిగిన బ్రూక్ విషయంలో తాను చేసిన పొరపాటు వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.ఓటమి అంచుల వరకు వెళ్లి..ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్‌లో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా అద్భుతం చేసింది. ఓటమి అంచుల వరకు వెళ్లి గెలుపులోని అసలైన మజాను రుచిచూసింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేసింది. నిజానికి ఓవల్ టెస్టులో టీమిండియా విజయంలో సిరాజ్‌దే కీలక పాత్ర.బౌండరీ లైన్ తొక్కేయడంతోనరాలు తెగే ఉత్కంఠ నడుమ.. ఇంగ్లండ్ విజయానికి ఏడు పరుగులు.. భారత్ గెలుపునకు ఒక వికెట్ దూరంలో ఉన్న వేళ.. సిరాజ్ ఆఖరి.. ఆ ఒక్క వికెట్ తీసి.. జట్టుకు సంచలన విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా సిరాజ్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.అయితే, నాలుగో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ ప్రమాదకర బ్యాటర్ హ్యారీ బ్రూక్.. 19 పరుగల వద్ద ఉండగా.. లడ్డూ లాంటి క్యాచ్ ఇచ్చాడు. ఫైన్ లెగ్‌లో ఉన్న సిరాజ్ దీనిని ఒడిసిపట్టినా.. బౌండరీ లైన్ తొక్కేయడంతో బ్రూక్‌కు లైఫ్ లభించింది.Out? Six!?What's Siraj done 😱 pic.twitter.com/hp6io4X27l— England Cricket (@englandcricket) August 3, 2025నిన్ను నువ్వు నమ్ముఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. 98 బంతుల్లోనే 111 పరుగుల సాధించి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పాడు. అయితే, ఆఖరికి.. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో మళ్లీ సిరాజే బ్రూక్ క్యాచ్ పట్టాడు.టీమిండియా విజయానంతరం సిరాజ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించాడు. ‘‘మొదటి రోజు నుంచి ఎంతో పోరాటపటిమ కనబర్చాం. ఇలాంటి ఫలితం రావడం చాలా సంతోషంగా ఉంది. సరైన చోట నిలకడగా బంతులు వేసి ఒత్తిడి పెంచాలనేదే నా వ్యూహం. ‘నిన్ను నువ్వు నమ్ము’ అని రాసి ఉన్న ఒక ఫోటోను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను.నిజానికి హ్యారీ బ్రూక్ అసాధారణ ఆటగాడు. కొంతమంది డిఫెన్సివ్‌గా ఉంటారు కానీ... అతడు మాత్రం ఎల్లప్పుడూ అటాకింగ్ మోడ్‌లో ఉంటాడు. నేను గనుక అప్పుడే ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది.అదొక గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అయ్యేది. అయితే, సీనియర్ బౌలర్‌గా నాకున్న పరిణతితో.. ఈ భారాన్ని మోయడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏదీ లేదని నాకు తెలుసు. ‘జరిగిందేదో జరిగిపోయింది. ఆటలో ఇలాంటివి సహజం’ అని నన్ను నేను సముదాయించుకున్నాను’’ అంటూ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు.గిల్ రియాక్షన్ వైరల్ఇంతలో పక్కనే ఉన్న కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కలుగజేసుకుంటూ.. ‘‘ఒకవేళ మేము ఆ క్యాచ్ పట్టి ఉంటే.. ఇంకాస్త సులువుగా గెలిచేవాళ్లం. మేము చాలా గొప్పగా ఆడాము.. అవునా? కాదా?’’ అంటూ సిరాజ్‌కు అండగా నిలిచాడు. గిల్ అలా అనగానే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు నవ్వులు చిందించారు.చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్.... గూస్బంప్స్ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్ All heart. All hustle. All 𝘋𝘩𝘢𝘢𝘬𝘢𝘥 💪A fightback that will go down in Indian cricket history ✨#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/bvXrmN5WAL— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025 -
కన్నీటిపర్యంతమైన గంభీర్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న వీడియో!
‘‘గౌతమ్ గంభీర్.. వన్డే, టీ20 ఫార్మాట్లకు కోచ్‌గా ఫర్వాలేదు. కానీ టెస్టులకు మాత్రం అతడు పనికిరాడు. అతడు హెడ్‌కోచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత పసికూన బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయాన్ని మినహాయిస్తే.. టీమిండియా అత్యంత ఘోరమైన పరాజయాలు చవిచూసింది.సొంతగడ్డపై చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా న్యూజిలాండ్ (IND vs NZ)తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్ అయింది. అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (IND vs AUS)ని చేజార్చుకుంది.ఇదంతా ఒక ఎత్తైతే.. ఇంగ్లండ్ టూర్‌కు ముందే దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడానికి గంభీర్ కూడా ఓ కారణం. అంతేకాదు.. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కెప్టెన్ కావడంలోనూ గౌతీదే కీలక పాత్ర.దిగ్గజాలు లేకుండా గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద గెలవాల్సిన తొలి జట్టులో టీమిండియా ఓడిపోవడానికి కోచ్, కెప్టెన్ వ్యూహాలు సరిగ్గా లేకపోవడమే కారణం’’.. ఇటీవలి కాలంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై వచ్చిన విమర్శలూ, ఆరోపణలూ ఇవీ. టెస్టుల్లో భారత్ వరుసగా విఫలం కావడంతో అతడిని కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లూ వచ్చాయి.ఈ సిరీస్ కూడా సమర్పయామి అంటూ..అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత గౌతీపై విమర్శల దాడికి కాస్త బ్రేక్ పడింది. కానీ ఆ తర్వాత మళ్లీ పాత కథే పునరావృతమైంది.లార్డ్స్ టెస్టులో ఓటమి.. మాంచెస్టర్‌లో మ్యాచ్ డ్రా కావడం.. ఆఖరిగా ఓవల్‌లో ఐదో టెస్టులోనూ ఆఖరి రోజు వరకు ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో ఉండటంతో .. ఇక ఈ సిరీస్ కూడా సమర్పయామి అంటూ మళ్లీ గంభీర్‌పై విమర్శలు మొదలయ్యాయి.అయితే, చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ టెస్టులో భారత్ సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్ విజయానికి 17 పరుగులు.. టీమిండియా విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉన్నవేళ ప్రసిద్ కృష్ణ జోష్ టంగ్‌ను బౌల్డ్ చేసి తొమ్మిదో వికెట్ పడగొట్టాడు.అద్భుతం చేసిన సిరాజ్ఇక విజయ సమీకరణాలు 7 పరుగులు.. ఒక వికెట్‌గా మారగా మహ్మద్ సిరాజ్ మరోసారి అద్భుతమే చేశాడు. అద్భుతమైన డెలివరీతో గస్ అట్కిన్సన్ను బౌల్డ్ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ దృశ్యాల్ని చూస్తున్న సగటు అభిమానులతో పాటు కోచ్ గంభీర్ హృదయం ఉప్పొంగిపోయింది.గంభీర్ కన్నీటి పర్యంతంగతంలో ఎన్నడూ లేనివిధంగా గౌతీ కంట నీరొలికింది. తీవ్ర భావోద్వేగానికి లోనైన గంభీర్.. సహచర సిబ్బందిని గట్టిగా ఆలింగనం చేసుకుని వారిని ఆప్యాయంగా ముద్దాడాడు. ఆనందభాష్పాలు రాలుస్తూ టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. గంభీర్‌కు ఈ గెలుపు ఎంత ముఖ్యమో.. ఎంత అవసరమో తెలియజేయడానికి ఈ దృశ్యాలు చాలు!!ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ‘‘నిజంగా ఈ వీడియో గూప్‌బంప్స్ తెప్పిస్తోంది భయ్యా. టీమిండియాకు, గంభీర్‌కు శుభాకాంక్షలు’’ అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓవల్‌లో విజయంతో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉భారత్- 224 & 396👉ఇంగ్లండ్- 247 & 367✊ఆరు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచిన భారత్.చదవండి: నన్ను నమ్మినందుకు థాంక్యూ విరాట్ భయ్యా: మహ్మద్ సిరాజ్𝗕𝗲𝗹𝗶𝗲𝗳. 𝗔𝗻𝘁𝗶𝗰𝗶𝗽𝗮𝘁𝗶𝗼𝗻. 𝗝𝘂𝗯𝗶𝗹𝗮𝘁𝗶𝗼𝗻!Raw Emotions straight after #TeamIndia's special win at the Kennington Oval 🔝#ENGvIND pic.twitter.com/vhrfv8ditL— BCCI (@BCCI) August 4, 2025 -
చిరస్మరణీయ విజయం.. ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టిన టీమిండియా
ఓవల్ టెస్ట్ విజయానంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2025-27) పాయింట్ల పట్టికలో భారత్ ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ మూడో ప్లేస్‌లో ఉండింది.ఈ మ్యాచ్ విజయానంతరం భారత్ విజయాల శాతం 46.67గా ఉండగా.. ఇంగ్లండ్ విన్నింగ్ పర్సంటేజ్ 43.33కు పడిపోయింది. ఆస్ట్రేలియా (100), శ్రీలంక (66.67) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 16.67 విజయాల శాతంతో బంగ్లాదేశ్ ఐదో ప్లేస్‌లో ఉంది. వెస్టిండీస్ ఈ సైకిల్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి ఆరో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఈ సైకిల్లో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టు 2-2తో సిరీస్‌ను సమం చేసుకుంది. 1, 3 టెస్ట్ మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. డబ్ల్యూటీసీలో భారత్ తదుపరి టెస్ట్ సిరీస్ వెస్టిండీస్‌తో ఆడనుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్ భారత్ వేదికగా ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ అహ్మదాబాద్‌లో, రెండో టెస్ట్ (అక్టోబర్ 10 నుంచి) ఢిల్లీలో జరుగనున్నాయి.ఇదిలా ఉంటే, హోరాహోరీగా సాగిన ఓవల్ టెస్ట్‌లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి రోజు భారత్ 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. భారత బౌలర్లలో సిరాజ్ మ్యాజిక్ చేసి ఇంగ్లండ్ చేతిలో ఉండిన 4 వికెట్లలో 3 వికెట్లు తీశాడు. ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ పడగొట్టాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్‌పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. అతనికి ప్రసిద్ద్ సహకరించాడు. వీరిద్దరు కలిపి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
నన్ను నమ్మినందుకు థాంక్యూ విరాట్ భయ్యా: మహ్మద్ సిరాజ్
"నేను జస్సీ భాయ్ (జస్ప్రీత్ బుమ్రా) మాత్రమే నమ్ముతాను. ఎందుంటే అతడొక గేమ్ ఛేంజర్". టీ20 ప్రపంచకప్-2024 విజయనంతరం మహ్మద్ సిరాజ్ చెప్పిన మాటలు ఇవి. ఆ సందర్భంగా సిరాజ్ ఇంగ్లీష్ సరిగ్గా మాట్లడకపోవడంతో చాలా మంది ట్రోలు చేశారు.కానీ ఇప్పుడు అవే మాటలు సిరాజ్‌కు సరిపోతాయి. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో సిరాజ్ పేరు మారు మ్రోగుపోతుంది. ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ మియా సంచలనం సృష్టించాడు. బుమ్రా పక్కన లేకపోయినప్పటికి ప్రత్యర్ధులను బెంబెలెత్తించాడు.భారత పేస్ ధళ నాయకుడిగా నిప్పులు చెరిగాడు. ఓటమి కోరుల్లో చిక్కుకున్న తన జట్టును వారియర్‌లా విజయతీరాలకు చేర్చాడు. విశ్రాంతి, విరామం లేకుండా ఓ యోదుడులా పోరాడాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి భారత జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్ ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ క్రమంలో సిరాజ్‌పై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు."ఓవల్‌లో టీమిండియా గొప్ప విజయం సాధించింది. సిరాజ్, ప్రసిద్ద్ల పట్టుదల, దృఢ సంకల్పం వల్లే భారత్‌కు ఈ అద్బుతమైన విజయం దక్కింది. జట్టు కోసం ప్రతీసారి ముందుండి పోరాడే సిరాజ్ ని చూస్తే చాలా ఆనందంగా ఉంది " అని విరాట్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా కోహ్లి ట్విట్‌పై సిరాజ్ స్పందించాడు. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు భయ్యా అంటూ సిరాజ్ రిప్లే ఇచ్చాడు.చదవండి: అతడొక సంచలనం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్ -
ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. ఓవల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలోని ఆఖరి మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన టెస్టు క్రికెట్ మజాను అందించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై 6 పరుగుల తేడాతో టీమిండియా సంచలన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. ఈ విజయంలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌ది కీలక పాత్ర.సిరాజ్ అద్భుతం..లార్డ్స్ టెస్టులో బ్యాట్‌తో జట్టును గెలిపించలేకపోయిన సిరాజ్.. ఓవల్‌లో మాత్రం బంతితో తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ కీలక పోరులో సిరాజ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా లేని లోటును తెలియనివ్వలేదు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తాచాటాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.తొలి ఓవర్లోనే.. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరమవ్వగా.. భారత్ 4 వికెట్లు కావాల్సి వచ్చాయి. క్రీజులో జేమీ ఓవర్టన్, స్మిత్ ఉండగా.. తొలి ఓవర్ వేసే బాధ్యతను ప్రసిద్ద్ కృష్ణకు గిల్ అప్పగించాడు. అయితే ఆ ఓవర్లో ప్రసిద్ద్ వేసిన తొలి బంతినే ఓవర్టన్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత నాలుగో బంతికి ఫోర్ రావడంతో ఓ ఓవర్లో ఇంగ్లండ్‌కు 8 పరుగులు లభించాయి. ఇంగ్లండ్ విజయసమీకరణం 27 పరుగులు మారింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌తో పాటు అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.మియా ఎంట్రీ..ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన సిరాజ్ మియా.. తన వేసిన తొలి ఓవర్లోనే స్మిత్‌ను ఔట్ చేసి భారత శిబిరంలో గెలుపు ఆశలు చిగురించేలా చేశాడు. ఆ తర్వాత జేమీ ఓవర్టన్ను సిరాజ్ అద్బుతమైన ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. ఈ సమయంలో సిరాజ్‌కు ప్రసిద్ద్ తోడయ్యాడు.సంచలన బంతితో టెయిలాండర్ టంగ్‌ను ప్రసిద్ద్ బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. భుజం ఎముక విరిగినప్పటికి తన జట్టు కోసం వోక్స్ మైదానంలో అడుగుపెట్టాడు. నొప్పిని భరిస్తూనే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో అట్కిన్సన్కు సపోర్ట్‌గా వోక్స్ నిలిచాడు. అనంతరం 84వ ఓవర్లో సిరాజ్ బౌలింగ్‌లో అట్కిన్సన్ సిక్సర్ కొట్టడంతో మళ్లీ టెన్షన్ నెలకొంది. అంతకుతోడు ధ్రువ్ జురెల్ రనౌట్ మిస్ చేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.కానీ 86వ ఓవర్ వేసిన సిరాజ్ మియా.. అద్బుతమైన బంతితో అట్కిన్సన్ను బౌల్డ్ చేసి అభిమానుల ఉత్కంఠకు తెరదించాడు. దీంతో 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు ప్రసిద్ద్ కృష్ణ 8 వికెట్లతో సత్తాచాటాడు.చదవండి: ENG Vs IND: క్రికెట్ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన ఎంట్రీ.. ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు దిగిన వోక్స్ -
ప్రసిద్ద్ కృష్ణకు సారీ చెప్పిన సిరాజ్.. వీడియో వైరల్!
లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. ఆఖరి రోజు ఆటలో భారత్ విజయానికి 4 వికెట్లు అవసరమవ్వగా.. ఇంగ్లడ్ తమ గెలుపునకు 35 పరుగులు దూరం నిలిచింది.తొలి సెషన్లో మ్యాచ్ ఫలితం తేలిపోనుంది. ప్రస్తుతం క్రీజులో జేమీ స్మిత్(2), జేమి ఓవర్టన్(0) ఉన్నారు. ఇంగ్లండ్‌ను ఎలాగైనా ఆలౌట్ చేసి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో భారత బౌలర్లు ఉన్నారు.అయితే మ్యాచ్ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చిన్న తప్పిదంతో విలన్‌గా మారిపోయాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించిన సిరాజ్.. ఫీల్డింగ్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు.కొంపముంచిన సిరాజ్..సెకెండ్ ఇన్నింగ్స్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ఆరంభంలోనే సిరాజ్ లైఫ్ ఇచ్చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 35వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో తొలి బంతిని హ్యారీ బ్రూక్ ఫైన్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఉన్న సిరాజ్ మియా క్యాచ్‌ను అందుకున్నాడు.అయితే క్యాచ్‌ను అందుకున్న సిరాజ్ తన వెనకే ఉన్న బౌండరీ రోప్‌ను టచ్ చేశాడు. దీంతో బ్యాటర్‌కు ఆరు పరుగులు లభించాయి. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బ్రూక్.. ఏకంగా 111 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.తర్వాత ప్రసిద్ద్ కృష్ణ వద్దకు సిరాజ్ వెళ్లి క్షమాపణలు చెప్పాడు. ప్రసిద్ద్ కృష్ణ నవ్వుతూ సిరాజ్‌ను హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే యాదృచ్ఛికంగా బ్రూక్ మళ్లీ సిరాజ్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.Prasidh Krishna was all of us, watching it unfold 😥 #SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/jB138cMO13— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2025 -
IND vs ENG: హ్యారీ బ్రూక్ ‘ఫాస్టెస్ట్’ టెస్టు రికార్డు
టీమిండియాతో ఐదో టెస్టులో ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) అదరగొట్టాడు. బజ్‌బాల్ ఆటను గుర్తుచేస్తూ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. 35వ ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో బ్రూక్ బంతిని గాల్లోకి లేపగా.. ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న భారత పేసర్ మహ్మద్ సిరాజ్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు.సిరాజ్ ఇచ్చిన ‘గిఫ్ట్’కానీ.. బంతిని ఒడిసిపట్టిన తర్వాత సిరాజ్ బౌండరీ లైన్ తొక్కి.. బ్యాలెన్స్ చేసుకోలేక లైన్ అవతల ల్యాండ్ అయ్యాడు. దీంతో కథ అడ్డం తిరిగింది. అవుటవ్వాల్సిన బ్రూక్ ఖాతాలోకి.. సిక్సర్ చేరిపోయింది. అప్పటికి బ్రూక్ స్కోరు 19. ఇలా తనకు లైఫ్ లభించిన తర్వాతే.. అతడు మరి వెనుదిరిగి చూడలేదు.ఆకాశమే హద్దుగా చెలరేగుతూ శతక్కొట్టేశాడు. కేవలం 98 బంతుల్లోనే 14 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 111 పరుగులు సాధించాడు. జో రూట్ (105)తో కలిసి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. కాగా బ్రూక్‌కు టెస్టుల్లో ఇది పదో సెంచరీ.హ్యారీ బ్రూక్ ‘ఫాస్టెస్ట్’ టెస్టు రికార్డుఈ క్రమంలో బ్రూక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇరవై ఒకటవ శతాబ్దంలో టెస్టులో అత్యంత వేగంగా టెస్టుల్లో పది శతకాల మార్కు అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. బ్రూక్ 50 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించి.. ఆస్ట్రేలియా స్టార్ మార్నస్ లబుషేన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా 70 ఏళ్ల క్రితం అంటే.. 1955లో వెస్టిండీస్ క్రికెటర్ క్లైడ్ వాల్కాట్ 47 ఇన్నింగ్స్‌లోనే 10 టెస్టు సెంచరీలు సాధించి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు.ఇదిలా ఉంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య ఓవల్ మైదానంలో గురువారం మొదలైన ఐదో టెస్టు తుది అంకానికి చేరుకుంది. సోమవారం ఆఖరిదైన ఐదో రోజు ఆటలో మ్యాచ్‌తో పాటు సిరీస్ ఫలితం తేలనుంది. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో ఉంది. 21వ శతాబ్దంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 10 టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్లు👉హ్యారీ బ్రూక్- 50 ఇన్నింగ్స్‌లో👉మార్నస్ లబుషేన్- 51 ఇన్నింగ్స్‌లో👉కెవిన్ పీటర్సన్- 56 ఇన్నింగ్స్‌లో👉ఆండ్రూ స్ట్రాస్- 56 ఇన్నింగ్స్‌లో👉వీరేందర్ సెహ్వాగ్- 56 ఇన్నింగ్స్‌లో.చదవండి: అతడిని ముందుగానే తీసుకురావాల్సింది: గిల్, గంభీర్ తీరుపై అశ్విన్ ఆగ్రహం -
IND vs ENG: అదంతా ఫేక్.. సిరాజ్ ఎలాంటివాడంటే?!
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ (Joe Root) ప్రశంసలు కురిపించాడు. సిరాజ్ మియాను నిజమైన పోరాట యోధుడిగా అభివర్ణించిన రూట్.. అతడి లాంటి ఆటగాడు ప్రతి జట్టులోనూ ఉండాలంటూ కొనియాడాడు. కొన్నిసార్లు కోపం వచ్చినట్లు ‘నటించినా’.. నిజానికి సిరాజ్ చాలా మంచోడంటూ ప్రశంసించాడు.4 వికెట్లా?.. 35 పరుగులా?ఇంగ్లండ్- భారత్ (IND vs ENG) మధ్య ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐదు టెస్టుల్లో నాలుగు పూర్తికాగా.. ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య ఓవల్ టెస్టులో సోమవారం నాటి ఐదో టెస్టు ఐదో రోజు ఆటలో సిరీస్ ఫలితం తేలనుంది. టీమిండియా విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంటే.. ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగులు కావాలి.ఇక భారత్ విధించిన 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలవడానికి ప్రధాన కారణం.. జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111). ఈ ఇద్దరు అద్భుతమైన సెంచరీలతో రాణించి మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రూట్.. సిరాజ్‌ను ఆకాశానికెత్తాడు.అదంతా ఫేక్.. నిజానికి చాలా మంచోడు‘‘అతడికి పట్టుదల ఎక్కువ. అతడొక యోధుడు. నిజమైన పోరాట యోధుడు. అలాంటి ఆటగాడు తమ జట్టులో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. టీమిండియాను గెలిపించేందుకు సర్వస్వం ధారపోస్తాడు. అందుకు అతడిని తప్పక మెచ్చుకోవాల్సిందే.ఆటగాడిగా అతడి దృక్పథం బాగుంటుంది. ఒక్కోసారి కోపం వచ్చినట్లు నటిస్తాడు. కానీ అంతలోనే కూల్ అయిపోతాడు. నిజానికి సిరాజ్ మంచివాడు. కాకపోతే తాను కాస్త కఠినంగా ఉంటానని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడంతే!అతడు గొప్ప నైపుణ్యాలున్న ఆటగాడు. అందుకే వరుసగా వికెట్లు తీస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాడితో అతడితో తలపడటాన్ని నేను ఇష్టపడతాను. అతడి ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ చెరగదు. అతడు ఏం చేసినా అది జట్టు కోసమే!.. యువ ఆటగాళ్లకు అతడు స్ఫూర్తిదాయకం’’ అని రూట్ సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌లో ఇప్పటికే సిరాజ్ 20 వికెట్లు కూల్చి.. టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాదు ఇప్పటికే అత్యధికంగా వెయ్యి బంతులు వేశాడు కూడా!!టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు👉వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్👉టాస్: ఇంగ్లండ్.. మొదట బౌలింగ్👉తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 224👉తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోరు: 247👉రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 396👉374 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 339/6 (76.2).చదవండి: IND vs ENG: కామన్సెన్స్ లేదు.. నిజంగా సిగ్గుచేటు.. అరగంటలో ముగించేవారు!Mohammed Siraj lands a killer blow 💥He sends the set English captain back to the pavilion 👋#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @mdsirajofficial pic.twitter.com/Okwai75KaA— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2025 -
తప్పుల మీద తప్పులు!... గిల్, గంభీర్ తీరుపై అశ్విన్ ఆగ్రహం
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా ఆట తీరుపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) విమర్శలు గుప్పించాడు. నాయకత్వ బృందం వ్యూహాలు సరిగ్గాలేవని.. ప్రతి మ్యాచ్‌లోనూ ఆఖరి వరకు పోరాడినా ఓడిపోవడం హర్షించదగ్గ విషయం కాదన్నాడు. ఓవల్ టెస్టు (IND vs ENG Oval Test)లోనూ పాత తప్పిదాలే పునరావృతం చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఆఖరి వరకు పోరాడినా..కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. లీడ్స్ టెస్టులో టీమిండియా ఐదు సెంచరీలు సాధించినా.. ఆఖరికి ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలైంది. అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో స్టోక్స్ బృందాన్ని ఏకంగా 336 పరుగులతో చిత్తు చేసి చారిత్రాత్మక విజయం సాధించింది.అయితే, లార్డ్స్ టెస్టులో మాత్రం ఆఖరి వరకు పోరాడినా 22 పరుగుల తేడాతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇక మాంచెస్టర్‌లో డ్రాతో గట్టెక్కింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఓవల్‌లో ఆఖరి టెస్టులో టీమిండియా తప్పక గెలవాలి.ఐదో రోజే ఫలితంఅయితే, రికార్డు స్థాయిలో ఈ వేదికపై ప్రత్యర్థికి 374 పరుగుల లక్ష్యాన్ని విధించిన గిల్ సేన.. దానిని కాపాడుకునే ప్రయత్నంలో తడబడుతోంది. ఆదివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ విజయానికి 35 పరుగుల దూరంలో నిలవగా.. భారత్ గెలుపొందాలంటే నాలుగు వికెట్లు కావాలి.తప్పుల మీద తప్పులు!ఇంగ్లండ్ ఈ మేర పటిష్ట స్థితికి చేరుకోవడానికి జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111) అద్భుత శతకాలే కారణం. ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘వాటే ఫినిష్! ప్రతి మ్యాచ్‌లోనూ ఇరుజట్లు అనుభవలేమి కారణంగా ప్రాథమిక తప్పిదాలతో మూల్యం చవిచూస్తున్నాయి.అయితే, ఈరోజు ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచేందుకు ఎలాంటి అర్హత కలిగి లేదు. కానీ మనవాళ్ల వల్లే ఇది సాధ్యమైంది. ఓవల్‌లో టీమిండియా విఫలమైంది. అసలు ఈ సిరీస్‌లో భారత బృందం ఆది నుంచే వ్యూహాత్మక తప్పిదాలు చేసింది.అందుకే ఇంగ్లండ్ మనకంటే ముందుంది. శుబ్‌మన్ గిల్ రోజురోజుకీ మరింత మెరుగైన కెప్టెన్‌గా తయారవుతాడని నాకు నమ్మకం ఉంది. కానీ కొన్నిసార్లు ఆటకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.అతడిని ముందుగానే తీసుకురావాల్సిందిపేసర్ల బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లు షాట్లు బాదుతూ ఉంటే.. స్పిన్నర్లను బరిలోకి దించాలి. వారు వికెట్లు తీయకపోయినా పరుగుల ప్రవాహాన్ని మాత్రం కట్టడి చేస్తారు కదా! హ్యారీ బ్రూక్ అటాక్ మొదలుపెట్టి.. 20 పరుగులు చేసిన తర్వాత.. కచ్చితంగా స్పిన్నర్‌ను తీసుకురావాల్సింది. స్పిన్ బౌలర్ ఉంటే పరుగులు రాకుండా కట్టడి చేసేవాడు. మరో ఎండ్ నుంచి పేసర్ బౌల్ చేసేవాడు. నిజంగా ఆదివారం వాషింగ్టన్ సుందర్ చేతికి ముందుగానే బంతిని ఇచ్చి ఉంటే జట్టుకు ప్రయోజనకరంగా ఉండేది.డ్రెసింగ్ రూమ్ నుంచి వీరికి ఎలాంటి సలహాలు, సూచనలు వస్తున్నాయో నాకైతే తెలియడం లేదు. కానీ రోజు చిన్న చిన్న తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించే పరిస్థితికి చేరుకున్నాం’’ అంటూ ఫైర్ అయ్యాడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ గిల్ ప్రణాళికలు సరిగ్గా లేవంటూ అశ్విన్ విమర్శించాడు.బౌలర్ల ప్రదర్శన ఇలా..కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో పేసర్లలో ఆకాశ్ దీప్ 20 ఓవర్లలో 85 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా.. ప్రసిద్ కృష్ణ 22.2 ఓవర్లలో 109 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ 26 ఓవర్లలో 95 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 19, రవీంద్ర జడేజా 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చారు.చదవండి: IND vs ENG: కామన్సెన్స్ లేదు.. నిజంగా సిగ్గుచేటు.. అరగంటలో ముగించేవారు!Just in awe 👏#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @root66 pic.twitter.com/HkJjOiiOBT— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2025 -
కామన్సెన్స్ లేదు.. నిజంగా సిగ్గుచేటు.. అరగంటలో ముగించేవారు!
ఓవల్ టెస్టు ఆఖరి రోజుకు చేరిన నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య ఐదో టెస్టులో ఆదివారం నాటి నాలుగో రోజు ఆటను ముందుగానే నిలిపివేసి తప్పుచేశారని అంపైర్ల తీరును విమర్శించాడు. వర్షం తగ్గిన తర్వాత ఓ అరగంట సమయం ఇస్తే మ్యాచ్ ముగిసిపోయేదని అభిప్రాయపడ్డాడు.శతక్కొట్టిన రూట్, బ్రూక్ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో ఆఖరిదైన ఐదో టెస్టు లండన్‌లో ఓవల్ మైదానంలో గురువారం మొదలైంది. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో 50/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (Harry Brook- 111) సెంచరీల కారణంగా పటిష్ట స్థితికి చేరిన ఇంగ్లండ్.. ఆట నిలిపివేసే సమయానికి విజయానికి 35 పరుగుల దూరంలో నిలిచింది. మరోవైపు.. భారత్ గెలవాలంటే నాలుగు వికెట్లు అవసరం. ఇదిలా ఉంటే.. వెలుతురు లేమి కారణంగా ఆదివారం ఆటను నిలిపివేసిన నిర్వాహకులు.. ఆ తర్వాత వర్షం కురవడంతో ఆటను ముగించివేశారు. ఈ నాటకీయ పరిణామాల నడుమ ఆట ఐదో రోజుకు చేరుకుంది.కామన్సెన్స్ లేదు.. నిజంగా సిగ్గుచేటు..ఈ నేపథ్యంలో నాసిర్ హుసేన్ మాట్లాడుతూ.. ‘‘సోమవారం వర్కింగ్ డే. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు డబ్బులు చెల్లించారన్న ముఖ్య విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇలాంటి అద్భుతమైన సిరీస్‌లో తుది ఫలితాన్ని నేరుగా వీక్షించేందుకు ప్రేక్షకులు అర్హులు.అశేష అభిమానుల మధ్య.. చారిత్రాత్మక ది ఓవల్ మైదానంలో ఫలితం తేలితేనే సిరీస్ కూడా పరిపూర్ణం అవుతుంది. ఆదివారం రాత్రే ఇది జరిగి ఉండాల్సింది. ఇంగ్లండ్ మరో 35 పరుగులు చేసేదో.. లేదంటే గాయపడిన క్రిస్ వోక్స్ తిరిగి వచ్చి బ్యాటింగ్ చేసేవాడో తెలిసేది.అరగంటలో ముగించేవారు!కానీ వీళ్లేం చేశారు. ఆటను ఇలా ముగించివేయడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకో 42- 43 నిమిషాల పాటు ఆటను కొనసాగిస్తే ఫలితం తేలేది. నిబంధనల ప్రకారం.. కవర్లు తొలగించేందుకు వీలులేదని గ్రౌండ్స్‌మెన్ చెప్పేంత వరకు అంపైర్లు ఆటను ముగించరాదు.అదనంగా ఇంకో అరగంట కేటాయించి ఉంటే ఏమయ్యేది? ఫలితం వస్తుందని అనిపించినప్పుడు ఇలా చేయడంలో తప్పేముంది? నాకైతే కామన్సెన్స్ లోపించినట్లు అనిపిస్తోంది. నిజంగా ఇది సిగ్గుచేటు’’ అంటూ మండిపడ్డాడు. ఇక టీమిండియా మాజీ బ్యాటర్ దినేశ్ కార్తిక్ నాసిర్ హుసేన్‌కు మద్దతు పలికాడు. ఆఖరిదైన ఐదోరోజు ఆటను వీక్షించేందుకు కనీసం 20 వేల మంది ప్రేక్షకులు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. చదవండి: ఇంజక్షన్ తీసుకున్నావా?.. పరితపించిపోయిన శుబ్‌మన్ గిల్ -
ఇంజక్షన్ తీసుకున్నావా?.. పరితపించిపోయిన శుబ్‌మన్ గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా అరంగేట్రంలోనే బ్యాట్‌తో అదరగొట్టాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill). ఇంగ్లండ్‌తో లీడ్స్ టెస్టులో శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఎడ్జ్‌బాస్టన్‌లో డబుల్ సెంచరీ, సెంచరీలతో అలరించాడు. తద్వారా ఈ వేదికపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత సారథిగా నిలిచిన గిల్.. ఈ మైదానంలో తొలిసారి భారత్‌కు టెస్టు విజయం అందించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.మరోసారి శతక్కొట్టిఇక లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో విఫలమైనా.. మాంచెస్టర్ టెస్టులో సెంచరీ సాధించి డ్రా కావడంలో శుబ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను సమం చేయాలంటే ఆఖరిదైన ఐదో టెస్టు (IND vs ENG 5th Test)లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి.రూట్, బ్రూక్ సెంచరీలుచావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌కు 374 పరుగుల మేర మెరుగైన లక్ష్యమే విధించింది. కానీ ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. జో రూట్ (Joe Root- 105) మరోసారి తన అనుభవంతో ఇంగ్లండ్‌ను గట్టెక్కించగా.. యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ (111) అతడికి అండగా నిలిచాడు.ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బౌలర్లను మార్చుతున్నా ప్రయోజనం లేకపోయింది. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణలను వరుస విరామాల్లో బరిలోకి దించిన గిల్.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సేవలను కూడా వాడుకున్నాడు.నువ్వు ఇంజక్షన్ తీసుకున్నావా?అయితే, వీరిద్దరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో విసుగెత్తిన గిల్.. ఎలాగైనా మ్యాచ్‌ను తమవైపునకు తిప్పుకోవాలనే యోచనతో.. గాయపడిన ఆకాశ్ దీప్‌ను సిద్ధంగా ఉన్నావంటూ అడిగాడు. కాగా వెన్నునొప్పి కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన ఆకాశ్ దీప్.. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌కు వేసిన బంతిని.. అతడు స్ట్రెయిట్ షాట్‌గా మలచగా.. దానిని ఆపే క్రమంలో గాయపడ్డాడు. అతడి కాలికి గాయమైంది.అయితే, భోజన విరామ సమయానికి ముందు ఆకాశ్ దీప్ సేవలు వాడుకోవాలని భావించిన గిల్.. ‘‘నువ్వు ఇంజక్షన్ తీసుకున్నావా?’’ అంటూ అతడిని ప్రశ్నించాడు. ఈ మాటలు స్టంప్ మైకులో రికార్డు కాగా.. నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్, టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ స్పందిస్తూ.. ‘‘లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి పేసర్లనే బరిలోకి దించాలని గిల్ భావిస్తున్నాడు’’ అంటూ ప్రత్యర్థి జట్టు వికెట్లు పడగొట్టేందుకు భారత సారథి ఎంతగా పరితపించిపోతున్నాడో తెలియజేశాడు.కాగా బ్రూక్‌ను ఆకాశ్ దీప్ అవుట్ చేయగా.. రూట్‌ను ప్రసిద్ పెవిలియన్‌కు పంపాడు. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ప్రసిద్ మూడు, సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ నేపథ్యంలో భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ఆఖరి రోజైన సోమవారం గిల్ సేన విజయానికి నాలుగు వికెట్లు అవసరం. అలా అయితేనే.. సిరీస్‌ను 2-2తో డ్రా చేయగలుగుతుంది. మరోవైపు.. ఆతిథ్య జట్టు గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉంది. కాగా ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీతో గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణం ఆరంభించిన విషయం తెలిసిందే.చదవండి: IND vs ENG: అక్కడ నిల్చుని ఏం ఆలోచిస్తున్నావు సిరాజ్?.. రిక్కీ పాంటింగ్ ఫైర్!pic.twitter.com/iX9bFm9i9b— The Game Changer (@TheGame_26) August 3, 2025 -
అక్కడ నిల్చుని ఏం ఆలోచిస్తున్నావు సిరాజ్?.. రిక్కీ పాంటింగ్ ఫైర్!
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) తీరుపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిరాజ్ చేసిన తప్పు కారణంగా భారత జట్టు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య ఐదో టెస్టు తుది అంకానికి చేరుకుంది.దోబూచులాడుతున్న విజయంక్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందిస్తూ ఆఖరిదైన ఐదో రోజుకు చేరుకున్న ఆటలో సోమవారం ఫలితం వెలువడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే ఇంకా నాలుగు వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగుల దూరంలో నిలిచింది.నిజానికి ఓవల్ టెస్టులో టీమిండియాదే పైచేయి కావాల్సింది. కానీ హ్యారీ బ్రూక్ (Harry Brook- 111), జో రూట్ (105) శతకాలతో అదరగొట్టి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. నిజానికి బ్రూక్ 19 పరుగుల వద్దే అవుటవ్వాలి.సిరాజ్ చేసిన పొరపాటు వల్లకానీ సిరాజ్ చేసిన పొరపాటు ఇంగ్లండ్ శిబిరానికి బాగా కలిసి వచ్చింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్ వేసిన ప్రసిధ్ కృష్ణ తొలి బంతికి బ్రూక్ భారీ షాట్‌కు ప్రయత్నించగా... ఫైన్ లెగ్‌లో ఉన్న సిరాజ్ చక్కగా క్యాచ్‌ను ఒడిసిపట్టాడు.కానీ బంతి పట్టిన తర్వాత కుడికాలు కదిపి బౌండరీ లైన్ తొక్కేశాడు. దీంతో అది అనూహ్యంగా సిక్సర్ అయ్యింది. క్యాచ్ పట్టడంతోనే బౌలర్ ప్రసిధ్ సంబరం మొదలుపెడితే... సిక్సర్ కావడంతో బ్రూక్ పండగ చేసుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 137/3 మాత్రమే!ఇంగ్లండ్ ఇంకా లక్ష్యానికి 237 పరుగుల బహుదూరంలో ఉంది. ఇక్కడ బ్రూక్ ఒకవేళ నిష్క్రమించి ఉంటే... నాలుగో వికెట్ పడేది. ఇప్పటికే వోక్స్ అందుబాటులో లేకపోవడంతో చేతిలో ఉన్న 5 వికెట్లతో ఇంగ్లండ్ లక్ష్యఛేదన క్లిష్టమయ్యేది!అక్కడ నిల్చుని ఏం ఆలోచిస్తున్నావు సిరాజ్?కానీ తనకు దొరికిన లైఫ్‌లైన్‌ను సద్వినియోగం చేసుకున్న బ్రూక్ ఏకంగా సెంచరీ కొట్టేశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘అక్కడ నిల్చుని అతడు అసలు ఏం ఆలోచిస్తున్నాడు? నాకైతే అతడు బిక్కముఖం వేసుకుని చూస్తున్నాడనిపించింది.నిజానికి ఆ క్యాచ్ పట్టడానికి కదిలే పనేలేదు. ఉన్నచోటే ఉండి బంతిని ఒడిసిపట్టవచ్చు. ఈ తప్పిదం కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. బ్రూక్ ఎంత బాగా బ్యాటింగ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. టీ20 మ్యాచ్ మాదిరి టెస్టులోనూ అతడు బౌలర్లను రీడ్ చేసి అనుకున్న ఫలితాలు రాబట్టడంలో దిట్ట’’ అంటూ సిరాజ్ తీరును విమర్శించాడు.ఆట నిలిచే సమయానికి ఇలా..ఇక 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ సోమవారం వెలుతురులేమి కారణంగా ఆట నిలిచే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ రెండు, జేమీ ఓవర్టన్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ విజయానికి చేరువకావడంతో అవసరం పడితే.. ఆఖరి రోజు క్రిస్ వోక్స్ క్రీజులోకి దిగే అవకాశం ఉంది. కాగా గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఆబ్సెంట్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.చదవండి: యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్‌గా..Out? Six!?What's Siraj done 😱 pic.twitter.com/hp6io4X27l— England Cricket (@englandcricket) August 3, 2025 -
IND vs ENG: అదరగొట్టిన జైసూ, ఆకాశ్, జడ్డూ.. వాషీ మెరుపు ఇన్నింగ్స్
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ మీద తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. ఆతిథ్య జట్టుకు 374 పరుగుల లక్ష్యం విధించింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకం (118)తో చెలరేగితే.. ఆకాశ్ దీప్ (66), రవీంద్ర జడేజా (53) హాఫ్ సెంచరీలతో అలరించారు. వీరికి తోడు వాషింగ్టన్ సుందర్ మెరుపు అర్ధ శతకం (46 బంల్లో 53)తో అదరగొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ ఐదు వికెట్లు తీయగా.. గస్ అట్కిన్సన్ 3, జేమీ ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టారు.అదరగొట్టిన భారత బ్యాటర్లుఇంగ్లండ్తో ఐదో టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు ఆకట్టుకున్నారు. ఫలితంగా 87 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసి.. ఇంగ్లండ్ కంటే 373 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం నిర్ణయాత్మక ఐదో టెస్టు మొదలైన విషయం తెలిసిందే. లండన్‌లో ఓవల్ మైదానంలో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.అయితే, తొలి ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడ్డ గిల్ సేన 69.4 ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 38 పరుగులు చేయగలిగాడు.మిగతా వాళ్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (21), రవీంద్ర జడేజా (9), ధ్రువ్ జురెల్ (19) విఫలం కాగా.. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు రాబట్టాడు. ఇక ఐదో నంబర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఒక్కడే అర్ధ శతకం (57)తో రాణించాడు.. అతడి ఇన్నింగ్స్ కారణంగానే భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక టెయిలెండర్లలో ఆకాశ్ దీప్ (0) నాటౌట్‌గా నిలవగా.. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ డకౌట్‌గా వెనుదిరిగారు.ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. జోష్ టంగ్ మూడు, క్రిస్ వోక్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు జాక్ క్రాలే (64), బెన్ డకెట్ (43)తో పాటు హ్యారీ బ్రూక్ (53) రాణించాడు.భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ నాలుగేసి వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. ఇంగ్లండ్ టెయిలెండర్ క్రిస్ వోక్స్ ఆబ్సెంట్హర్ట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. రెండు వికెట్ల (కేఎల్ రాహుల్-7, సాయి సుదర్శన్- 11) నష్టానికి 75 పరుగులు చేసింది.వీలుచిక్కినప్పుడల్లా సిక్సర్లు బాదుతూఈ క్రమంలో 75/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతక్కొట్టగా (118), నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన పేసర్ ఆకాశ్ దీప్ సంచలన అర్ధ శతకం (66) సాధించాడు.ఇక కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (11) మరోసారి నిరాశపరచగా.. కరుణ్ నాయర్ (17) కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (46 బంతుల్లో 34) వేగంగా ఆడే ప్రయత్నం చేసి జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.మరోవైపు.. అర్ధ శతకంతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా (53)ను జడేజా జోష్ టంగ్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి.. ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. జడ్డూ అవుటయ్యే సరికి అంటే.. 83.2 ఓవర్లలో టీమిండియా 357 పరుగులు చేసింది. తద్వారా ఇంగ్లండ్ కంటే 334 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జడ్డూ స్థానంలో క్రీజులోకి వచ్చిన సిరాజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బాధ్యత తన మీద వేసుకున్న వాషింగ్టన్ సుందర్ వీలుచిక్కినప్పుడల్లా సిక్సర్లు బాదుతూ.. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 39 బంతుల్లోనే 52 పరుగులతో సత్తా చాటాడు. -
జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్‌గా..
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో అద్బుత శతకంతో మెరిశాడు. ఓవల్ మైదానంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైసూ.. శనివారం దానిని శతకంగా మలచుకున్నాడు. ఈ ఎడమచేతి వాటం 127 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు.మొత్తంగా 164 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ పద్నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 71కి పైగా స్ట్రైక్‌రేటుతో 118 పరుగులు సాధించాడు. నిజానికి రెండో రోజు భారత్.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (7), వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (11) రూపంలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది.ఆరంభం నుంచే అదరగొట్టారుఈ క్రమంలో నైట్ వాచ్‌మన్‌గా ఆకాశ్ దీప్ (Akash Deep).. యశస్వికి జతయ్యాడు. అయితే, ఇద్దరూ కలిసి చక్కటి సమన్వయంతో స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ.. మూడో రోజు ఆరంభం నుంచే అదరగొట్టారు. ఇక ఆకాశ్ దీప్ ఊహించని రీతిలో బౌండరీలు బాదుతూ.. జైస్వాల్‌పై ఒత్తిడి తగ్గించాడు. మరోవైపు.. ఇంగ్లండ్ ఫీల్డర్ల తప్పిదాలు కూడా వీరికి కలిసివచ్చాయి. తొలి అర్ధ శతకంఈ క్రమంలో ఆకాశ్ దీప్ తన టెస్టు కెరీర్లో తొలి అర్ధ శతకం (66) సాధించగా.. జైసూ ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 23 ఏళ్ల యశస్వి జైస్వాలో ఇంత వరకు టెస్టు క్రికెట్లో ఏ ఆటగాడికీ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు.జైస్వాల్ ప్రపంచ రికార్డుజైస్వాల్ సాధించిన సెంచరీ (వంద పరుగులు)లో 82 పరుగులు బిహైండ్ స్క్వేర్ పొజిషన్ నుంచి వచ్చినవే. ఇప్పటికి టెస్టు చరిత్రలో 1526 శతకాలు నమోదు కాగా.. ఇలా ఒక ప్రత్యేకమైన ఏరియా నుంచి ఏకంగా 82 పరుగులు సాధించి... శతకం పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడిగా జైస్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.నువ్వా- నేనాఇక మ్యాచ్ విషయానికొస్తే.. లండన్‌లోని ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో గురువారం మొదలైన ఐదో టెస్టులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్ (38) ఫర్వాలేదనిపించగా.. కరుణ్ నాయర్ (57) అర్ధ శతకంతో రాణించాడు.ఇక ఇందుకు బదులుగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆతిథ్య జట్టు ఆరంభంలో అదరగొట్టినా.. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు కూల్చి.. బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. చదవండి: బహిష్కరించిన భారత్.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం! -
IND vs ENG: శతక్కొట్టిన జైస్వాల్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ అంటే అంతే!
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiwal) శతక్కొట్టాడు. ఓవల్ మైదానంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా వంద పరుగుల మార్కును అందుకున్నాడు. 127 బంతుల్లోసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి శతక ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ సిరీస్‌లో జైసూకు ఇది రెండో శతకం. అంతకు ముందు లీడ్స్ వేదికగా తొలి టెస్టులో జైస్వాల్ 101 పరుగులు చేశాడు. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో సిరీస్ ఫలితాన్ని తేల్చే ఆఖరిదైన ఐదో మ్యాచ్ లండన్‌లో గురువారం మొదలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది.హాఫ్ సెంచరీని సెంచరీగా మలిచాడుతొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ రెండు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి జైస్వాల్ గేరు మార్చాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలోనే అర్ధ శతకం (52*) పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. శనివారం దానిని సెంచరీగా మలిచాడు.టెస్టులలో ఆరోది..తద్వారా ఈ సిరీస్‌లో రెండో శతకంతో పాటు.. తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఇందులో నాలుగు ఇంగ్లండ్ మీద బాదినవే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. 75/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన టీమిండియా 51 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. నైట్ వాచ్‌మన్ ఆకాశ్ దీప్ అర్ధ శతకం(66)తో చెలరేగగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (11) మాత్రం నిరాశపరిచాడు. జైసూతో కలిసి కరుణ్ నాయర్ (9*) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లండ్.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ అయింది.చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్ -
ఊహించని రీతిలో చెలరేగిన ఆకాశ్.. గంభీర్, గిల్ రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) అర్ధ శతకంతో మెరిశాడు. శనివారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా డెబ్బై బంతుల్లో యాభై పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో తన తొలి హాఫ్ సెంచరీని ఇంగ్లండ్ గడ్డ మీద నమోదు చేశాడు.గంభీర్, గిల్, జడేజా రియాక్షన్ వైరల్నైట్ వాచ్‌మన్‌గా వచ్చి అర్ధ శతకంతో ఆకాశ్ దీప్ ఇరగదీయడంతో భారత శిబిరంలో నవ్వులు పూశాయి. హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ఆకాశ్ బ్యాట్ పైకెత్తగానే.. కెమెరాలు ఇండియన్ డ్రెసింగ్‌రూమ్ వైపు మళ్లాయి. లోపల కూర్చుని ఉన్న హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) చిరునవ్వులు చిందించాడు.మరోవైపు.. బయటకు వచ్చిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చప్పట్లతో ఆకాశ్ దీప్‌ను ఉత్సాహపరుస్తూ అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్ 43వ ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ఆకాశ్ దీప్.. పాయింట్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.66.. అవుట్అక్కడికి దగ్గర్లో ఫీల్డింగ్ చేస్తున్న గస్ అట్కిన్సన్ పరుగెత్తుకుని వచ్చి డైవ్ చేసి మరీ బంతిని అందుకున్నాడు. దీంతో ఆకాశ్ దీప్ ‘హీరోచిత’ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్న అతడు.. 12 ఫోర్ల సాయంతో 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఫలితంగా టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కాగా 75/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి టీమిండియా.. భోజన విరామ సమయానికి 44 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 85, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా ఇంగ్లండ్ కంటే 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు👉వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 224👉ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 247.చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్A maiden international 5️⃣0️⃣ for Akash Deep 👏#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/O1wAt9ecyg— Sony Sports Network (@SonySportsNetwk) August 2, 2025 -
ఆకాశ్ ధనాధన్.. తొలి హాఫ్ సెంచరీ! డకెట్‌తో.. నిన్న అలా.. ఈరోజు ఇలా!
ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ (Ben Dcukett) టీమిండియా అభిమానులను ఆశ్చర్యపరిచాడు. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep)ను ఆలింగనం చేసుకుని స్వీట్ షాకిచ్చాడు. ఇంగ్లండ్- భారత్ (Ind vs Eng) మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.క్రీడా స్ఫూర్తిదే విజయంఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘చిన్న చిన్న యుద్ధాలు.. అయితే వాటిపై అంతిమంగా క్రీడా స్ఫూర్తిదే విజయం’’ అంటూ క్రికెట్ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓవల్ టెస్టులో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా డకెట్- ఆకాశ్ మధ్య నువ్వా- నేనా అన్నట్లు పోటీ జరిగిన విషయం తెలిసిందే.భుజంపై చెయ్యి వేసి.. నవ్వులు చిందిస్తూఆకాశ్ బౌలింగ్‌లో బౌండరీలు బాదిన డకెట్.. ఆఖరికి రివర్స్ స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో తనదే పైచేయి అన్నట్లుగా ఆకాశ్ దీప్.. డకెట్ క్రీజును వదిలి వెళ్తుంటే అతడి భుజంపై చెయ్యి వేసి.. నవ్వులు చిందిస్తూ స్లెడ్జ్ చేశాడు. అయితే, డకెట్ కూల్‌గానే ఇందుకు సమాధానమిస్తూ పెవిలియన్‌కు చేరాడు.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఆకాశ్ దీప్‌పై విమర్శలు వచ్చాయి. అయితే, శనివారం నాటలో భాగంగా ఫీల్డర్ డకెట్ వచ్చి.. ‘బ్యాటర్’ ఆకాశ్ దీప్‌ను హగ్ చేసుకోవడం విశేషం. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 28వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.కాగా ఓవల్ మైదానంలో 224 పరుగులకు టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగించగా.. ఇందుకు సమాధానంగా ఇంగ్లండ్ 247 పరుగులతో బదులిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారమే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.ఓపెనర్ కేఎల్ రాహుల్ (7), సాయి సుదర్శన్ (11) నిరాశపరిచారు. అయితే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 51 పరుగులతో.. ఆకాశ్ దీప్ నాలుగు పరుగులతో క్రీజులో నిలిచాడు. తొలి హాఫ్ సెంచరీఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో ఆరంభం నుంచే.. జైస్వాల్‌తో కలిసి ఆకాశ్ దీప్ ధనాధన్ దంచికొట్టాడు. 70 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఫోర్ బాది మరీ యాభై పరుగుల మార్కును చేరుకోవడం విశేషం. టెస్టులలో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ.ఇక 40 ఓవర్ల ముగిసేసరికి జైస్వాల్ 82, ఆకాశ్ దీప్ 53 పరుగులతో ఉన్నారు. భారత్ స్కోరు: 158/2 (40). ఇంగ్లండ్ కంటే 135 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆకాశ్ దీప్.. 80 పరుగులు ఇచ్చి.. డకెట్ (38 బంతుల్లో 43) రూపంలో కీలక వికెట్ తీశాడు. చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్A much needed breakthrough for India 🔥And a cheeky send-off for Ben Duckett 😜#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/9YaTjcEYOn— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2025 -
నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్
ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ (Ben Duckett)పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ (Ricky Ponting) ప్రశంసలు కురిపించాడు. బౌలర్ రెచ్చగొడుతున్నా ఏమాత్రం సహనం కోల్పోకుండా.. ఓపికగా ఉన్న తీరు తనను ఆకట్టుకుందని తెలిపాడు. తాను గనుక డకెట్ స్థానంలో ఉండి ఉంటే.. ఆకాశ్ దీప్‌నకు గట్టిగా ఓ పంచ్ ఇచ్చేవాడినంటూ భారత పేసర్ వ్యవహారశైలిని విమర్శించాడు.కాగా టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. లండన్‌లోని ఓవల్ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్ క్రాలీ (57 బంతుల్లో 64), బెన్ డకెట్ (38 బంతుల్లో 43) శుభారంభం అందించారు.ధనాధన్.. ఫటాఫట్ఇద్దరూ బజ్‌బాల్ ఆటతో వేగంగా పరుగులు రాబడుతూ భారత బౌలర్లను తిప్పలుపెట్టారు. ఈ క్రమంలో ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో బౌండరీలు బాదిన డకెట్.. మరోసారి రివర్స్ స్కూప్ షాట్‌కు యత్నించి.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఈ క్రమంలో క్రీజును వీడుతున్న డకెట్ దగ్గరికి వెళ్లిన ఆకాశ్ దీప్.. అతడి భుజం చుట్టూ చెయ్యి వేసి.. నవ్వుతూ అతడిని స్లెడ్జ్ చేశాడు. ఇందుకు డకెట్ కూడా బదులిచ్చినా అతడి ముఖం మాత్రం కాస్త ప్రశాంతంగానే కనిపించింది. ఇంతలో కేఎల్ రాహుల్ వచ్చి ఆకాశ్ దీప్‌ను అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లాడు.నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడినిఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో జరిగిన ఈ ఘటనపై రిక్కీ పాంటింగ్ స్పందించాడు. ‘‘డకెట్ స్థానంలో మీరు ఉంటే గనుక గట్టిగా పంచ్ ఇచ్చేవారు. అవునా? కాదా? అని స్పోర్ట్స్ ప్రజెంటర్ అడుగగా.. పాంటింగ్ అవునని సమాధానం ఇచ్చాడు.‘‘కచ్చితంగా నేను అలాగే చేసేవాడిని. ఏదేమైనా గల్లీ క్రికెట్లో ఇలాంటివి చూస్తాం. కానీ టెస్టు క్రికెట్లో.. అదీ హోరాహోరీగా సాగుతున్న సిరస్లో ఇలాంటి ప్రవర్తన సరికాదు. వాళ్లిద్దరు ప్రత్యర్థులు కావొచ్చు. లీగ్ క్రికెట్లో భాగంగా ఒకే జట్టుకు ఆడనూ వచ్చు.ఆటలో ఇలాంటివి మజాను ఇస్తాయి. కానీ సీరియస్‌గా సాగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పటి వరకు నాకు బెన్ డకెట్ ఆట ఎంతగానో నచ్చేది. ఇప్పుడు అతడు.. బౌలర్ రెచ్చగొట్టినా సహనం కోల్పోకుండా.. ప్రతిస్పందించకుండా ఉండటం ఇంకా నచ్చింది’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.రాణించిన సిరాజ్, ప్రసిద్ఇక రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను టీమిండియా 247 పరుగులకు ఆలౌట్ చేసింది. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్‌నకు ఒక వికెట్ దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.ఓపెనర్ కేఎల్ రాహుల్ (7) మరోసారి విఫలం కాగా.. సాయి సుదర్శన్ (11) కూడా స్పల్ప స్కోరుకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 51 పరుగులతో అదరగొట్టగా.. ఆకాశ్ దీప్ నాలుగు పరుగులతో అతడితో కలిసి క్రీజులో ఉన్నాడు. చదవండి: అతడొక లెజెండ్.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్ బౌలర్A much needed breakthrough for India 🔥And a cheeky send-off for Ben Duckett 😜#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/9YaTjcEYOn— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2025 -
చూస్తూ ఊరుకోవాలా? అంపైర్‌పై కేఎల్ రాహుల్ ఫైర్! వీడియో వైరల్
ది ఓవల్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో ఆటతో పాటు మాటలు కూడా హైలెట్‌గా నిలుస్తున్నాయి. రెండో రోజు ఆట సందర్బంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను ఔట్ చేసిన అనంతరం ఆకాష్ దీప్ అతడి భుజంపై చెయ్యి వేసి మరి సెంఢాప్ ఇవ్వడం.. మైదానంలో ప్రశాంతంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే జో రూట్, ప్రసిద్ధ్ కృష్ణతో గొడవపడడం వంటి సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం ఆన్‌ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేనతో మాటల యుద్దానికి దిగాడు.అసలేమి జరిగిందంటే?ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో జో రూట్.. ఐదో బంతిని థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో రూట్ వైపు చూస్తూ ప్రసిద్ద్ ఏదో అన్నాడు. దీంతో రూట్ కూడా బదులుగా కృష్ణపై సీరియస్ అయ్యాడు.అంతేకాకుండా రూట్ అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ప్రసిద్ద్ మద్దతుగా కేఎల్ రాహుల్ నిలిచాడు. గొడవ దేని గురించి అని తెలుసుకోవడానికి కుమార్ ధర్మసేనతో రాహుల్ మాట్లాడాడు. కానీ ధర్మసేన ఇచ్చిన సమాధానంపై కేఎల్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో కాసేపు అంపైర్‌తో రాహుల్ వాదించాడు. ఆ తర్వాత ఎవరి ఫీల్డింగ్ స్దానాలకు వారు వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.అంపైర్-రాహుల్ మధ్య జరిగిన సంభాషణ ఇదే..రాహుల్: మమ్మల్ని ఏం చేయమంటారు? నిశ్శబ్దంగా ఉండమంటారా?ధర్మసేన: ఏ బౌలర్ అయినా నీ దగ్గరికి వచ్చి గొడవ పడితే నీకు నచ్చుతుందా రాహుల్? ప్రసిద్ద్ అలా చేయడం కరక్ట్ కాదు. మనం అలా ప్రవర్తించకూడదు.రాహుల్: అవతలి వ్యక్తి మమ్మల్ని దూషిస్తే.. చూస్తూ ఊరుకోవాలా? బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్లమంటారా?ధర్మసేన: మ్యాచ్ ముగిశాక మనం మాట్లాడదాం. నువ్వు అలా మాట్లాడడం మాత్రం సరికాదుఈ సంభాషణంతా స్టంప్ మైక్‌లో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(51), ఆకాష్ దీప్(4) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్..🔥"You want us to just bat, bowl & go home?"🔥KL Rahul BLASTS at umpire Dharmasena in fiery defence of Prasidh Krishna! 😤⚡Tension hits the roof as Rahul says, "What do you want us to do, keep quiet?" 🗣️💥Captain steps up. Drama unfolds. Cricket gets REAL! 🏏🔥#KLRahul… pic.twitter.com/KaID8ddhda— Nihar Ranjan (@Niharra98749805) August 1, 2025 -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు
టీమిండియాతో సిరీస్‌లో అదరగొడుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) అరుదైన ఘనత సాధించాడు. భారత జట్టుపై టెస్టుల్లో ఒకే దేశంలో 2000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. సొంతగడ్డ ఇంగ్లండ్‌పై ఈ మైలురాయిని చేరుకుని ప్రపంచంలో ఇంత వరకు ఏ ప్లేయర్‌కూ సాధ్యం కాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.టీమిండియాతో ఓవల్ వేదికగా ఐదో టెస్టులో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా రూట్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.2-1తో ఆధిక్యంలో ఇంగ్లండ్ఇందులో భాగంగా ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు రెండింట.. పర్యాటక భారత్ ఒక మ్యాచ్ గెలిచాయి. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు డ్రా అయింది. ఈ క్రమంలో సిరీస్ ఫలితం తేలాంటే ఆఖరిదైన ఐదో టెస్టు కీలకంగా మారింది.లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు ఇంగ్లండ్ ధీటుగా బదులిస్తోంది. కేవలం 37 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు పూర్తి చేసుకుంది.దంచికొట్టిన ఓపెనర్లుఓపెనర్లు జాక్ క్రాలీ (64), బెన్ డకెట్ (43) ధనాధన్ దంచికొట్టగా.. వన్‌డౌన్‌లో వచ్చిన తాత్కాలిక కెప్టెన్ ఓలీ పోప్ (22) మాత్రం నిరాశపరిచాడు. ఇక జో రూట్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిరాజ్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. జేకబ్ బెతెల్ (6) కూడా సిరాజ్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ఇదిలా ఉంటే.. జో రూట్‌కు ఇంగ్లండ్‌లో టీమిండియాపై ఇది 20వ టెస్టు మ్యాచ్. ఈ క్రమంలో ఓవల్ టెస్టు సందర్భంగా అతడు భారత జట్టుపై రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇంతవరకు ఏ బ్యాటర్ కూడా టీమిండియాపై ఈ అరుదైన మైలురాయిని తాకలేదు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ జో రూట్.ఒక దేశంలో టీమిండియాపై అత్యధిక టెస్టు పరుగులు సాధించిన క్రికెటర్లు🏏జో రూట్- ఇంగ్లండ్‌లో- 2000* రన్స్🏏రిక్కీ పాంటింగ్- ఆస్ట్రేలియాలో- 1893 రన్స్🏏శివ్‌నరైన్ చందర్‌పాల్- వెస్టిండీస్‌లో- 1547 రన్స్🏏జహీర్ అబ్బాస్- పాకిస్తాన్లో- 1427 రన్స్🏏స్టీవ్ స్మిత్- ఆస్ట్రేలియాలో- 1396 రన్స్.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ ఓపెనర్లు -
ప్రసిద్ కృష్ణపై మండిపడ్డ రూట్.. ఎందుకంత సీరియస్?.. వీడియో
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ (Joe Root)కు కోపమొచ్చింది. టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడు అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఆఖరిదైన ఐదో టెస్టు ఓవల్‌లో గురువారం మొదలైంది.టీమిండియా నామమాత్రపు స్కోరుటాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియాను మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ చేసింది. పేసర్ గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లతో చెలరేగి గిల్ సేన నామమాత్రపు స్కోరుకు పరిమితం కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా భారత్‌ను ఆలౌట్ చేసిన తర్వాత.. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.శుభారంభం అందించిన ఓపెనర్లుఓపెనర్లలో జాక్ క్రాలీ హాఫ్ సెంచరీ (57 బంతుల్లో 64)తో అదరగొట్టగా.. బెన్ డకెట్ (38 బంతుల్లో 43) కూడా రాణించాడు. బజ్‌బాల్ ఆటతో చెలరేగిన ఓపెనర్లలో డకెట్‌ను ఆకాశ్ దీప్ పెవిలియన్‌కు పంపగా.. క్రాలీని ప్రసిద్ కృష్ణ అవుట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ కెప్టెన్ ఓలీ పోప్ (22)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ 142 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్‌ను ప్రసిద్ కృష్ణ వేశాడు. అతడి బౌలింగ్‌లో క్రాలీ.. రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం జో రూట్ అతడి స్థానంలో రాగా.. ప్రసిద్ అద్భుతమైన బౌలింగ్‌తో అతడిని తిప్పలు పెట్టాడు.ఆఖరి బంతికి ఫోర్ బాదిన రూట్ఆ ఓవర్లో తర్వాతి ఐదు బంతుల్లో (మూడోది నోబాల్) రూట్ ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. అయితే, ఆఖరి బాల్‌ను ప్రసిద్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీగా సంధించగా.. రూట్ దానిని థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీకి తరలించాడు. ప్రసిద్ కృష్ణపై మండిపడ్డ రూట్ఈ క్రమంలో ప్రసిద్ కృష్ణ ఏదో అనగా.. రూట్ ఎన్నడూ లేని విధంగా సీరియస్ అయ్యాడు. ప్రసిద్తో వాగ్వాదం చేస్తూనే అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. అందుకు ప్రసిద్ కూడా గట్టిగానే బదులిచ్చినట్లు కనిపించింది. ఇంతలో అంపైర్ వచ్చి భారత పేసర్‌ను వివరణ అడిగినట్లు కనిపించింది. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా ప్రసిద్‌కు మద్దతుగా నిలబడి.. అంపైర్‌తో వాదించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజానికి రూట్ ఇలా మైదానంలో సీరియస్ అవ్వడం అరుదు.కానీ ఈసారి మాత్రం అతడు తీవ్రస్థాయిలో ప్రసిద్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. అంతకుముందు ఆకాశ్ దీప్.. బెన్ డకెట్ సాగనంపే క్రమంలో భుజంపై చెయ్యి వేసి మరీ సెండాఫ్ ఇచ్చిన దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక 33 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 33వ ఓవర్ ఆఖరి బంతికి సిరాజ్ బౌలింగ్‌లో రూట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బ్రూక్ 8 పరుగులతో ఉండగా.. జేకబ్ బెతెల్ క్రీజులోకి వచ్చాడు.చదవండి: డకెట్ భుజంపై చెయ్యి వేసిన ఆకాశ్ దీప్.. పక్కకు లాక్కెళ్లిన రాహుల్.. వీడియోVerbal spat between Prasidh krishna and joe root.#INDvsENGTest pic.twitter.com/6cbJCa7IVd— U' (@toxifyy18) August 1, 2025 -
ఆకాశ్ దీప్ ఆన్ ఫైర్.. పక్కకు లాక్కెళ్లిన కేఎల్ రాహుల్.. వీడియో
ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ (Ben Duckett) బజ్‌బాల్ ఆటతో భారత బౌలర్లకు స్వాగతం పలికారు. టీ20 ఫార్మాట్ తరహాలో ర్యాంప్, స్కూప్ షాట్లతో చెలరేగిపోయారు. వీరిద్దరి జోరును నిలువరించేందుకు టీమిండియా పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.ఈ క్రమంలో డకెట్ అత్యుత్సాహం ప్రదర్శించగా.. ఆకాశ్ దీప్ (Akash Deep) అద్భుతమైన బంతితో అతడిని బోల్తా కొట్టించాడు. రివర్స్ స్కూప్ షాట్ ఆడేందుకు అతడు చేసిన ప్రయత్నం విఫలమైంది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13 ఓవర్లో బౌలింగ్‌కు దిగిన ఆకాశ్ దీప్.. ఐదో బంతిని ఫుల్ డెలివరీగా సంధించాడు. అయితే, బంతిని అంచనా వేయడంలో పొరపడ్డ డకెట్.. రివర్స్ స్కూప్ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) చేతుల్లో పడింది. దీంతో హాఫ్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో డకెట్.. 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటై వెనుదిరగాల్సి వచ్చింది.డకెట్ భుజంపై చెయ్యి వేసిన ఆకాశ్ దీప్.. ఇక డకెట్ అవుట్ కాగానే.. ‘సాధించాను’ అన్నట్లుగా ఆకాశ్ దీప్ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం క్రీజును వీడుతున్న డకెట్ భుజంపై చెయ్యి వేసి.. అతడితో ఏదో అన్నాడు. పక్కకు లాక్కెళ్లిన రాహుల్ఇందుకు సదరు బ్యాటర్ కూడా సమాధానం ఇచ్చినట్లు కనిపించింది. ఇంతలో కేఎల్ రాహుల్ వచ్చి ఆకాశ్ దీప్‌ను అక్కడి నుంచి తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య గురువారం నిర్ణయాత్మక ఐదో టెస్టు ఓవల్ మైదానంలో మొదలైంది. టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 224 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ధనాధన్అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ భోజన విరామ సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టాననికి 109 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్‌కు వెళ్లేప్పటికి ఓపెనర్ జాక్ క్రాలీ 52, వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఓలీ పోప్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. క్రాలీతో కలిసి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన డకెట్.. 38 బంతుల్లో 43 పరుగులు చేసి వెనుదిరిగాడు.ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో లీడ్స్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ గెలిచింది. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు విజయం సాధించగా.. మాంచెస్టర్ టెస్టు డ్రా అయింది. ఆఖరిదైన ఐదో టెస్టులో టీమిండియా తప్పక గెలవాలి. లేదంటే.. ఇంగ్లండ్‌కు సిరీస్ సమర్పించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.చదవండి: బిక్కముఖం వేశాడు.. జైసూ ఎప్పటికీ సాయి సుదర్శన్ కాలేడు: అశ్విన్AKASHDEEP REACTION AFTER GETTING BEN DUCKETT. 🤣#akashdeep #benduckett #INDvsENG pic.twitter.com/mZQ8SRNc91— Ritika Singh (@Ritikasinggh) August 1, 2025 -
IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ ఓపెనర్లు
టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ ఓపెనర్లు బెక్ డకెట్ (Ben Duckett), జాక్ క్రాలీ సరికొత్త చరిత్ర లిఖించారు. భారత జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీగా రికార్డులకెక్కారు. అదే విధంగా.. టీమిండియాపై టెస్టుల్లో అత్యధికసార్లు 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు.ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఓవల్ మైదానంలో గురువారం ఐదో టెస్టు మొదలైన విషయం తెలిసిందే. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ కీలక మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గిల్ సేన.. 224 పరుగులకు ఆలౌట్ అయింది.224 పరుగులకు టీమిండియా ఆలౌట్వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (38), ఐదో స్థానంలో ఆడిన కరుణ్ నాయర్ (57) తప్ప మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్ గస్ అట్కిన్సన్ (Gus Atkinson) ఐదు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ శుభారంభం అందించారు. డకెట్ 29, క్రాలీ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. టీమిండియాపై 936 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఆండ్రూ స్ట్రాస్- అలిస్టర్ కుక్ జోడీని వీరు అధిగమించారు.కుక్- స్ట్రాస్‌లను అధిగమించి..కాగా డకెట్- క్రాలీ జోడీ టీమిండియాపై ఇప్పటికి ఓవరాల్‌గా 936 పరుగులు పూర్తి చేసుకోగా.. కుక్- స్ట్రాస్ కలిసి 20 ఇన్నింగ్స్‌లో 932 పరుగులు సాధించారు. అదే విధంగా.. అత్యధికంగా ఎనిమిదిసార్లు డకెట్- క్రాలీ 50 ప్లస్ పార్ట్నర్షిప్స్ నమోదు చేశారు.ఇదిలా ఉంటే.. డకెట్ అర్ధ శతకానికి చేరువైన వేళ టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ అద్బుత డెలివరీతో అతడిని పెవిలియన్‌కు పంపాడు. 38 బంతులు ఎదుర్కొని 43 పరుగులు చేసిన డకెట్.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు.. భోజన విరామ సమయానికి 16 ఓవర్ల ఆట ముగిసేసరికి క్రాలీ అర్ధ శతకం (52) పూర్తి చేసుకోగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ 12 పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 109/1 (16). కాగా డకెట్-క్రాలీ కలిసి తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించారు.చదవండి: కెప్టెన్‌గా శార్దూల్ ఠాకూర్ -
BCCI: బుమ్రాను రిలీజ్ చేసిన బీసీసీఐ.. అప్డేటెడ్ జట్టు ఇదే
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఐదో టెస్టు జట్టు నుంచి రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్‌తో ఓవల్ టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా బీసీసీఐ ఈ మేరకు తమ నిర్ణయాన్ని వెల్లడించింది.ఇక జట్టును వీడిన బుమ్రాకు సెప్టెంబరులో జరిగే ఆసియా కప్-2025 (Asia Cup) వరకు సుదీర్ఘ కాలం విశ్రాంతి లభించనుంది. కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. స్టోక్స్ బృందంతో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడుతోంది.ఓవల్ టెస్టులో గెలిస్తేనే సమంఈ క్రమంలో ఇంగ్లండ్ గిల్ సేనపై 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆఖరిదైన ఓవల్ టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను కనీసం డ్రా చేసుకోగలుగుతుంది. అయితే, పనిభారం తగ్గించే క్రమంలో ప్రధాన పేసర్ బుమ్రాను ఇంగ్లండ్‌లో కేవలం మూడు టెస్టుల్లోనే ఆడిస్తామని మేనేజ్మెంట్ ముందుగానే ప్రకటించింది.అందుకు తగ్గట్లుగానే లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఎడ్జ్‌బాస్టన్‌లో విశ్రాంతి తీసుకున్నాడు. లార్డ్స్ టెస్టుతో తిరిగి వచ్చి.. వెంటనే మాంచెస్టర్ టెస్టు కూడా ఆడాడు. అయితే, కీలకమైన ఐదో టెస్టులో ఆడతాడని భావించినా.. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా యాజమాన్యం అతడికి రెస్ట్ ఇచ్చింది. తాజాగా జట్టు నుంచి రిలీజ్ చేసింది. కాగా ఇంగ్లండ్‌తో ఆడిన మూడు టెస్టుల్లో ఈ రైటార్మ్ పేసర్ ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి.. 14 వికెట్లు కూల్చాడు.ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు భారత జట్టు (అప్డేటెడ్)శుభమన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, అర్ష్‌దీప్ సింగ్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఆసియా కప్ నాటికి తిరిగి వస్తాడా?ఆసియాకప్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నట్లు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ మొహసిన్ నఖ్వీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రణాళిక ప్రకారం భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబరు 14న గ్రూప్ దశ మ్యాచ్, 21న ‘సూపర్ ఫోర్’ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనుండగా... దుబాయ్, అబుదాబిలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. యూఏఈ, ఒమాన్, పాకిస్తాన్‌తో కలిసి భారత్ గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుండగా... శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్ గ్రూప్ ‘బి’లో పోటీపడనున్నాయి.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ కేవలం తటస్థ వేదికల్లోనే తలపడాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించనున్నారు. ప్రసారదారులతో ఏసీసీ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్ నుంచి పోటీపడనున్నాయి. దీంతో గ్రూప్ స్థాయిలో, ‘సూపర్ ఫోర్’ దశతో పాటు ఫైనల్లో ఇరు జట్లు పోటీపడే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుండటంతో... ఆసియాకప్‌ను అదే ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మెగా టోర్నీ నాటికి బుమ్రా తిరిగి వస్తాడో లేదో చూడాలి. చదవండి: ENG VS IND 5th Test: అట్కిన్సన్ విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా -
బిక్కముఖం వేశాడు.. జైసూ ఎప్పటికీ సాయి సుదర్శన్ కాలేడు: అశ్విన్
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) విఫలమయ్యాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కేవలం రెండు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) జైస్వాల్ టెక్నిక్ సరిగ్గా లేదంటూ విమర్శించాడు. అతడు ఎప్పటికీ సాయి సుదర్శన్ కాలేడని.. అట్కిన్సన్ వేసిన బంతిని అంచనా వేయడంలో జైసూ పూర్తిగా విఫలమయ్యాడని పేర్కొన్నాడు.బిక్కముఖం వేశాడుఈ మేరకు.. ‘‘జైస్వాల్ ఎన్నటికీ సాయి సుదర్శన్ కాలేడు. అయినా వీళ్లిద్దరిని పోల్చడం సరికాదనుకోండి. కానీ ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో జైస్వాల్ అవుటైన తీరును చూస్తే.. అతడికి ఆ బంతిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియక బిక్కముఖం వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇలాంటి పిచ్‌పై ఎలా ఆడాలన్న గేమ్ ప్లాన్ అతడి వద్ద లేనట్లే అనిపించింది. నీ దగ్గర స్పష్టమైన ప్రణాళికలు లేకపోతే ఇలాగే అవుట్ అయిపోతావు. బంతిని అతడు సరిగ్గా అంచనా వేయలేదు. డిఫెండ్ చేసుకుని ఉంటే ప్రమాదం తప్పేది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ఇప్పటికైనా జైస్వాల్ తన టెక్నిక్‌ను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాడు.కాగా ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 108 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేశాడు. చెన్నైకి చెందిన సాయి కూడా యశస్వి జైస్వాల్ మాదిరే లెఫ్టాండ్ బ్యాటర్ అన్న విషయం తెలిసిందే.తొలి రోజు ఇంగ్లండ్‌దే పైచేయిఇదిలా ఉంటే.. ఓవల్ వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో మొదలైన ఐదో టెస్టులో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 64 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) విఫలం కాగా.. సాయి సుదర్శన్ (38) ఫర్వాలేదనిపించాడు.అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (21) లేని పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో అజేయ శతకంతో మెరిసిన రవీంద్ర జడేజా (9) ఈసారి విఫలం కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (19) తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కరుణ్ నాయర్ 52, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇదిలా ఉంటే.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో ఉంది. ఐదో టెస్టులో గెలిస్తేనే గిల్ సేన ఈ సిరీస్‌ను కనీసం సమం చేయగలుగుతుంది. ఇక ఈ సిరీస్‌లో యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు చేసిన పరుగులు వరుసగా.. 101, 4, 87, 28, 13, 0, 58, 0, 2.చదవండి: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు -
జట్టులో లేని ప్లేయర్‌కు ఛాన్సులు.. నా కుమారుడు చేసిన తప్పేంటి?
టీమిండియా అరంగేట్రం కోసం మూడేళ్లుగా ఎదురుచూన్నాడు అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran). దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ బెంగాల్ బ్యాటర్‌కు 2022లోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా నాటి కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) గాయపడటంతో.. అభిమన్యుతో అతడి స్థానాన్ని భర్తీ చేశారు.మరోసారి పాత కథే పునరావృతంఅయితే, ఆ సిరీస్‌లో అభిమన్యుకు ఆడే అవకాశం రాలేదు. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే టీమిండియాకు కూడా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఎంపికయ్యాడు. అప్పుడూ తుదిజట్టులో నో ఛాన్స్. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్ ఆడే జట్టులోనూ స్థానం సంపాదించాడు.కానీ.. మరోసారి పాత కథే పునరావృతం అయింది. అభిమన్యు ఈశ్వరన్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే, ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పునరాగమనం చేసిన కరుణ్ నాయర్‌కు మాత్రం మేనేజ్మెంట్ వరుస అవకాశాలు ఇచ్చింది. ఇంగ్లండ్‌తో తొలి మూడు టెస్టుల్లో విఫలమైనా.. ఐదో టెస్టులో అతడికి మరోసారి ఆడే ఛాన్స్ ఇచ్చింది.జట్టులో లేని ప్లేయర్‌కు ఛాన్సులుఈ నేపథ్యంలో అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘అభిమన్యు టెస్టు అరంగేట్రం కోసం నేను రోజులు కాదు.. సంవత్సరాలు లెక్కబెడుతున్నాను. ఇప్పటికి మూడేళ్ల కాలం గడిచింది.ఓ బ్యాటర్‌గా పరుగులు చేయడం మాత్రమే కదా కావాల్సింది. ఆ పని అభిమన్యు చేస్తూనే ఉన్నాడు. నిజానికి అభిమన్యు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ జట్టుకు ఎంపికైనపుడు కరుణ్ నాయర్ అసలు జట్టులోనే లేడు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టెస్టులకు ఎంపికా?కానీ ఐపీఎల్లో కాస్త మెరుగ్గా ఆడితే టెస్టు టీమ్‌లోకి తీసుకుంటారు. అసలు సంప్రదాయ క్రికెట్ జట్టుకు ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ప్లేయర్లను ఎంపిక చేయడం ఏమిటి? రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో ప్రదర్శన మాత్రమే టెస్టు సెలక్షన్‌కు ప్రామాణికం కదా!ఏడాది కాలంలో నా కుమారుడు 864 పరుగులు సాధించాడు. అయినా తనకు ఆడే అవకాశం రావడం లేదు. నా కుమారుడు డిప్రెషన్లో కూరుకుపోయినట్లు అనిపిస్తోంది’’ అంటూ రంగనాథన్ ఆవేదన వ్యక్తం చేశారు. సెలక్టర్ల తీరు సరికాదంటూ మండిపడ్డారు.నిజానికి అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి టెస్టు జట్టు నుంచి పిలుపు అందుకున్న నాటి నుంచి నేటి వరకు ఏకంగా 15 మంది క్రికెటర్లు అరంగేట్రం చేయడం గమనార్హం. కాగా 29 ఏళ్ల అభిమన్యు ఇప్పటికి 103 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 27 శతకాలు, 31 అర్ధ శతకాల సాయంతో 7841 పరుగులు సాధించాడు.చదవండి: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు -
సరైన బౌలర్లే లేరు.. అందుకే ఇలాంటి పిచ్: గావస్కర్
ఇంగ్లండ్ జట్టుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) విమర్శల వర్షం కురిపించాడు. వికెట్లు తీసే బౌలర్లు జట్టులో లేనందునే.. ఓవల్‌లో ‘గ్రీన్ పిచ్’ తయారు చేయించుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెన్ స్టోక్స్ (Ben Stokes), జోఫ్రా ఆర్చర్ ఐదో టెస్టుకు దూరంగా ఉన్నందున ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శించాడు.ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లింది. ఈ సిరీస్‌లో ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తికాగా.. ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో ఆఖరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే భారత్ సిరీస్‌ను కనీసం సమం చేయగలుగుతుంది.స్టోక్స్, ఆర్చర్ అవుట్అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయపడ్డాడు. భుజం నొప్పి కారణంగా అతడు దూరమయ్యాడు. అతడి స్థానంలో జేమీ ఓవర్టర్ జట్టులోకి రాగా.. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బెతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్‌లు చోటు దక్కించుకున్నారు.వికెట్లు తీసే బౌలర్లు లేరు.. అందుకేఈ నేపథ్యంలో.. ఓవల్ పిచ్ పచ్చికతో నిండిపోయి ఉండటాన్ని ప్రస్తావిస్తూ సునిల్ గావస్కర్ ఇంగ్లండ్ జట్టుపై సెటైర్లు వేశాడు. ‘‘వారి జట్టులో సరైన బౌలర్లే లేరు. అందుకే ఇలాంటి పిచ్ తయారు చేయించారు.స్టోక్స్, ఆర్చర్ గత మ్యాచ్‌లలో వికెట్లు తీసి సత్తా చాటారు. బ్రైడన్ కార్స్ కూడా తన వంతు సహకారం అందించాడు. కానీ ఇప్పుడు వాళ్లంతా లేరు. జట్టులో వికెట్లు తీసే బౌలర్లు లేనపుడు వాళ్లు ఇలాంటి పిచ్కాక మరో పిచ్ ఎలా తయారు చేయగలరు? జోష్ టంగ్.. అతడి సహచరులు ఇలాంటి వికెట్ మీద మాత్రమే రాణించగలరు’’ అంటూ గావస్కర్ విమర్శలు గుప్పించాడు.ఇదిలా ఉంటే.. గురువారం మొదలైన ఓవల్ టెస్టులో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భోజన విరామ సమయానికి 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) విఫలం కాగా.. సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. వర్షం వల్ల ఆటకు పదే పదే అంతరాయం కలుగుతోంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేకబ్ బెతెల్, జామీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్.చదవండి: IND vs ENG: పద్నాలుగుసార్లు ఫెయిల్!.. ఇప్పటికి రిలీఫ్.. స్టోక్స్‌కు సైగ చేసి మరీ.. -
అతడు టీమిండియాకు ఎంపికైన తర్వాత.. 15 మంది అరంగేట్రం!
జాతీయ జట్టు తరఫున ఆడాలని ప్రతి ఒక్క ఆటగాడు కోరుకుంటాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం వస్తే అంతకంటే గొప్పదేమీ లేదంటూ గర్వపడతాడు. అయితే, క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran)కు మాత్రం ఇప్పట్లో ఈ కల నెరవేరేలా కనిపించడం లేదు.961 రోజులుగా నిరీక్షణటీమిండియాకు ఆడాలన్న అభిమన్యు ఆశయానికి వరుసగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికైన నాటి నుంచి ఇప్పటికి 961 రోజులుగా అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అరంగేట్రం చేసేందుకు కళ్లు కాయేలా ఎదురుచూస్తున్నాడు. కానీ మేనేజ్మెంట్ ఇంత వరకు కనికరించనేలేదు.పదిహేను మంది ఆటగాళ్ల అరంగేట్రంతాజాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లోనూ ఒక్క మ్యాచ్‌లో కూడా అభిమన్యును ఆడించలేదు. అయితే, అభిమన్యు టెస్టుల కోసం సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్న తర్వాత.. పదిహేను మంది ఆటగాళ్లు అతడి కంటే ముందే అరంగేట్రం చేయడం గమనార్హం.బంగ్లాదేశ్‌తో 2022 నాటి టెస్టు సిరీస్ సందర్భంగా రోహిత్ శర్మ గాయపడటంతో.. అతడి స్థానంలో అభిమన్యుకు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. కానీ తుదిజట్టులో స్థానం కల్పించలేదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి కూడా ఎంపికైనప్పటికీ ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆడే ఛాన్స్ దక్కలేదు.ఆ లిస్టు ఇదేఅయితే, కేఎస్ భరత్ (2023), సూర్యకుమార్ యాదవ్ (2023), యశస్వి జైస్వాల్ (2023), ఇషాన్ కిషన్ (2023), ముకేశ్ కుమార్ (2023), ప్రసిద్ కృష్ణ (2023), రజత్ పాటిదార్ (2024), సర్ఫరాజ్ ఖాన్ (2024), ధ్రువ్ జురెల్ (2024), ఆకాశ్ దీప్ (2024), దేవ్‌దత్ పడిక్కల్ (2024), నితీశ్ కుమార్ రెడ్డి (2024), హర్షిత్ రాణా (2024), సాయి సుదర్శన్ (2025), అన్షుల్ కంబోజ్ (2025)లు మాత్రం ఇప్పటికే టెస్టుల్లో అరంగేట్రం చేశారు.అందుకే నో ఛాన్స్!వీరిలో యశస్వి జైస్వాల్ టెస్టు జట్టు ఓపెనర్‌గా పాతుకుపోగా.. రోహిత్ శర్మ రిటైరైన తర్వాత అతడి స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేశాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన నాటి నుంచే జైస్వాల్- రాహుల్ ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్నారు. దీంతో ఓపెనింగ్ బ్యాటర్ అయిన అభిమన్యుకు నిరాశ తప్పడం లేదు.కాగా దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటి వరకు 103 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 27 శతకాలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 7841 పరుగులు సాధించాడు. చివరగా ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక టెస్టులో భారత్-ఎ తరఫున బరిలోకి దిగి 11, 80 పరుగులు సాధించాడు.అభిమన్యుతో పాటు వీరిద్దరు కూడాకాగా ఇంగ్లండ్‌తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడుతున్న టీమిండియా 1-2తో వెనుకబడి ఉంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం మొదలైన ఐదో టెస్టులో గెలిస్తేనే సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో అభిమన్యుతో పాటు పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. మరోవైపు.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఇంగ్లండ్ పర్యటనను ముగించనున్నాడు.చదవండి: Jacob Bethell: ఐదో టెస్టులో కొత్త సూపర్‌స్టార్‌ని చూస్తాం: అశ్విన్ -
పద్నాలుగుసార్లు ఫెయిల్!.. ఇప్పటికి రిలీఫ్.. స్టోక్స్‌కు సైగ చేసి మరీ..
టీమిండియాతో ఐదో టెస్టుకు ముందు ఇంగ్లండ్ స్టార్ ఓలీ పోప్ (Ollie Pope)నకు ఓ చెత్త రికార్డు ఉండేది. రెగ్యులర్ కెప్టెన్ గైర్హాజరీలో తాత్కాలిక సారథిగా వ్యవహరించే ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటికి నాలుగుసార్లు టాస్ ఓడిపోయాడు.రెండింటినీ ఒకేసారి అధిగమించేశాడుఅంతేకాదు.. రివ్యూ (Decision Review System) విషయంలోనూ పద్నాలుగుసార్లు పోప్ విఫలమయ్యాడు. అయితే, ఓవల్ టెస్టు సందర్భంగా ఓలీ పోప్ ఈ రెండింటినీ ఒకేసారి అధిగమించేశాడు. బెన్ స్టోక్స్ (Ben Stokes) భుజం నొప్పి కారణంగా టీమిండియాతో ఐదో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఓలీ పోప్ ఐదోసారి ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్‌గా తొలిసారి టాస్ గెలిచిన అతడు.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈసారి ధైర్యంగానే రివ్యూకు ఈ క్రమంలో క్రిస్ వోక్స్ చేతికి కొత్త బంతినివ్వగా.. అతడు ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్ మొదలుపెట్టాడు. అయితే, మ్యాచ్ మొదలైన కాసేపటికే ఆతిథ్య జట్టుకు గస్ అట్కిన్సన్ మంచి బ్రేక్ ఇచ్చాడు. నాలుగో ఓవర్ రెండో బంతికే టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం జైసూను లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా వెనక్కి పంపడానికి నిరాకరించాడు. అట్కిన్సన్ మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించడంతో కెప్టెన్ పోప్ ధైర్యంగానే రివ్యూకు వెళ్లాడు. ఈసారి మాత్రం అతడి అంచనా తప్పలేదు.స్టోక్స్‌కు సైగ చేసి మరీ..రీప్లేలో బంతి జైసూ ప్యాడ్‌ను తాకినట్లు స్పష్టంగా తేలింది. దీంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తారుమారైంది. ఫలితంగా భారత్ తొలి వికెట్ కోల్పోగా.. పోప్ సంబరాల్లో మునిగిపోయాడు. రెండు చేతులు పైకెత్తి సాధించాను అన్నట్లుగా.. డ్రెసింగ్‌రూమ్ నుంచి మ్యాచ్ వీక్షిస్తున్న స్టోక్స్‌కు సైగ చేశాడు. దీంతో స్టోక్స్ సైతం నవ్వులు చిందిస్తూ పోప్‌ను చూసి సంతోషించాడు.పదిహేనోసారి ఖతమే అనుకున్నాఅయితే, థర్డ్ అంపైర్ నిర్ణయానికి ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆథర్టన్ పోప్ పట్ల సానుభూతి వ్యక్తం చేశాడు. ‘‘ఇది ఇన్సైడ్ ఎడ్జ్. రెండు శబ్దాలు వినిపించాయి. కానీ పోప్ మాత్రం రివ్యూకు వెళ్లాడు. ఇప్పటికే అతడు పద్నాలుగుసార్లు డీఆర్ఎస్ విషయంలో ఫెయిలయ్యాడు.నాకెందుకో పదిహేనోసారి కూడా ఇలాగే జరుగుతుందేమో అనిపిస్తోంది’’ అని కామెంట్రీలో చెప్పాడు. అయితే, ఆ తర్వాత అతడు నాలిక్కరుచుకున్నాడు. నిజానికి జైస్వాల్ ఎల్బీడబ్ల్యూ సమయంలో రెండు శబ్దాలు వచ్చాయి. అయితే, బంతి బ్యాట్‌ను మాత్రం తాకలేదు. తొలుత ఫ్రంట్ ప్యాడ్, ఆ తర్వాత బ్యాక్ ప్యాడ్‌ను తాకింది.రెండు వికెట్లు డౌన్రీప్లేలో బంతి స్టంప్‌ను ఎగురగొట్టినట్లు తేలడంతో జైస్వాల్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగక తప్పలేదు. ఇక పదహారో ఓవర్ మొదటి బంతికే టీమిండియా రెండో వికెట్ కూడా కోల్పోయింది. వోక్స్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (14) బౌల్డ్ అయ్యాడు. వర్షం.. లంచ్ బ్రేక్వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో కాస్త ముందుగానే భోజన విరామం వచ్చింది. అప్పటికి 23 ఓవర్ల ఆట పూర్తికాగా సాయి సుద్శన్ 25, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 15 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు: 72/2 (23).చదవండి: అతడి పేరు మర్చిపోయిన గిల్.. వాళ్లిద్దరికి భంగపాటు! ఒక్క మ్యాచ్ ఆడకుండానే..Ollie Pope 🤝 DRS🇮🇳 1️⃣0️⃣-1️⃣ pic.twitter.com/VyX4061MvH— England Cricket (@englandcricket) July 31, 2025 -
అతడి పేరు మర్చిపోయిన గిల్.. కరుణ్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కరుణ్ నాయర్ (Karun Nair)కు టీమిండియా యాజమాన్యం మరో అవకాశం ఇచ్చింది. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు (Ind vs Eng) తుదిజట్టులో ఈ వెటరన్ బ్యాటర్‌కు స్థానం కల్పించింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)- కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఈ దేశవాళీ క్రికెట్ వీరుడుపై మరోసారి నమ్మకం ఉంచడం నిజంగా విశేషమే.ఈ మ్యాచ్‌కు ముందే కరుణ్ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించారు. త్వరలోనే అతడి నుంచి రిటైర్మెంట్ ప్రకటన వస్తుందనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. అయితే, అనూహ్యంగా మేనేజ్మెంట్ అతడికి మరోసారి పిలుపునివ్వడం పట్ల అభిమానులు సంతోషంగా ఉన్నారు.ఇదే ఆఖరి అవకాశంఅయితే, అదే సమయంలో కరుణ్ నాయర్‌కు లభించిన చివరి అవకాశం ఇదేనని.. ఇక్కడా విఫలమైతే కెరీర్ ముగిసినట్లేననే కామెంట్లు చేస్తున్నారు. కాగా రంజీల్లో విదర్భ తరఫున సత్తా చాటిన కరుణ్‌కు.. ఎనిమిదేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసే అవకాశం లభించింది.ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్ సందర్భంగా సెలక్టర్లు కరుణ్ నాయర్‌కు పిలుపునిచ్చారు. ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్-ఎ తరఫున డబుల్ సెంచరీతో సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఆడే అవకాశం ఇచ్చారు.చేసింది 131 పరుగులేఅయితే, కరుణ్ రీఎంట్రీలో డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. ఆ తర్వాత కూడా అతడు స్థాయికి తగ్గట్లు రాణించలేదు. రెండో టెస్టు నుంచి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్ నాయర్.. ఇప్పటి వరకు చేసిన పరుగులు వరుసగా.. 0, 20, 31, 26, 40, 14.ఇలా మూడు టెస్టుల్లో ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 33 ఏళ్ల కరుణ్ నాయర్.. 131 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయినా.. సరే ఆఖరి టెస్టులో అతడు మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రాగలిగాడు. కరుణ్‌ను చేర్చడం సహా ఐదో టెస్టులో టీమిండియా యాజమాన్యం తుదిజట్టులో నాలుగు మార్పులు చేసింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. గాయం వల్ల రిషభ్ పంత్ దూరమయ్యాడు. మరోవైపు.. శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్‌లపై మేనేజ్మెంట్ వేటు వేసింది. వీరి స్థానాల్లో ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ తుదిజట్టులోకి వచ్చారు.ఒక్కమ్యాచ్ ఆడకుండానే కుల్దీప్, అర్ష్‌దీప్ ఇంటికిఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మరోసారి మొండిచేయే ఎదురైంది. ఈ సిరీస్‌కు అతడిని ఎంపిక చేసినా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు యాజమాన్యం. దీంతో ఒక్క టెస్టు ఆడకుండానే కుల్దీప్ ఇంగ్లండ్ పర్యటన ముగిసినట్లయింది.మరోవైపు.. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ది కూడా ఇదే కథ. టీ20, వన్డే ఫార్మాట్లలో టీమిండియా తరఫున సత్తా చాటుతున్న ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్‌కు ఇంతవరకు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కనే లేదు. ఇంగ్లండ్ పర్యటనలోనైనా ఆ కల నెరవేరుతుందనుకుంటే.. భంగపాటే ఎదురైంది.ఆకాశ్ దీప్ పేరు మర్చిపోయిన గిల్కాగా లండన్‌లోని ఓవల్ మైదానంలో ఐదో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, టీమిండియా కెప్టెన్ తమ తుదిజట్టు ప్రకటన సమయంలో ఆకాశ్ దీప్ పేరు మర్చిపోయాడు. శార్దూల్, పంత్, బుమ్రా స్థానాల్లో ప్రసిద్, జురెల్, కరుణ్ వస్తున్నారని మాత్రమే చెప్పాడు.చదవండి: ENG VS IND 5th Test: తుదిజట్లు ఇవే -
టీమిండియా గెలుపు.. నాగిని డ్యాన్స్‌తో ఖుషీ చేసుకున్న మాజీ క్రికెటర్
న్యూఢిల్లీ: ఓవల్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో ఆటగాళ్లు, అభిమానులే కాక మాజీ క్రికెటర్లు సైతం సంబురాల్లో మునిగితేలుతున్నారు. 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం సాధించిన విజయం కావడంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు డ్యాన్స్‌లు, కేకలు, ఈలలతో డ్రెసింగ్ రూమ్‌ను హోరెత్తించగా.. భారత అభిమానులు అక్కడా, ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. भाई लोग आप की फरमाइश पे | Anything for an India victory, no matter how awkward :) pic.twitter.com/aSgGA1pUQE — Mohammad Kaif (@MohammadKaif) September 7, 2021 ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. నాగిని డ్యాన్స్ వేస్తూ టీమిండియా గెలుపును మనస్పూర్తిగా ఆస్వాధించాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. "టీమిండియా గెలిచిందిగా.. సంబురాలు మామూలుగా ఉండవు.. నచ్చిన విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం.. అది ఎంత వికారంగా ఉన్నా పర్వాలేదు" అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియలో వైరలవుతోంది. ఎప్పుడూ కామ్‌గా కనిపించే కైఫ్.. ఇలా నాగిని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. కైఫ్.. టీమిండియా విజయాన్ని వంద శాతం ఆస్వాధిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండయా157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్‌లో 368 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకపడింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సూపర్ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్ మ్యాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చదవండి: ఆ జెర్సీ ధరించినప్పుడు, నీ ముఖానికి అంత సీన్ లేదన్నారు: శార్దూల్ ఠాకూర్ -
ఆ జెర్సీ ధరించినప్పుడు, నీ ముఖానికి అంత సీన్ లేదన్నారు: శార్దూల్ ఠాకూర్
లండన్: ఓవల్ టెస్ట్ విజయం అనంతరం టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. ఈ మ్యాచ్‌లో శార్దూల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగల్లో సత్తా చాటి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పేలవ బ్యాటింగ్ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో పేక మేడలా కుప్పకూలుతున్న జట్టును శార్దూల్ తన మెరుపు అర్ధశతకంతో ఆదుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ను చేయగలిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్‌తో కలిసి అతను నెలకొల్పిన శతక భాగస్వామ్యం జట్టు విజయానికి బాటలు వేసింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో పాతుకుపోయిన రోరీ బర్న్స్‌ను ఔట్ చేసి తొలి వికెట్ కోసం సుదీర్ఘంగా సాగుతున్న నిరీక్షణకు తెరదించిన శార్దూల్.. అత్యంత కీలకమైన జో రూట్ వికెట్‌ను కూడా పడగొట్టి టీమిండియా విజయాన్ని ఖాయం చేశాడు. ఇదిలా ఉంటే, ఓవల్ టెస్ట్ తర్వాత రాత్రికిరాత్రే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నశార్డూల్ ఠాకూర్ కూడా చాలామంది స్టార్ క్రికెటర్లలాగే ఎన్నో కష్టాలు దాటి ఈ స్థాయికి చేరాడు. కెరీర్ ప్రారంభంలో గాయాలతో సతమతమయ్యి, భారీగా బరువు పెరిగిన ఇతను.. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. తన బర్త్ డే నెల కలిసొచ్చేలా మొదట్లో జెర్సీ నెంబర్ 10తో బరిలోకి దిగిన శార్దూల్.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ‘నీ ముఖానికి అంత సీన్ లేదంటూ' ఘాటు విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, స్వతాహాగా సచిన్ అభిమాని అయిన శార్దూల్.. వెంటనే తన తప్పిదాన్ని గుర్తించి తన జెర్సీ నెంబర్‌ను 54గా మార్చుకున్నాడు. కాగా, ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో అద్భుత ప్రదర్శన అనంతరం శార్దూల్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏ అభిమానుల చేత ట్రోలింగ్‌కు గురయ్యాడో వారి చేతనే ప్రస్తుతం శభాష్ అనిపించుకున్నాడు. అతని ఆరాధ్య దైవమైన సచిన్ కూడా అతన్ని ప్రశంసించడంతో శార్దూల్ ఆనందానికి అవధుల్లేవు. చదవండి: ఐదో టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. బట్లర్, లీచ్ రీ ఎంట్రీ -
టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్ మాజీ సారధి..
లండన్: టీమిండియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి క్రికెట్ అభిమానులచే చివాట్లు తింటున్నా తీరు మార్చుకోని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖత మైఖేల్ వాన్.. తాజాగా మరోసారి కోహ్లి సేనపై తన అక్కసును వెల్లగక్కాడు. ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 157 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్లంతా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సచిన్, ఏబీ డివిలియర్స్, సెహ్వాగ్, షేన్ వార్న్, గంగూలీ ఇలా చాలా మంది లెజెండరీ క్రికెటర్లు కోహ్లి సేనను ఆకాశానికెత్తుతున్నారు. అయితే ఇది మింగుడు పడని మైఖేల్ వాన్.. గంగూలీ చేసిన ఓ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ, టీమిండియాను పరోక్షంగా ఎగతాళి చేశాడు. In Test cricket .. not White ball cricket 👍 https://t.co/t5M3HQTB1c — Michael Vaughan (@MichaelVaughan) September 6, 2021 వివరాల్లోకి వెళితే.. 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఓవల్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసిన అనంతరం టీమిండియాను అభినందిస్తూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశాడు. భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారని, ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య నైపుణ్యంలో తేడా ఉందని, అతిపెద్ద వ్యత్యాసం ఒత్తిడిని అధిగమించడంలో ఉందని, ఈ విషయంలో భారత క్రికెటర్లు ఇతరులతో పోలిస్తే ఎన్నో రేట్లు మేలని ట్వీటాడు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన ఇంగ్లండ్ మాజీ సారధి తనకు మాత్రమే సొంతమైన వెటకారాన్ని ప్రదర్శిస్తూ టీమిండియాను కవ్విస్తున్నట్లు బదులిచ్చాడు. గంగూలీ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. 'టెస్ట్‌ల్లో మాత్రమే, వైట్ బాల్ క్రికెట్లో కాదు' అంటూ వ్యంగ్యంగా రీట్వీట్ చేశాడు. దీంతో అతనిపై టీమిండియా అభిమానులు ముప్పేట దాడి మొదలుపెట్టారు. సోషల్‌మీడియా వేదికగా ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కాగా, ఇంగ్లండ్ పర్యటన మొదలైనప్పటి నుంచి వాన్.. టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నాడు. కోహ్లి సేన స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక కుప్పకూలుతుందంటూ ఎత్తి పొడుస్తూనే ఉన్నాడు. అయితే వాన్ ఇలాంటి కామెంట్లు చేసిన ప్రతిసారి టీమిండియా రెట్టింపు కసితో ఆడి విజయాలు సాధిస్తూ వస్తుంది. చదవండి: భూగ్రహం మొత్తంలో టీమిండియా కెప్టెన్‌కు మించినోడే లేడు: షేన్ వార్న్ -
భూగ్రహం మొత్తంలో కోహ్లిని మించినోడే లేడు: షేన్ వార్న్
లండన్: ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టుపై ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా చేరాడు. తొలుత ట్విటర్ వేదికగా టీమిండియాపై ప్రశంసలు కురిపించిన వార్న్.. ఆతర్వాత మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఆకాశానికెత్తాడు. Congratulations .@imVkohli & the entire Indian team on another terrific win. What you guys have all achieved together over the last 12 months is absolutely magnificent ! Clearly the best test team in the world & that title is thoroughly deserved too ! Long live test cricket ❤️❤️ — Shane Warne (@ShaneWarne) September 6, 2021 'మరో అద్భుతమైన విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. గత ఏడాది కాలంగా మీరు జట్టుగా సాధించిన విజయాలు న భూతో న భవిష్యత్. ప్రపంచంలోనే టీమిండియా అత్యుత్తమ టెస్టు జట్టు. ఇందుకు మీరు మాత్రమే నిజమైన అర్హులు. లాంగ్ లివ్ టెస్ట్ క్రికెట్' అంటూ వార్న్ ట్వీట్ చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓవల్ టెస్ట్‌లో కోహ్లి భారత జట్టును ముందుండి నడిపించిన తీరు అత్యద్భుతమని కొనియాడాడు. కోహ్లి.. టెస్ట్ క్రికెట్‌కు ఇస్తున్న ప్రాధాన్యత వల్ల సాంప్రదాయ ఫార్మాట్ స్థాయి పెరిగిందని, అతని సారధ్యంలో టీమిండియా ప్రపంచ క్రికెట్లో పవర్ హౌస్‌గా మారిందని ప్రశంసించాడు. టెస్ట్ క్రికెట్ పట్ల టీమిండియా కెప్టెన్‌కున్న ప్యాషన్ అతన్ని భూగ్రహంలోనే అత్యుత్తమ ఆటగాడిగా మార్చిందని ఆకాశానికెత్తాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో 368 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 157 పరుగుల తేడాతో ఓటమిపాలై 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకపడింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సూపర్ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్ మ్యాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చదవండి: అశ్విన్ విషయంలో టీమిండియా కెప్టెన్ నిర్ణయం సరైందే: ఏబీ డివిలియర్స్ -
అశ్విన్ విషయంలో టీమిండియా కెప్టెన్ నిర్ణయం సరైందే: ఏబీ డివిలియర్స్
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ సహచర క్రికెటర్, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అండగా నిలిచాడు. తుది జట్టు ఎంపిక విషయంలో కోహ్లి సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు. తుది జట్టులో యాష్‌కు స్థానం కల్పించకపోవడంపై జరుగుతున్న అనవసర రాద్దాంతం నేపథ్యంలో మిస్టర్ 360 ఆటగాడు ఈమేరకు స్పందించాడు. ఈ విషయమై టీమిండియా అభిమానులు ఆందోళన చెందకుండా, కోహ్లి సేన సాధించిన విజయాలను ఆస్వాదించాలని సూచించాడు. కెప్టెన్సీ విషయంలో కోహ్లి సూపర్ అని ఆకాశానికెత్తాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కలేదు. నాలుగు టెస్ట్‌ల్లో యాష్‌కు నిరాశే ఎదురైంది. As “spectators” of Test Cricket, just stop worrying about team selection and other nonsense and start appreciating the competition, passion, skill and patriotism unfolding in front of your eyes. You’re missing a good game!— AB de Villiers (@ABdeVilliers17) September 6, 2021 ఓవల్ మైదానంలో అశ్విన్‌కు మంచి రికార్డు ఉండటంతో నాలుగో టెస్ట్‌లో అతనికి చోటు ఖాయమేనని అంతా భావించారు. అయితే, టీమిండియా కెప్టెన్ విరాట్ మాత్రం అశ్విన్‌ను కాదని జడేజావైపే మొగ్గుచూపాడు. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ విధానాన్నే అనుసరించాడు. ఏకైక స్పిన్నర్ కోటాలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన జడేజాకు తిరిగి అవకాశమిచ్చాడు. దీనిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శలు గుప్పించారు. కోహ్లీ ఘోర తప్పిదం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రోజు మ్యాచ్ భారత్‌వైపు మళ్లే వరకు విమర్శలు కొనసాగించారు. అశ్విన్ ఉంటే భారత్ విజయం సులువయ్యేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 77/0తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సూపర్ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్ మ్యాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చదవండి: టీమిండియా డాషింగ్ క్రికెటర్ నోట పవర్ స్టార్ పాపులర్ డైలగ్.. -
మ్యాచ్ గెలిపించినా అక్షింతలు తప్పలేదు.. టీమిండియా కెప్టెన్‌పై బీసీసీఐ ఆగ్రహం
లండన్: 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఓవల్ మైదానంలో అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ జట్టు సారధి విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌కు ముందు వీరు బయో బబుల్ నిబంధనలను ఉల్లఘించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లితో పాటు మరికొందరు టీమిండియా సభ్యులు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజులకే తొలుత రవిశాస్త్రి, ఆతర్వాత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లు కరోనా బారిన పడినట్లు నిర్దారణ అయ్యింది. ఈ ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలినా కోహ్లి సహా ఇతర ఆటగాళ్లకు మాత్రం నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే ఈ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లడానికి(బయో బబుల్ నిబంధనలకు విరుద్ధంగా) భారత బృందం.. బీసీసీఐ అనుమతి కోరలేదని తెలిసింది. దీంతో ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్న బోర్డు.. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లిలపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వీరి వివరణ కోరిన బీసీసీఐ.. కోహ్లిని సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ కరోనా బారిన పడిన తర్వాత బోర్డు సెక్రటరీ జై షా ఆటగాళ్లను అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినప్పటికీ భారత బృందం బయో నిబంధనలు ఉల్లంఘించి అజాగ్రత్తగా వ్యవహరించడంతో బీసీసీఐ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, 50 ఏళ్ల తర్వాత ఓవల్‌లో భారత్‌కు టెస్టు విజయం దక్కింది. ఆఖరి రోజు అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఆతిధ్య జట్టుపై 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 77/0తో అయిదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 210 పరుగులకే ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. రెండో ఇన్నింగ్స్‌లో సూపర్ శతకంతో రాణించిన రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. చదవండి: థాంక్యూ బుమ్రా.. బెయిర్‌స్టోను డకౌట్ చేశావ్: జార్వో సంబరం -
ఇదీ ఇంగ్లండ్ ఆటగాళ్ల పరిస్థితి.. అంతేగా.. అంతేగా!
లండన్: ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించిన టీమిండియా పై ట్విటర్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు మాజీ ఆటగాళ్లు, ప్రముఖులు, కోహ్లి సేనను అభినందిస్తున్నారు. అభిమానులు చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత మాజీ ఆటగాడు వెంకటేశ్ ప్రసాద్.. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లును కొనియాడతూ ట్వీట్ చేశారు. మరో భారత మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ .. భారత్‌కు ఈ విజయం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశాడు. This is a very special Test Match win. After being 127/7 on the first day, not many teams can make a comeback and win a away test the way Team India have done. That is why this is a very special Indian Team. Congratulations to everyone for playing their part in a memorable win. pic.twitter.com/9XDJCCrAwC— VVS Laxman (@VVSLaxman281) September 6, 2021 భయం లేదు.. బెరుకు లేదు.. కలిసికట్టుగా ఏదైనా సాధిస్తుంది.. అదే టీమిండియా అని స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ట్వీట్ చేశాడు. Individual commitments to a group effort. That’s the definition of this Team. This is Team India. Absolute Fearless. 🇮🇳💪 pic.twitter.com/9iRxyAvAfF— Yuzvendra Chahal (@yuzi_chahal) September 6, 2021 ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ మరోసారి తనదైన శైలిలో ట్వీటాడు. నాలుగు టెస్టుల్లో ఇంగ్లండ్ ఆటగాళ్ల పరిస్థితి ఇదీ అన్నట్లుగా.. ఓ మీమ్‌ను పంచుకున్నాడు. The Angrez this series😁 #ENGvIND pic.twitter.com/xFRejslJlw — Wasim Jaffer (@WasimJaffer14) September 6, 2021 What an incredible comeback by India after the first day. Shardul Thakur and Rohit Sharma were the standout performers and the bowlers were terrific especially in the second innings. A win to remember #ENGvIND pic.twitter.com/gOcUJa6fT8 — Venkatesh Prasad (@venkateshprasad) September 6, 2021 -
రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. ఐదో రోజు హైలైట్స్ ఇవే
లండన్: ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై 157 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం 368 పరుగుల ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ టీమ్ 210 పరుగులకే కూప్ప కూలింది. భారత జట్టు విజయంలో ఓపెనర్ రోహిత్ శర్మ, బౌలర్లు ఉమేశ్ యాదవ్, బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తో ఆధిక్యం సాధించింది. 127 పరుగుల సాధించి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: సిరీస్ వేటలో విజయబావుటా -
టీమిండియా ఘన విజయం
-
కపిల్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా పేసు గుర్రం..
ఓవల్: ఇంగ్లండ్‌తో రసవత్తరంగా సాగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్‌ను సాధించాడు. టెస్ట్‌ల్లో వేగంగా 100 వికెట్లు సాధించిన భారత పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఓలీ పోప్ వికెట్ పడగొట్టడంతో బుమ్రా వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్ల క్లబ్లో చేరాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ పేరిట నమోదై ఉంది. కపిల్.. ఈ మైలురాయిని 25 మ్యాచ్‌ల్లో చేరుకోగా, బుమ్రా తన 24వ టెస్ట్‌లోనే ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా.. జడేజాతో కలిసి సంయుక్తంగా ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ కేవలం 18 టెస్ట్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇక క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ల్యాండ్ మార్క్‌ను చేరుకున్న బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్ లోమాన్(16) తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా చార్లీ టర్నర్(17), ఇంగ్లండ్ సిడ్నీ బార్న్స్(17), ఆస్ట్రేలియా చార్లీ గ్రిమ్మెట్(17), పాక్ యాసిర్ షా(17)లు సంయుక్తంగా రెండో ప్లేస్‌లో నిలిచారు. వీరి తర్వాత అశ్విన్(18) మూడో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్ ఆఖరి రోజు 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్ల ధాటికి 177 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. భారత బౌలర్లు బుమ్రా(2), జడేజా(2), శార్దూల్(1) ఇంగ్లండ్ విజయావకాశాలపై నీళ్లు చల్లారు. క్రీజ్‌లో రూట్(32), వోక్స్(12) ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 191 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. చదవండి: పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఇద్దరు దిగ్గజాల రాజీనామా -
50 ఏళ్ల నిరీక్షణకు తెర.. టీమిండియా ఘన విజయం
50 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఓవల్ టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం 368 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా జట్టుగా రాణించి ఓవల్ గడ్డపై 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. మళ్లీ ఇనేళ్లకు కోహ్లి నేతృత్వంలో భారత్ 157 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఉమేశ్ బౌలింగ్‌లో ఆండర్సన్(2) ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు 210 పరుగుల వద్ద తెరపడింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీయగా బుమ్రా, శార్దూల్, జడేజా తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించారు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చారిత్రక గెలుపుకు ఒకే ఒక్క వికెట్ దూరంలో.. 50 ఏళ్ల నిరీక్షణకు మరో కొద్ది నిమిషాల్లో తెరపడనుంది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో గెలుపుకు టీమిండియా ఒకే ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఓవర్టన్(10) క్లీన్ బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ 202 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో రాబిన్సన్(4), ఆండర్సన్ ఉన్నారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. విజయానికి 2 వికెట్ల దూరంలో భారత్ నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓటమి దాదాపుగా ఖరారైంది. 193 పరుగుల వద్ద ఆ జట్టు కీలకమైన క్రిస్ వోక్స్(18) వికెట్‌ను కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో వోక్స్ ఎనిమిదవ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా చారిత్రక గెలుపుకు మరో రెండు వికెట్ల దూరంలో ఉంది. క్రీజ్‌లో ఓవర్టన్(5) ఉన్నాడు. అంపైర్లు టీ విరామం ప్రకటించారు. రూట్(36) క్లీన్ బౌల్డ్.. గెలుపుకు మరో 3 వికెట్ల దూరంలో టీమిండియా ఇంగ్లండ్ ఆఖరి ఆశాకిరణం రూట్(36) ఎట్టకేలకు పెవిలియన్‌కు చేరాడు. జట్టు స్కోర్ 182 పరుగుల వద్ద శార్దూల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ మ్యాచ్‌పై ఆశలు దాదాపుగా వదులుకుంది. వోక్స్(12)కు జతగా ఓవర్టన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 186 పరుగులు సాధించాల్సి ఉండగా, చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మొయిన్ అలీ డకౌట్ టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ జట్టు పేకమేడలా కూలుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు వరుస పెట్టి పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. జట్టు స్కోర్ 147 పరుగుల వద్ద ఉండగా మొయిన్ అలీ డకౌట్‌గా వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్‌లో సబ్ ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. జో రూట్(18)కు జతగా క్రిస్ వోక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 221 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో మరో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. బుమ్రా ఉగ్రరూపం.. బెయిర్‌స్టో(0) క్లీన్ బౌల్డ్ టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఉగ్రరూపం దాల్చాడు. 5 బంతుల వ్యవధిలో ఇద్దరు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లను పెవిలియన్‌కు పంపి ఆతిధ్య జట్టు నడ్డి విరిచాడు. 146 పరుగుల వద్ద తొలుత ఓలీ పోప్(2)ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా అదే స్కోర్ వద్ద బెయిర్‌స్టోను సైతం బౌల్డ్ చేసి ఇంగ్లండ్ ఓటమికి పునాది వేశాడు. బుమ్రా ధాటికి ఇంగ్లండ్ 146 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. జో రూట్(17)కు జతగా మొయిన్ అలీ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 222 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో మరో ఐదు వికెట్లు ఉన్నాయి. నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బుమ్రా బౌలింగ్‌లో ఓలీ పోప్(2) క్లీన్ బౌల్డ్ 5 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోయింది. 141 పరుగుల వద్ద హమీద్ వికెట్ కోల్పోయిన ఆతిధ్య జట్టు 146 పరుగుల స్కోర్ వద్ద ఓలీ పోప్(2) వికెట్‌ను కూడా చేజార్చుకుంది. జో రూట్(17)కు జతగా జానీ బెయిర్‌స్టో క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 222 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో మరో ఆరు వికెట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్.. హమీద్(63) క్లీన్ బౌల్డ్ లంచ్ తర్వాత మూడో ఓవర్లోనే ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. నిలకడగా ఆడుతున్న హసీబ్ హమీద్(63; 6 ఫోర్లు)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా ఆతిధ్య జట్టు మూడో వికెట్ కోల్పోయింది. జో రూట్(14)కు జతగా ఓలీ పోప్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 227 పరుగులు సాధించాల్సి ఉంది. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మలాన్(5) రనౌట్ జట్టు స్కోర్ 120 పరుగుల వద్ద నుండగా ఇంగ్లండ్‌కు మరో దెబ్బ తగిలింది. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్(5) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మయాంక్ అగర్వాల్ అద్భుతమై త్రోతో మలాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. హసీబ్ హమీద్(60)కు తోడుగా కెప్టెన్ రూట్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 248 పరుగులు సాధించాల్సి ఉంది. వేట మొదలైంది.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 291 పరుగుల లక్ష్యంతో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌కు తొలి సెషన్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోరీ బర్న్స్(50; 5 ఫోర్లు) అర్ధశతకం పూర్తయిన వెంటనే పెవిలియన్‌కు చేరాడు. శార్దూల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్ క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ 100 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ హమీద్(47) నిలకడగా అడుతుండగా, మలాన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 268 పరుగులు సాధించాల్సి ఉంది. ఓవల్ టెస్టు రసకందాయంలో పడింది. భారత్, ఇంగ్లండ్ జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే మన బౌలర్లు చివరి రోజు పది వికెట్లు తీయాల్సిందే. ఇంగ్లండ్ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. టెస్టులో చివరి రోజు 250కు పైగా పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్ట సాధ్యమే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ఎన్ని మలుపులు తిరుగుతుందో, విజయం ఎవరివైపు మొగ్గుతుందో ఆసక్తికరంగా మారింది. కాగా, 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చదవండి: 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా.. లేక మళ్లీ ఘోర పరాభవం తప్పదా..? -
Ind Vs Eng: విజయానికి 291 పరుగుల దూరం.. పది పడాలి!
ఓవల్ టెస్టు రసకందాయంలో పడింది. భారత్, ఇంగ్లండ్ జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే మన బౌలర్లు చివరి రోజు పది వికెట్లు తీయాల్సిందే. ఇంగ్లండ్ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. టెస్టులో చివరి రోజు 250కు పైగా పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్ట సాధ్యమే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ఎన్ని మలుపులు తిరుగుతుందో, విజయం ఎవరివైపు మొగ్గుతుందో ఆసక్తికరంగా మారింది. లండన్: తమ ఖాతాలో మరో విజయం వేసుకొని ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలంటే భారత బౌలర్లు నాలుగో టెస్టులో చివరి రోజు సత్తా చాటుకోవాలి. ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్‌కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడగా... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 50; 4 ఫోర్లు) రాణించాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు. శార్దుల్ మళ్లీ మెరిశాడు 270/3తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ను ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ దెబ్బతీశాడు. ఓవర్‌నైట్ స్కోరుకు 26 పరుగులు జతయ్యాక... జడేజా (17; 3 ఫోర్లు), రహానే (0)లను తన వరుస ఓవర్లలో వోక్స్ అవుట్ చేశాడు. కాసేపటికే కెప్టెన్ కోహ్లి (44; 7 ఫోర్లు) మొయిన్ అలీ బౌలింగ్‌లో ఒవర్టన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి భారత స్కోరు 312/6 కాగా... ఆధిక్యం 213 పరుగులు. ఈ దశలో క్రీజులోకి వచ్చి న యువ ప్లేయర్లు రిషభ్ పంత్, శార్దుల్ ఠాకూర్ భారత్‌ను సురక్షిత స్థితిలో ఉంచే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ మొదట ఆచితూచిగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. లంచ్ విరామానికి భారత్ స్కోరు 329/6గా ఉంది. లంచ్ తర్వాత శార్దుల్ తన బ్యాట్‌కు పని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆడినంత ధాటిగా కాకపోయినా... ఇక్కడ కూడా స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అతడికి పంత్ కూడా తోడవ్వడంతో భారత్ ఆధిక్యం 300 పరుగులు చేరుకుంది. ఈ క్రమంలో శార్దుల్ 65 బంతుల్లో మ్యాచ్‌లో రెండో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. çఎనిమిదో బ్యాట్స్‌మన్‌గా వచ్చి ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50కిపైగా పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా శార్దుల్ ఘనతకెక్కాడు. అనంతరం పంత్ కూడా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. చివర్లో ఉమేశ్ యాదవ్ (25; 1 ఫోర్, 2 సిక్స్‌లు), బుమ్రా (24; 4 ఫోర్లు) నిలబడటంతో ఇంగ్లండ్ ముందు టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) వోక్స్ (బి) రాబిన్సన్ 127; రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 46; పుజారా (సి) అలీ (బి) రాబిన్సన్ 61; కోహ్లి (సి) ఒవర్టన్ (బి) అలీ 44; జడేజా (ఎల్బీ) (బి) వోక్స్ 17; రహానే (ఎల్బీ) (బి) వోక్స్ 0; పంత్ (సి అండ్ బి) అలీ 50; శార్దుల్ ఠాకూర్ (సి) ఒవర్టన్ (బి) రూట్ 60; ఉమేశ్ యాదవ్ (సి) అలీ (బి) ఒవర్టన్ 25; బుమ్రా (సి) అలీ (బి) వోక్స్ 24; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (148.2 ఓవర్లలో ఆలౌట్) 466. వికెట్ల పతనం: 1–83, 2–236, 3–237, 4–296, 5–296, 6–312, 7–412, 8–414, 9–450, 10–466. బౌలింగ్: అండర్సన్ 33–10–79–1, రాబిన్సన్ 32–7–105–2, వోక్స్ 32–8–83–3, ఒవర్టన్ 18.2–3–58–1, మొయిన్ అలీ 26–0–118–2, రూట్ 7–1–16–1. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (బ్యాటింగ్) 31; హమీద్ (బ్యాటింగ్) 43; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 77. బౌలింగ్: ఉమేశ్ 6–2–13–0, బుమ్రా 7–3–11–0, జడేజా 13–4–28–0, సిరాజ్ 6–0–24–0. -
కేఎల్ రాహుల్‌కు జరిమానా..
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు మ్యాచ్ రిఫరి క్రిస్ బ్రాడ్ జరిమానా విధించారు. రాహుల్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెడుతున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. మూడో రోజు ఆట తొలి సెషన్ 34వ ఓవర్లో ఆండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో క్యాచ్‌కు అపీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రివ్యూకి వెళ్లాడు. అందులో బంతి బ్యాట్ ఎడ్జ్‌కి తగిలినట్లు తేలడంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని రాహుల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీనిపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అతనిపై ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8(అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం) ఉల్లంఘన నేరం కింద జరిమానా విధించారు. దీంతోపాటు రాహుల్ క్రమశిక్షణ రికార్డ్‌లో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు. చదవండి: టీమిండియాకు బిగ్ షాక్.. కీలక సభ్యుడికి కరోనా -
టీమిండియాకు బిగ్ షాక్.. కీలక సభ్యుడికి కరోనా
ఓవల్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాకు షాకింగ్ వార్త తెలిసింది. జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించారు. బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి తదుపరి సమాచారం అందేవరకు వీరంతా వేర్వేరుగా ఐసోలేషన్‌లో ఉంటారని జై షా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ వార్త తెలిసి టీమిండియా సభ్యులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధిస్తున్న తరుణంలో ఈ వార్త టీమిండియాపై ఏమేరకు ప్రభావం చూపుతోందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ టెస్ట్‌లో ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మరో ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లి(22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు)ఉన్నారు. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్ 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్) శతకంతో కదంతొక్కితే పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చదవండి: వైరలవుతున్న రోహిత్ ఐదేళ్ల కిందటి ట్వీట్.. ‘చెప్పాడంటే చేస్తాడంతే’ -
వైరలవుతున్న రోహిత్ ఐదేళ్ల కిందటి ట్వీట్.. ‘చెప్పాడంటే చేస్తాడంతే’
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్) అద్భుత శతకంతో జట్టును పటిష్ట స్థితికి చేర్చిన సంగతి తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 94 పరుగుల వద్ద మొయిన్ అలీ వేసిన 64 ఓవర్ ఐదో బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాది కెరీర్లో తొలి ఓవర్సీస్ టెస్ట్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా రోహిత్‌కిది ఎనిమిదవ టెస్ట్ సెంచరీ. The greatest pleasure in life is doing what people say you cannot do 😊😊 — Rohit Sharma (@ImRo45) September 14, 2016 ఇదిలా ఉంటే, రోహిత్ శర్మ ఎప్పుడో 2016లో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. దీన్ని ట్రోల్ చేస్తున్న అతని అభిమానులు రోహిత్ చెప్పాడంటే చేస్తాడంతే అంటూ కామెంట్ల రూపంలో హంగామా చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. మనం ఏదైతే చేయలేమని జనం అనుకుంటారో.. దానిని చేసి చూపించడం కంటే ఆనందం మరొకటి ఉండదని రోహిత్ 2016, సెప్టెంబర్ 14న ట్వీట్ చేశాడు. చదవండి: అచ్చం సెహ్వాగ్‌లాగే.. సచిన్ ఒక్కడే అత్యధికంగా ఇలా..! ఆ ట్వీట్‌ను ఇప్పుడు రోహిత్ అభిమానులు వైరల్‌గా మార్చేశారు. ఎందుకంటే.. టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టి 8 ఏళ్లు అవుతున్నా, విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడన్న అపవాదు రోహిత్‌పై ఉంది. మొత్తానికి ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ ఆ అపవాదును చెరిపేసుకున్నాడు. కీలకమైన సమయంలో సెంచరీ చేసి తన సత్తా ఏంటో చాటడంతోపాటు జట్టును కూడా ఆదుకుని, తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లి(22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు)ఉన్నారు. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్ 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. చదవండి: డుప్లెసిస్ ఊచకోత.. 51 బంతుల్లోనే శతక్కొట్టుడు.. -
అచ్చం సెహ్వాగ్‌లాగే.. సచిన్ ఒక్కడే అత్యధికంగా ఇలా..!
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ శర్మ(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్) అద్భుతమైన సెంచరీతో టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శైలిలో సిక్సర్‌తో శతకాన్ని పూర్తి చేశాడు. మొయిన్ అలీ వేసిన 64 ఓవర్ ఐదో బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాదిన హిట్ మ్యాన్.. కెరీర్లో తొలి ఓవర్సీస్ టెస్ట్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా రోహిత్‌కిది ఎనిమిదవ టెస్ట్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ టెస్ట్‌ల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లి 73 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే.. రోహిత్ 74 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. కాగా, సెహ్వాగ్ 2004లో పాక్‌తో జరిగిన ముల్తాన్ టెస్ట్‌లో ట్రిపుల్ హండ్రెండ్(309) సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వీరూ డబుల్ హండ్రెడ్ను, ట్రిపుల్ సెంచరీని సిక్సర్‌తోనే కంప్లీట్ చేశాడు. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ అత్యధికంగా 6 సార్లు సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకోగా, రోహిత్ 3 పర్యాయాలు, గౌతమ్ గంభీర్(2), రిషబ్ పంత్(2) ఇదే తరహాలో సెంచరీని కంప్లీట్ చేశాడు. ఈ జాబితాలో టీమిండియా స్పిన్నర్లు హర్భజన్, అశ్విన్‌లు అలాగే ద వాల్ రాహుల్ ద్రవిడ్, నయా వాల్ పుజారాలు కూడా ఉండడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో శతకంతో కదంతొక్కితే పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. వెరసి శనివారం జరిగిన మూడు సెషన్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా... వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. కెప్టెన్ కోహ్లి (22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చదవండి: ఇంగ్లండ్ జట్టును వేధిస్తున్న ప్రాంక్ స్టార్ జార్వో అరెస్ట్.. -
ఇంగ్లండ్ జట్టును వేధిస్తున్న ప్రాంక్ స్టార్ జార్వో అరెస్ట్..
లండన్: భద్రతా నియమావళిని ఉల్లంఘిస్తూ.. టీమిండియా జర్సీ ధరించి.. మ్యాచ్ మధ్యలో మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ ఆటగాళ్లను వేధిస్తున్న ఇంగ్లండ్ ప్రాంక్ యూట్యూబర్ జార్విస్ అలియాస్ జార్వో 69ను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అతడు పదేపదే భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించి నానా హడావుడి చేస్తున్ననేపథ్యంలో తొలుత మందలింపులతో సరిపెట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తాజాగా లండన్ దక్షిణ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జార్వోను అరెస్ట్ చేశారు. Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f — Raghav Padia (@raghav_padia) September 3, 2021 'జార్వో 69' పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఈ టీమిండియా అభిమాని ఇప్పటి వరకు మూడుసార్లు(లార్డ్స్ టెస్ట్, లీడ్స్ టెస్ట్, ఓవల్ టెస్ట్) మైదానంలోకి ప్రవేశించాడు. తాజాగా ఓవల్ టెస్ట్ రెండో రోజు ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా మైదానంలోకి చొరబడ్డ జార్వో.. తాను టీమిండియా బౌలర్‌ని అంటూ హంగామా చేశాడు. ఈ క్రమంలో నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టోను ఢీకొంటూ బంతిని విసిరినట్లుగా యాక్షన్ చేశాడు. Jarvo is at the crease #engvsindia pic.twitter.com/XlATed4vGg — JJK (@72jjk) August 27, 2021 ఈ ఘటనతో బెయిర్‌స్టో ఒకింత అసహనానికి గురయ్యాడు. మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఓలీ పోప్ కూడా తన ఏకాగ్రత దెబ్బతినిందని అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం సెక్యూరిటీ వచ్చి జార్వోను మైదానం నుంచి తీసుకెళ్లడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరలయ్యింది. కాగా, లీడ్స్ టెస్టు అనంతరం జార్వోపై ఆ స్టేడియం నిర్వాహకులు జీవతకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా జార్వో మరోసారి అదే తరహాలో చేయడంతో ఈసీబీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి జార్వో అరెస్ట్‌కు సిఫార్సు చేశారు. India's 12th man 😂#ENGvINDpic.twitter.com/bS1OYIl6Tv — The Cricketer (@TheCricketerMag) August 14, 2021 చదవండి: జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్ అవతారంలో -
ఉమేశ్ యాదవ్ అరుదైన రికార్డు.. అత్యంత తక్కువ టెస్టుల్లో
లండన్: టీమిండియా ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ టెస్టుల్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. 31 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ను ఔట్ చేయడం ద్వారా ఉమేశ్ ఈ ఘనతను అందుకున్నాడు. అత్యంత తక్కువ టెస్టుల్లో 150 వికెట్ల ఫీట్‌ను అందుకున్న టీమిండియా బౌలర్లలో జహీర్‌ఖాన్‌తో కలిసి ఉమేశ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. కపిల్‌దేవ్ 39 టెస్టుల్లో 150 వికెట్ల మార్క్‌ను అందుకొని తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత జగవల్ శ్రీనాథ్(40 టెస్టులు), మహ్మద్ షమీ( 42 టెస్టులు) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక జహీర్‌ఖాన్ కూడా 49 టెస్టుల్లో 150 వికెట్లు తీశాడు. మొదటి మూడు టెస్టుల్లో ఉమేశ్‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే నాలుగో టెస్టులో షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇప్పటికే నాలుగో టెస్టులో మలాన్, జో రూట్, క్రెయిగ్ ఓవర్టన్‌లను ఉమేశ్ పెవిలియన్ చేర్చాడు. ఇక ఇంగ్లండ్ లంచ్ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఓలీ పోప్ 38, బెయిర్ స్టో 34 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ టీమిండియా కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: ENG Vs IND: రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ ENG Vs IND Intruder Jarvo 69: జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్ అవతారంలో -
రెండో రోజూ అదే ఫ్లాప్ షో!
-
ఓవల్ ను ఛేదిస్తారా!
లండన్: క్రికెట్ పుట్టినిల్లు అయిన లార్డ్స్ లో ధోని సేన కొత్త చరిత్రను సృష్టించాక సగటు భారతాభిమాని సిరీస్ పై ఆశలు పెంచుకున్నాడు. అయితే మనం ఒకటి తలస్తే.. మన ధోని గ్యాంగ్ మరోటి తలచింది. లార్డ్స్ టెస్టు అనంతరం మంచి ఊపు మీద కనిపించిన ధోనీ గ్యాంగ్ దారుణంగా విఫలమై సిరీస్ పై ఆశలను క్లిష్టం చేసుకుంది. ఇప్పటికే మూడు, నాల్గో టెస్టుల్లో గెలిచి ఈ సిరీస్ ను తమ చేతుల్లోకి తీసుకున్న ఇంగ్లండ్ ఫైనల్ టెస్టును కైవసం చేసుకుని సిరీస్ ను చేజిక్కించుకోవాలని భావిస్తుండగా, ధోనీ సేన మాత్రం టెస్టును గెలిచి సిరీస్ ను సమం చేయాలని వ్యూహరచన చేస్తోంది. భారత్ కు సిరీస్ ను నిలబెట్టుకోవాలంటే అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి ఓవల్ లో ఆరంభం కానున్న ఐదో టెస్టుకు భారత్ సన్నద్ధం అవుతోంది. ఆ టెస్ట్ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేయడానికి భారత్ తీవ్రంగా పోరాడాల్సి ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా మంచి ఊపు మీద కనబడుతోంది. కనీసం భారత్ తో మ్యాచ్ గెలవకపోయినా.. సిరీస్ ను మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరనేది సత్యం. అసలు అంతకుముందు జరిగిన రెండు టెస్టుల్లో భారత్ విఫలమైన తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఆ రెండు టెస్టుల్లో కనీసం పోరాడకుండానే భారత జట్టు ఓటమి పాలై అపఖ్యాతిని మూటగట్టుకుంది. విదేశాల్లో గత భారత జట్టు చరిత్రను చూస్తే మాత్రం మనకు ఎక్కువ గుర్తుకు వచ్చే వ్యక్తులు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లు. వీరు విఫలమైయ్యారంటే మాత్రం భారత జట్టు ఓటమి పాలైన సందర్భాలే మెండు. వీరు సమష్టిగా విఫలమైన చోట భారత జట్టు ఫలితం కూడా ప్రతికూలంగా వచ్చిందని చరిత్ర చెబుతోంది.ఇప్పుడు టీం ఇండియా పరిస్థితి కూడా ఇలానే ఉంది. 2011లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలు లేరు. తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. దాంతో వీరిపై అంచనాలు పెరిగాయి. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల ప్రదర్శనపైనే భారత్ విజయావకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు కూడా విశ్లేషించారు. ఇప్పుడు అదే సరిగ్గా ప్రతికూలంగా జరిగింది. వీరిద్దరి వైఫల్యంతో భారత జట్టు వరుస రెండు టెస్టుల్లో ఘోర పరాభావాన్ని మూట గట్టుకుంది. టెస్టుల్లో మూడు, నాలుగు స్థానాల్లో ఆడిన ఆటగాళ్లు విఫలమైతే మాత్రం అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌పై 95 పరుగుల విజయం..విఖ్యాత లార్డ్స్ మైదానం 200 ఏళ్లు పూర్తి చేసుకున్నవేళ.. 28ఏళ్ల అనంతరం భారత జట్టు రికార్డు. ఇది గత మూడు వారాల క్రితం మాట. ఆ లార్డ్స్ విజయంతో భారత జట్టు టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంటుందని అంతా భావించారు. కాగా, ఆ టెస్టు మ్యాచ్ అనంతరం జరిగిన రెండు వరుస టెస్టుల్లో ఓటమి చవిచూసిన భారత్ ఘోర అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో 266 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో చిత్తయింది. 445 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 178 పరుగులకే ఆలౌటై ఇంగ్లండ్ ను సిరీస్ ను సమం చేయడానికి అవకాశం ఇచ్చింది. అదేదో యాధృచ్చింగా జరిగిపోయిందని భావించిన సగటు భారత్ అభిమానికి మాత్రం నాల్గో టెస్టు కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శల పాలైంది. ఈ తరుణంలో భారత్ చివరి టెస్టును ఏ రకంగా నెట్టుకొస్తోందో చూడాలి. ఈ టెస్టు మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేస్తారా? లేక ఆ మ్యాచ్ ను కూడా ఇంగ్లండ్ చేతిలో పెట్టి భారత్ కు ఉట్టి చేతుల్తో తిరిగి వస్తారా?అనేది చూడాల్సి ఉంది. -
స్టీవెన్ స్మిత్ సెంచరీ, భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా!
యాషెస్ సిరీస్ లో భాగంగా ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదవ, చివరి టెస్ట్ రెండవ రోజు ఆట లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండవ రోజు ఆటలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు స్మిత్ రాణించి సెంచరీ సాధించాడు. స్మిత్ 105 పరుగులతోనూ ఆటను కొనసాగిస్తున్నాడు. తొలి రోజు ఆటలో షేన్ వాట్సన్ 176 పరుగుల సాధించిన సంగతి తెలిసిందే. కడపటి వార్తలు అందేసరికి ఆస్టేలియా జట్టు ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో అండర్సన్ మూడు వికెట్లు, బ్రాడ్, స్వాన్, ట్రాట్ చెరో వికెట్ పడగొట్టారు. ఐదు టెస్టులో సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో వెనుకంజలో ఉంది. 1977 తర్వాత ఒక్క టెస్ట్ లో కూడా విజయం సాధించకుండా సిరీస్ కోల్పోలేదు. చివరి టెస్ట్ లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా చూస్తొంది. -
ఓవల్ టెస్ట్ లో షేన్ వాట్సన్ సెంచరీ
యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ తన మూడో సెంచరీ సాధించడంతో పటిష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు స్కోరు 11 పరుగులు ఉండగా 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్ లో ఓపెనర్ వార్నర్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ రోజర్స్ 23, క్లార్క్ 7 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అయితే ఆతర్వాత క్రీజులో వచ్చిన షేన్ వాట్సన్ ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించాడు. వాట్సన్ 108, స్మిత్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అండర్సన్ రెండు, స్వాన్ కు ఒక వికెట్ లభించింది. ఐదు టెస్టులో సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో వెనుకంజలో ఉంది. 1977 తర్వాత ఒక్క టెస్ట్ లో కూడా విజయం సాధించకుండా సిరీస్ కోల్పోలేదు. చివరి టెస్ట్ లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా చూస్తొంది.