రోహిత్ శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌.. ఐదో రోజు హైలైట్స్‌ ఇవే

India Beat England 157 Runs Oval Test - Sakshi

లండన్‌: ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై 157 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం 368 పరుగుల ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ టీమ్ 210 పరుగులకే కూప్ప కూలింది. భారత జట్టు విజయంలో ఓపెనర్ రోహిత్ శర్మ, బౌలర్లు ఉమేశ్ యాదవ్, బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తో ఆధిక్యం సాధించింది. 127 పరుగుల సాధించి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించిన రోహిత్ శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

చదవండి: సిరీస్‌ వేటలో విజయబావుటా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top