గంగా నదిలో మాఘమేళా.. బాస్మతి, అఫ్సానా వైరల్‌.. | Magh Mela 2026 Begins With Paush Purnima Holy Dip, Garland Sellers Basmati And Afsana Videos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

గంగా నదిలో మాఘమేళా.. బాస్మతి, అఫ్సానా వైరల్‌..

Jan 4 2026 10:55 AM | Updated on Jan 4 2026 12:02 PM

UP Prayagraj Magh Mela 2026 Ganga Holi Bath

ప్రయాగ్‌రాజ్‌: పౌష్య పూర్ణిమను పురస్కరించుకుని శనివారం ప్రయాగ్‌రాజ్‌లో మాఘ మేళా ఉత్సవం వైభవంగా మొదలైంది. సంగం తీరంలో సాధువులు, తాత్కాలిక శిబిరాల్లో కల్పవాసులు, పూజా సామగ్రి విక్రయించే వ్యాపారులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేకువ జాము నుంచే లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గంగా తీరం భక్తులతో నిండిపోయింది. మరోసారి కుంభమేళాను తలిపించే విధంగా ఆ ప్రాంతం మారిపోయింది. 

మరోవైపు.. గతేడాది కుంభమేళలో మోసాలిసా హైలెట్‌ అయిన విషయం తెలిసిందే. ఇక, ఈసారి మాఘ మేళాలో దంత కర్రలు(టూత్ స్టిక్స్) అమ్ముతున్న బాస్మతి అనే అమ్మాయి వీడియో వైరల్ అవుతోంది. బాస్మతి ఎంతో అందగా, అమాయకత్వంతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బాస్మతి మాఘ మేళాలో స్నానం చేయడానికి వచ్చింది. కానీ తరువాత దండలు, దంత కర్రలను అమ్మడం ప్రారంభించింది. చాలా మంది యూట్యూబర్లు ఆమె వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రజలు ఆమెను కొత్త మోనాలిసా అని పిలుస్తున్నారు.

మరోవైపు.. బాస్మతితో పాటు, మరో ఇద్దరు అమ్మాయిలు కూడా మాఘ మేళాలో వైరల్ అవుతున్నారు. వారిలో ఒకరి పేరు అఫ్సానా, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా నివాసి. అఫ్సానా మోనాలిసా బంధువు అని చెబుతారు. అఫ్సానా కూడా ఈ ఉత్సవంలో దండలు అమ్ముతోంది. ప్రజలు ఆమెను మోనాలిసా అని పిలుస్తున్నారు. 

 

ఇక, నెల రోజుల పాటు కొనసాగే కల్పవాస్‌ సమయంలో గంగా నదిలో మునిగితే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక. సంప్రదాయం ప్రకారం భక్తులు కల్పవాస్‌ సమయంలో రోజుకు రెండు పర్యాయాలు గంగా నదీ స్నానం, ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ ధ్యానం, దైవారా ధనలో గడుపుతారు. మొదటి రోజైన శనివారం ఉదయం 10 గంటల సమయానికే సుమారు 9 లక్షల మంది భక్తులు సంగం ప్రాంతానికి తరలివచ్చినట్లు అధికారుల అంచనా. అదే సమయంలో, దాదాపు 5 లక్షల మంది భక్తులు కల్పవాస్‌ దీక్షను ప్రారంభించారని త్రివేణీ సంగం ఆర్తి సేవా సమితి ప్రెసిడెంట్‌ ఆచార్య రాజేంద్ర మిశ్రా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement