
లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. ఆఖరి రోజు ఆటలో భారత్ విజయానికి 4 వికెట్లు అవసరమవ్వగా.. ఇంగ్లడ్ తమ గెలుపునకు 35 పరుగులు దూరం నిలిచింది.
తొలి సెషన్‌లో మ్యాచ్ ఫలితం తేలిపోనుంది. ప్రస్తుతం క్రీజులో జేమీ స్మిత్(2), జేమి ఓవర్టన్(0) ఉన్నారు. ఇంగ్లండ్‌ను ఎలాగైనా ఆలౌట్ చేసి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో భారత బౌలర్లు ఉన్నారు.
అయితే మ్యాచ్ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చిన్న తప్పిదంతో విలన్‌గా మారిపోయాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించిన సిరాజ్.. ఫీల్డింగ్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు.
కొంపముంచిన సిరాజ్..
సెకెండ్ ఇన్నింగ్స్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ఆరంభంలోనే సిరాజ్ లైఫ్ ఇచ్చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 35వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో తొలి బంతిని హ్యారీ బ్రూక్ ఫైన్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఉన్న సిరాజ్ మియా క్యాచ్‌ను అందుకున్నాడు.
అయితే క్యాచ్‌ను అందుకున్న సిరాజ్ తన వెనకే ఉన్న బౌండరీ రోప్‌ను టచ్ చేశాడు. దీంతో బ్యాటర్‌కు ఆరు పరుగులు లభించాయి. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బ్రూక్.. ఏకంగా 111 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
తర్వాత ప్రసిద్ద్ కృష్ణ వద్దకు సిరాజ్ వెళ్లి క్షమాపణలు చెప్పాడు. ప్రసిద్ద్ కృష్ణ నవ్వుతూ సిరాజ్‌ను హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే యాదృచ్ఛికంగా బ్రూక్ మళ్లీ సిరాజ్‌కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
Prasidh Krishna was all of us, watching it unfold 😥 #SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/jB138cMO13
— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2025