
ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ముద్దుల కుమార్తె కోసం ఆదివారం ఆలయంలో ప్రార్థనలు చేసి గణపతి బప్పా ఆశీర్వాదం తీసుకున్నారట. తన తల్లి రిమ్మా మల్హోత్రాతో సిద్ధి వినాయకుణ్ణి సందర్శించారు. దీనికి సంబంధించినొకవీడియో నెట్టింట ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఆలయ సందర్శనకు సంబంధించిన అనేక వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఒక ఛాయాచిత్రకారుడు షేర్ చేసిన క్లిప్‌లో, సిద్ధార్థ్ నీలిరంగు కుర్తా ,బ్లాక్‌డెనిమ్ ధరించి సిద్దార్థ్, పింక్ సూట్‌లో తల్లి రిమ్మా గణపతిని దర్శించుకున్నారు. భక్తితో చేతులు జోడించి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పూజారి దేవుని పాదాల దగ్గరి పూమాలను వారికి ఇచ్చారు.
s="text-align-justify"> కాగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara advani)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో కనిపించిన కియారా, ఇటలీలోని రోమ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా తనకు ప్రపోజ్ చేశాడని వెల్లడించింది. షేర్షా సినిమా షూటింగ్ సమయంలో డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ 2023, ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వివాహం జరిగింది. ఈ జంట జూలై 16న తమ తొలి సంతానానికి (ఆడబిడ్డ) జన్మనిచ్చారు.