టీ20 వరల్డ్‌కప్‌ నుంచి పాక్‌ మూలాలున్న ఆటగాడి తొలగింపు | Pakistan origin player removed from T20 World Cup, India accused of bias | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌ నుంచి పాక్‌ మూలాలున్న ఆటగాడి తొలగింపు

Feb 9 2026 3:47 PM | Updated on Feb 9 2026 4:31 PM

Pakistan origin player removed from T20 World Cup, India accused of bias

టీ20 వరల్డ్ కప్-2026 పాల్గొంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టులో కలకలం రేగింది. పాకిస్తాన్ మూలాలున్న బ్యాటర్ మొహమ్మద్ జోహెబ్‌ను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అకస్మాత్తుగా స్వదేశానికి పంపించింది. బోర్డు ప్రకటన ప్రకారం.. జోహెబ్ శాసన నియమావళిని ఉల్లంఘించాడు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జోహెబ్‌ ఏ నియమాలు ఉల్లంఘించాడోనని క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఆరా తీస్తుంది. ఇంత సడెన్‌గా ఓ ఆటగాడిని స్వదేశానికి పంపారంటే ఏదో బలమైన కారణమే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

అయితే, జోహెబ్ మాత్రం తనపై తీసుకున్న చర్యను జాతి వివక్షగా అభివర్ణించాడు. మేనేజ్‌మెంట్ మొత్తం భారతీయ మూలాలున్నవారే ఉన్నారని, తాను పాకిస్తాన్ మూలాలవాడినైనందు వల్ల జట్టు నుంచి ఆకస్మికంగా తొలగించారని ఆరోపించాడు. ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని, దీనిపై అధికారిక విచారణ జరపాలని డిమాండ్ చేశాడు.

ఈ విషయంలో జోహెబ్‌ భారత్‌ను నిందించడాన్ని భారతీయులు తప్పుబడుతున్నారు. ఏదైనా ఉంటే యూఏఈతో బోర్డుతో చూసుకోవాలి కాని, భారత మూలలున్న వారిని అడ్డం పెట్టుకొని భారత్‌ను నిందించడం సరికాదని వార్నింగ్‌ ఇస్తున్నారు.

కాగా, జోహెబ్ తొలగింపుతో యూఏఈ జట్టులో కలకలం రేగినా, టోర్నమెంట్‌లో వారి ప్రయాణం కొనసాగుతుంది. రేపు (ఫిబ్రవరి 10) జరిగే మొదటి మ్యాచ్‌లో వారు న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటారు. ఆ తర్వాతి మ్యాచ్‌లు కెనడా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరగనున్నాయి. 

ప్రీ-టోర్నమెంట్‌లో ఇటలీతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో యూఏఈ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక, కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. జోహెబ్ లేకుండా యూఏఈ జట్టు మరింత బలహీనపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ.. కెనడా, ఆఫ్ఘనిస్తాన్‌పై గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  

ప్రపంచకప్‌లో యూఏఈ స్క్వాడ్: మహ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మయాంక్ కుమార్, మహ్మద్ అర్ఫాన్, మహ్మద్ ఫారూక్, మహ్మద్ జవాదుల్లా, రోహిద్ ఖాన్, సోహెబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్

Advertisement
 
Advertisement
Advertisement