క్రికెటర్‌ టు ఐఏఎస్‌ జర్నీ..! బస్సు డ్రైవర్‌ కొడుకు విజయగాథ.. | Bus drivers son lost DU admission and cricket to poverty but Cracked UPSC | Sakshi
Sakshi News home page

IAS Moin Ahmad Success Story: క్రికెటర్‌ టు ఐఏఎస్‌ జర్నీ..! బస్సు డ్రైవర్‌ కొడుకు విజయగాథ..

Nov 26 2025 4:08 PM | Updated on Nov 26 2025 4:08 PM

Bus drivers son lost DU admission and cricket to poverty but Cracked UPSC

ఒక్కోసారి మనం కోరుకున్న కలకి, అందనంత దూరంలో మన ఆర్థిక పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి మన డ్రీమ్‌ని చంపేసుకోవాల్సి వస్తుంటుంది. అలాంటి విపత్కర పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ బస్సు డ్రైవర్‌ కొడుకు. పోనీ నచ్చిన యూనివర్సిటీలో చదువుదామన్న చేతిలో చిల్లిగవ్వ లేదు. అలాంటి నేపథ్యంలో ఐఏఎస్‌ చదవాలనుకోవడమే సాహసం అనుకుంటే..సివిల్స్‌ ఎగ్జామ్‌లో విజయ సాధించడమే కాదు తాను కోరుకున్నట్లుగా ఐఏఎస్‌ అయ్యాడు. ివిధి నీ వల్ల ాకాదని వెక్కిరిస్తూ ఉన్నా..వెనకడుగు వేయకుండా తలరాతనే మార్చుకున్నాడు.

అతడే ఉత్తరప్రదేశ్‌కి చెందిన బస్సు డ్రైవర్ కొడుకు మొయిన్ అహ్మద్‌. చిన్నప్పటి నుంచి క్రికెటర్‌ కావలన్నిది అతడి కల. అతని తండ్రి వలీ హసన్ ఏకైక సంపాదనపైనే కుటుంబం అంతా ఆధారపడి ఉంది. అదీగాక తండ్రి తన క్రికెట్‌కు అవసరమైన కిట్‌కొనడమే కష్టంగా ఉండేది. దాంతో ఇది ధనవంతు పిల్లలు ఆడే ఆట అని మనసుకు నచ్చజెప్పుకుని..చదువుపై దృష్టి సారించాడు. 

అలా ఇంటర్మీడియెట్‌లో మంచి మార్కులు తెచ్చుకుని చాలామంది విద్యార్థుల డ్రీమ్‌ అయిన ఢిల్లీ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. కానీ అక్కడి కాలేజీ చదువుల ఖర్చులు తట్టుకునే సామర్థ్యం లేక ఆ కలను కూడా చంపేసుకున్నాడు. ఎందుకంటే అతడికి విద్యా రుణం ఇచ్చేందుకు ఏ బ్యాంకులు ముందుకు రాలేదు. 

చివరికి తను ఉండే గ్రామానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ కాలేజ్‌లో జాయిన్‌ అయిపోయాడు. అలాగే తన భవిష్యత్తు కోసం అలాగే కుటుంబ అవసరాల నిమిత్తం సైబర్‌కేఫ్‌లో పనిచేస్తూ.. చదువు పూర్తిచేశాడు. ఆ తర్వాత నెలకు రూ. 40 వేలు వచ్చే మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నాడు. అప్పుడే అతనికి ఐఏఎస్‌ అవ్వాలనే కోరిక పుట్టింది. చిన్నప్పటి నుంచి ప్రతి డ్రీమ్‌పై నీళ్లు జల్లేసిన తన ఆర్థిక పరిస్థితి మారేలా అత్యున్నత స్థాయిలో ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. 

అయితే దీన్ని కుటుంబసభ్యులంతా వ్యతిరేకించారు. ఇలాంటి ప్రతిష్టాత్మకైన సివిల్స్‌ఎగ్జామ్‌ వైపుకి వెళ్లడం అంటే కెరీర్‌ని నాశనం చేసుకోవడంతో సమానమని హితవు పలికారు. అతడి అమ్మ తస్లీమ్ జహాన్ మాత్రమే ఇందుకు మద్దతిచ్చింది. దాంతో మోయిన్‌ ఆత్మవిశ్వాసంతో కథన రంగంలోకి దిగాడు. అలా 2019లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఢిల్లీకి మకాం మార్చాడు. తన ప్రిపరేషన్‌కు నిధులు సమకూర్చుకోవడానికి రూ. 2.5 లక్షల రుణం తీసుకున్నాడు. 

ఢిల్లీలో అతడి జర్నీ చాలా భయనకంగా ఉండేది. ఓ పక్కన తెచ్చుకున్న డబ్బులన్నీ నీళ్లలా ఖర్చు అయిపోతుండేవి, మరోవైపు ఒత్తిడి పెరిగపోతుండేది. ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలో తెలియని టైంలో తన గురువు IRS అధికారి ఆసిఫ్ యూసుఫ్ అతియా ఫౌండేషన్ సాహిల్ ఖాన్‌ మార్గనిర్దశంలో ముందుగకు సాగాడు. ఖర్చుల నిమిత్తం అతడికి సాయం చేసేందుకు సాహిల్‌ ముందుకొచ్చేవాడు. ఈ చర్య ఇతరులు తనకు సహాయం చేయగలరన్న నమ్మకం అతడిని కార్యోన్ముఖుడిని చేసింది. 

అలా తన మొదటి మూడు ప్రయాత్నాలలో సివిల్స్‌లో ఓటమిని ఎదుర్కొన్నా..నాల్గో ప్రయత్నంలో ఆలిండియా 296వ ర్యాంక్‌ తెచ్చుకుని ఐఏఎస్‌ అధికారి అయ్యాడు. తను ఉన్న స్థితికి మించిన లక్ష్యం పెట్టుకోవడం తప్పుకాదని..తగిలే ఎదురుదెబ్బలే ఆయుధాలు అవుతాయి అనేందుకు మొయిన్ అహ్మద్‌నే ఉదాహరణ. తలచుకుంటే ఎంత కఠినమైన సవాళ్లును కష్టాలై పరారైపోయేలా తలరాతను మార్చుకోవచ్చని అహ్మద్‌ కథ వింటే స్పష్టమవుతుంది కదూ..!. 

(చదవండి:  తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్‌ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్‌ పాఠాలు)

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement