ఫుల్లుగా తాగి అర్ధరాత్రి రచ్చ.. అర్ధనగ్నంగా డ్యాన్స్‌.. | Noida Youths Fined ₹67,000 For Dancing On Car Roof During New Year Celebrations, Video Went Viral | Sakshi
Sakshi News home page

ఫుల్లుగా తాగి అర్ధరాత్రి రచ్చ.. అర్ధనగ్నంగా డ్యాన్స్‌..

Jan 4 2026 9:43 AM | Updated on Jan 4 2026 10:28 AM

Shirtless Men Dance top Car Roof Noida Police 67000 Challan

లక్నో: న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా కొందరు ఆకతాయిలు నడిరోడ్డుపై రెచ్చిపోయారు. డిసెంబర్‌ 31వ తేదీన అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి రద్దీ రహదారిపై కారుపైకి ఎక్కి అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, పోలీసులు వారికి ఏకంగా 67 వేలు జరిమానా విధించి షాకిచ్చారు.

తెలిసిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా (Noida)లో న్యూ ఇయర్‌ సందర్భంగా యువకులు కారులో రోడ్డు మీదకు వచ్చారు. ఆరుగురు యువకులు ఫుల్లుగా మద్యం సేవించి మారుతి ఆల్టో కారులో ప్రయాణించారు. మార్గం మధ్యలో కారు ఆపి దాని రూఫ్‌టాప్‌ పైకెక్కి నృత్యాలు చేశారు. వీరి చర్యతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, ట్రాఫిక్‌లో చిక్కుకున్న స్థానికులు వీరి డ్యాన్స్‌, ఓవరాక్షన్‌ను వీడియో తీశారు. అనంతరం వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. ఇక ఈ ఘటనపై ట్రాఫిక్‌ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు రూ.67 వేలు జరిమానా విధించి షాకిచ్చారు. ఇందులో భాగంగా వాహన యజమానిపై ప్రమాదకరమైన డ్రైవింగ్, బీమా లేకుండా వాహనం నడపడం, సేఫ్టీ బెల్ట్ ధరించకపోవడం వంటి పలు ఉల్లంఘనలకు పాల్పడినట్టు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా.. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఢిల్లీ, నోయిడా పరిసర ప్రాంతాల్లో మద్యం తాగి వాహనాలు నడిపినందుకు పోలీసులు.. 868 చలాన్లు జారీ చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఘటన డిసెంబర్‌ 31న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement