
మహిళా కానిస్టేబుల్‌పై ఇంటి యజమాని దారుణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్‌పై ఆమె నివాసముంటున్న ఇంటి యజమాని కుటుంబం దాడి చేసింది. ఆగస్టు 15న సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్నోలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహిళ తన గదిలో ఉండగా.. ఇంటి యజమాని సల్మా షేక్ వచ్చాడు.
ఆమె వాహనాన్ని ఇంటి బయట పార్కింగ్ చేయడంపై అభ్యంతరం చెప్పాడు. ఇంటిని ఖాళీ చేయాలన్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సల్మా షేక్ కుమారులు సుహాన్, ఇమ్రాన్ ఆమెను కులపరంగా దూషించడమే కాదు.. భౌతికంగా దాడి చేశారు. అనుచితంగా తాకారు. సర్వీసు నుంచి సస్పెండ్ చేయిస్తామని బెదిరించారు. దాడితో కానిస్టేబుల్ బట్టలు చిరిగిపోయాయి. స్పృహ కోల్పోయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.