బ్రహ్మోస్‌ పనీతీరు ఎలా ఉంటుందో పాక్‌కు తెలుసు: సీఎం యోగి | BrahMos Missile Unit Started In Lucknow | Sakshi
Sakshi News home page

బ్రహ్మోస్‌ పనీతీరు ఎలా ఉంటుందో పాక్‌కు తెలుసు: సీఎం యోగి

May 11 2025 1:21 PM | Updated on May 11 2025 3:17 PM

BrahMos Missile Unit Started In Lucknow

లక్నో: భారత్‌ (India), పాకిస్థాన్‌ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) యూపీ (Uttarpradesh)లోని లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి (BrahMos missile) తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ‘ఉత్తరప్రదేశ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌’లో ఈ కేంద్రాన్ని నిర్మించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ వర్చువల్‌ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి పాల్గొన్నారు. ఈ యూనిట్‌కు 80 హెక్టార్ల భూమిని యూపీ సర్కార్‌ ఉచితంగా ఇచ్చింది. 

ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఇదే రోజున మన శాస్త్రవేత్తలు పోఖ్రాన్‌లో అణు పరీక్షలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. నేను లక్నో ఎందుకు రాలేదో మీ అందరికీ తెలుసు. ఇంత తక్కువ సమయంలో ఈ యూనిట్‌ సిద్ధం చేసిన వారికి అభినందనలు. 40 నెలల్లోనే ఈ ప్రొడక్షన్‌ యూనిట్‌ను పూర్తి చేశారు అని ప్రశంసించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబు ఇచ్చాం. ​కేవలం పాక్‌ సరిహద్దే కాదు, రావల్పిండిపైనా దాడి చేశాం. బ్రహ్మోస్‌ క్షిపణితో శత్రువుకు మన శక్తి తెలియజేశాం. ఆపరేషన్‌ సిందూర్‌తో ప్రజలను ఎక్కడా టార్గెట్‌ చేయలేదు. ఉగ్రవాదాన్ని సహించబోమని ఆపరేషన్‌ సిందూర్‌తో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆలయాలు, గురుద్వారాలపై పాక్‌ సైన్యం దాడి చేస్తే.. మన సైన్యం ఆ దాడులను ధీటుగా తిప్పికొట్టింది. యూరి, పుల్వామా, పహల్గాం దాడుల తర్వాత ప్రతీసారి మన శక్తిని ప్రపంచానికి చూపించాం’ అని అన్నారు. 

అంతకుముందు.. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మీరు బ్రహ్మోస్ క్షిపణిని ఒకసారి చూసి ఉంటారు. పాకిస్తాన్‌పై బ్రహ్మోస్‌ను ప్రయోగించాం. బ్రహ్మోస్‌ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాకిస్తాన్‌ను అడగండి. బ్రహ్మోస్‌ పనితీరును ప్రపంచమంతా చూసింది. ఉగ్రదాడి ఏదైనా యుద్ధంగానే పరిగణించాలి. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయనంత వరకు ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలంటే, మనమందరం ప్రధాని మోదీ నాయకత్వంలో ఏకగ్రీవంగా పోరాడాలి. ఉగ్రవాదం ప్రేమ భాషను ఎప్పటికీ అంగీకరించదు. దానికి దాని స్వంత భాషలోనే సమాధానం చెప్పాలి. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని అన్నారు.

ఇక, ఇక్కడ.. ఏడాది నుంచి 100 బ్రహ్మోస్‌ క్షిపణులు తయారుచేసేలా ఈ ప్రొడక్షన్‌ యూనిట్‌ను డిజైన్‌ చేశారు. రూ.300 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. భారత్‌, రష్యాల సంయుక్త వెంచర్‌ అయిన బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్‌ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణిని ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌ గైడెన్స్‌ సిస్టమ్‌తో భూ ఉపరితలం నుంచి, సముద్ర తలం నుంచి, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. కొత్తగా ప్రారంభమవుతున్న ఈ క్షిపణి తయారీ కేంద్రం నుంచి 100 నుంచి 150 కొత్త తరం బ్రహ్మోస్‌ క్షిపణులను తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం బ్రహ్మోస్‌ క్షిపణులు ఏడాదిలోగా డెలివరీకి సిద్ధం కానున్నాయి. ఈ న్యూజనరేషన్‌ బ్రహ్మోస్‌ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. దీని బరువును తగ్గించారు. ప్రస్తుత బ్రహ్మోస్‌ క్షిపణి బరువు 2900 కిలోలు కాగా, న్యూ బ్రహ్మోస్‌ క్షిపణి బరువు 1290 కిలోలు. ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో​ ఇది ప్రయాణించగలదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement