తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్‌ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్‌ పాఠాలు | Ex-ISRO Scientists ZeroWasteAdda 4 Lakh Indians Live With Less Waste | Sakshi
Sakshi News home page

తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్‌ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్‌ పాఠాలు

Nov 26 2025 12:50 PM | Updated on Nov 26 2025 1:02 PM

Ex-ISRO Scientists ZeroWasteAdda 4 Lakh Indians Live With Less Waste

ఓ పెద్ద మార్పు కోసం పెద్దపెద్ద సమావేశాలు అవసరం లేదు. మన ఇంట్లోనే చిన్న చిన్న పనులతో ప్రారంభమవుతుందని ఈ ఇస్రో మాజీ శాస్త్రవేత్త నిరూపించారు. అందుకు కావాల్సిందల్లా ఆసక్తి, జిజ్ఞాస మాత్రమే. తన ఇంట్లోనే వచ్చే ఇన్ని వ్యర్థాలను తగ్గించడం ఎలా అనే చేసిన సరదా పరిశోధన..ఇంత పెనుమార్పుకి దారితీస్తుందని ఊహించలేదామె. పైగా మొత్తం దేశమే మెచ్చేలా ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటానని కూడా అనుకోలేదు. ఆమె ప్రయత్నాలు తక్కువ వ్యర్థాలతో జీవించేందుకు బీజం పడటమే కాకుండా ఎంతోమంది భారతీయులను ఆ దిశగా నడిపించేందుకు దారితీసింది.

ఆ ఇస్రో మాజీ శాస్త్రవేత్తే పంక్తి పాండే. తన ఇంట్లో ఉన్న సాధారణ వ్యర్థాలను తగ్గించేందుకు పూనకోవడమే ఆమె జీవిత గమనాన్ని మార్చేసింది. కిరాణ సంచులు, షాంపూ సీసాలు, వంటగది స్క్రాప్‌లు వంటి రోజూవారి వ్యర్థాలను ఎలా నివారించొచ్చు అనేది అర్థమైంది ఆమెకు. అలా మొదలైన ప్రయాణం 'జీరోవేస్ట్‌ అడ్డా'కి అంకురార్పణ  చేసింది. అలా తన జీరో వేస్ట్‌ ఆచరణాత్మక పద్ధతులు భారతదేశం అంతటా ప్రజలకు తెలిసేలా చేసింది ఈ జీరోవేస్ట్‌ అడ్డా. 

ఆ వ్యర్థాలు మానవులకు ఏవిధంగా ప్రయోజనకారిగా మారతాయా అన్నది ఈ అడ్డా క్లియర్‌గా అర్థమయ్యేలా చేయడమే కాదు, దాదాపు నాలుగు లక్షల మంది భారతీయలును ఆ దిశగా నడిచేలా మార్పుకు శ్రీకారం చుట్టింది. అంతేగాదు ఆము సోషల్‌ మీడియా కంటెంట్‌గా అవతారం ఎత్తి..రోజువారీ వ్యర్థాలను ఎలా పునర్వినియోగ పరుచుకుంటూ.. పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చు వంటివి చాలా చిన్న చిన్న ఆచర్ణాత్మక పద్ధుతులతో చెప్పడం నెటిజన్లను ఆకర్షించడమే కాదు, వేలకొద్ది ఫాలోవర్స్‌ని తెచ్చిపెట్టింది. 

వ్యర్థాలతో ఆరోగ్యకరమైన జీవనానికి మార్గం వేసుకునేలా ప్రేరణ కల్పించింది. అంతేగాదు అలా నెమ్మదిగా దాన్ని ఫ్యాషన్‌, మిల్లెట్‌, వంటి స్థానిక ఆహారాలు, బుద్ధిపూర్వకంగా తినడం వరకు అన్ని కూడా చివరికి జీరో వేస్ట్‌ లివింగ్‌ ప్రాధాన్యతనే హైలెట్‌ చేయడం విశేషం. వాతావరణ మార్పులపై చర్య తీసుకోవడానికి ఆమె ఇంట్లో సోలార్‌ ప్యానెల్స్‌ వాడటం వంటి వాటితో ఆన్‌లైన్‌వేదికగా ప్రజలను ప్రోత్సహించింది.

అంతేగాదు సోషల్‌మీడియా శక్తిని మంచికోసం వినయోగించి పెద్ద మార్పుకి బీజం ఎలా వేయొచ్చో చెప్పి స్ఫూర్తిగా నిలిచింది పంక్తి పాండే. అంతేగాదు పర్యావరణ సెలవుల నుంచి సెకండ్ హ్యాండ్ హోమ్ ఫర్నిచర్‌, ప్లాస్టిక్ రహిత జర్నీ వరకు అన్నింటి గురించి ఆకర్షణీయమైన కంటెంట్‌ని అందించి..ఆచరించేలా ప్రేరేపిస్తుందామె. 

మన దైనందిన జీవితంలో సరళమైన, స్థిరమైన అలవాట్లను స్వీకరిస్తే..కాలుష్యం కోరల్లో చిక్కుకుండా భూమిని భద్రంగా ఉంచుకోవచ్చు అని చెబుతోందామె. ఈ ప్రయత్నాలకు గానూ 2024లో పంక్తిని గ్రీన్‌ ఛాంపియన్‌గా కీర్తించి మరీ నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డుతో సత్కరించింది భారత ప్రభుత్వం. అలాగే పంక్తి జీరోవేస్ట్‌ అడ్డాకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి.

 

(చదవండి: ప్రియమైన కుమారుడికి మీ అమ్మ వ్రాయునది...)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement