రీల్‌ ఎంత పని చేసింది రాములా! | Doctor Dance With Fiance in Emergency Duty Viral | Sakshi
Sakshi News home page

రీల్‌ ఎంత పని చేసింది రాములా!

Nov 22 2025 10:43 AM | Updated on Nov 22 2025 10:59 AM

Doctor Dance With Fiance in Emergency Duty Viral

సోషల్‌ మీడియా అల్గారిథం ఎప్పుడు ఎలా పని చేస్తుందో?.. ఎప్పుడు ఏది వైరల్‌ అవుతుందో అర్థంకాని పరిస్థితి. అందుకే పోస్టులు, వీడియోలు పెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పెళ్లి కాబోతుందన్న సంబురంలో.. ముందు వెనకా ఆలోచించకుండా ఓ వీడియో తీసుకుని పోస్ట్‌ చేసి చిక్కుల్లో పడ్డాడు ఇక్కడో వైద్యుడు. 
 
ఇక్కడి ఈ కింది వీడియోలో బనీయన్‌ మీద కిందపడి మరీ దొర్లుతూ డ్యాన్స్‌ చేస్తున్న వ్యక్తి ఓ డాక్టర్‌. ఆ పక్కనే ఒయలు ఒలకబోస్తోంది అతనికి కాబోయే భార్య. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఎవరికేం నొప్పి అంటారా? అక్కడికే వస్తున్నాం. ఆ డ్యాన్స్‌ తన బెడ్‌రూంలో వేస్తే ఫర్వాలేదు. కానీ, ఆస్పత్రిలోనే దుకాణం పెట్టేశాడు. 
 
ఆస్పత్రి గదిలో.. అదీ ఎమర్జెన్సీ డ్యూటీని ఎగ్గొట్టి మరీ తనకు కాబోయే భార్యతో డ్యాన్స్ చేశాడు షామ్లీ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్‌ వకార్‌ సిద్ధిఖీ. ఈ వీడియో కాస్త నెట్టింట రీల్‌ రూపంలో వైరల్‌ అయ్యింది. అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఆఖరికి అధికారుల దృష్టికి చేరింది. దీంతో సిద్ధిఖీని వివరణ కోరారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించి.. ఆయనకు కేటాయించిన బంగ్లాను సైతం ఖాళీ చేయించారు. 
 \
బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వకార్‌ సిద్ధిఖీ రెండేళ్ల కాంట్రాక్ట్‌ కింద ఆ ఆస్పత్రిలో చేరారని.. అతని ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవైపు డాక్టర్ల కొరత కొనసాగుతున్నవేళ.. ఈ కాంట్రాక్ట్‌ డాక్టర్‌ చేసిన పని ప్రజాగ్రహానికి దారి తీసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement