
లక్నో: ప్రేమ పెళ్లి ఆమె పాలిట శాపమైంది. ఒక పోలీసు అధికారి భార్య.. భర్త ఇంట్లో వేధింపులు భరించలేక తనువు చాలించింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ లైవ్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల ప్రకారం.. యూపీ రాజధాని లక్నోలోని బక్షి కా తలాబ్ (బికెటి) పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్, మృతురాలు సౌమ్య కశ్యప్ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన నాటి నుంచే సౌమ్యకు భర్త, అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. సౌమ్య కట్నం తీసుకురాక పోవడంతో అనురాగ్ కుటుంబం కట్నం గురించి ఇబ్బందులకు గురిచేసేవారని బాధితురాలు వీడియోలో తెలిపింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో, అనురాగ్ ఆమెను వేరే వివాహం చేసుకోవాలని కూడా బలవంతం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
🚨 Shocking! UP Cop’s Wife Dies by Suicide After Emotional Video
Lucknow: Soumya Kashyap, wife of constable Anurag Singh, died by suicide.
She posted a crying video blaming husband & in-laws for abuse and dowry torture. She showed her wounds, said husband threatened her: “I’m… pic.twitter.com/ripREYqDOQ— زماں (@Delhiite_) July 27, 2025
ఇది మాత్రమే కాదు, అనురాగ్ తరచుగా తనను కొట్టేవాడని ఆరోపించింది. ఈ మేరకు సౌమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసింది. అయితే, అత్తింటి వేధింపులు, భర్త కూడా వారికి సపోర్టుగా మారడంతో సౌమ్య మానసికంగా కుంగిపోయింది. తనను మానసికంగా వేధించారని, తన భర్త, ఆయన బావ, బావ సోదరుడు కూడా తనను వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. నా భర్త బావ సంజయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అతని సోదరులలో ఒకరైన రంజిత్ న్యాయవాది. వీరి వద్ద డబ్బు ఉంది, డబ్బుతో వారు ఏదైనా చేయగలరు. వారు నన్ను ఎంతగానో హింసించారు. ఈరోజు నేను చనిపోతున్నానంటే వీరే కారణం అంటూ ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.