
టీమిండియాతో సిరీస్‌లో అదరగొడుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) అరుదైన ఘనత సాధించాడు. భారత జట్టుపై టెస్టుల్లో ఒకే దేశంలో 2000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. సొంతగడ్డ ఇంగ్లండ్‌పై ఈ మైలురాయిని చేరుకుని ప్రపంచంలో ఇంత వరకు ఏ ప్లేయర్‌కూ సాధ్యం కాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.
టీమిండియాతో ఓవల్ వేదికగా ఐదో టెస్టులో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా రూట్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
2-1తో ఆధిక్యంలో ఇంగ్లండ్
ఇందులో భాగంగా ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు రెండింట.. పర్యాటక భారత్ ఒక మ్యాచ్ గెలిచాయి. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు డ్రా అయింది. ఈ క్రమంలో సిరీస్ ఫలితం తేలాంటే ఆఖరిదైన ఐదో టెస్టు కీలకంగా మారింది.
లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు ఇంగ్లండ్ ధీటుగా బదులిస్తోంది. కేవలం 37 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు పూర్తి చేసుకుంది.
దంచికొట్టిన ఓపెనర్లు
ఓపెనర్లు జాక్ క్రాలీ (64), బెన్ డకెట్ (43) ధనాధన్ దంచికొట్టగా.. వన్‌డౌన్‌లో వచ్చిన తాత్కాలిక కెప్టెన్ ఓలీ పోప్ (22) మాత్రం నిరాశపరిచాడు. ఇక జో రూట్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిరాజ్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. జేకబ్ బెతెల్ (6) కూడా సిరాజ్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
ఇదిలా ఉంటే.. జో రూట్‌కు ఇంగ్లండ్‌లో టీమిండియాపై ఇది 20వ టెస్టు మ్యాచ్. ఈ క్రమంలో ఓవల్ టెస్టు సందర్భంగా అతడు భారత జట్టుపై రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇంతవరకు ఏ బ్యాటర్ కూడా టీమిండియాపై ఈ అరుదైన మైలురాయిని తాకలేదు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ జో రూట్.
ఒక దేశంలో టీమిండియాపై అత్యధిక టెస్టు పరుగులు సాధించిన క్రికెటర్లు
🏏జో రూట్- ఇంగ్లండ్‌లో- 2000* రన్స్
🏏రిక్కీ పాంటింగ్- ఆస్ట్రేలియాలో- 1893 రన్స్
🏏శివ్‌నరైన్ చందర్‌పాల్- వెస్టిండీస్‌లో- 1547 రన్స్
🏏జహీర్ అబ్బాస్- పాకిస్తాన్‌లో- 1427 రన్స్
🏏స్టీవ్ స్మిత్- ఆస్ట్రేలియాలో- 1396 రన్స్.