ఉత్తర ప్రదేశ్‌లో అరుదైన వివాహం పలువురిని ఆకట్టుకుంటోంది. అనుకోని ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళకు మరో జీవితాన్ని ప్రసాదించిన ఘటన నెట్టింట విశేషంగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో జరిగింది.
యూపీకి చెందిన రాజేశ్ సింగ్ సోదరుడు ప్రమాదంలో కన్నుమూశాడు. దీంతో తన సోదరుడితో కలిసి ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న వదిన వేదనను గమనించాడు. అలాగే చెట్టంత కొడుకును కోల్పోయిన తన తన కుటుంబం కూడా విషాదంలో మునిగిపోయింది. ఇదే రాజేశ్‌ను ఆలోచింప చేసింది. అటు చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వదినకు,ఇటు కుటుంబానికి ఊరట నివ్వాలని అనుకున్నాడు. వదినను పెళ్లి చేసుకోవాలని రాజేశ్ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని కుటుంబంతో చెప్పి, ఒప్పించి బంధు మిత్రుల సమక్షంలో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. దీనిపై వారిబంధువులతో పాటు, నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపించారు.


