తన టీనేజ్ కుమారుడు అదేపనిగా ఫోన్‌లో మునిగివడం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం ఆ తల్లిని బాగా బాధ పెట్టింది. మందలిస్తే ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని భయపడింది. అయితే తన మనసులోని ఆవేదనను మాత్రం ఒక కాగితంపై పెట్టింది.
ఆ కాగితం ఆమె నుంచి ఎలా మిస్ అయిందో తెలియదుగానీ ఇటు వెళ్లి అటు వెళ్లి సోషల్ మీడియాకు చేరింది.తన ఉత్తరంలో టీనేజర్‌ల మితిమీరిన స్క్రీన్ టైమ్ గురించి ఆందోళన వ్యక్తం చేసింది చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ.
చాలా స్కూల్స్‌లో మొబైల్ ఫోన్‌ను అనుమతించనప్పటికీ విద్యార్థులు వాటిని రహస్యంగా వాడుతున్నారు. అధిక స్క్రీన్ టైమ్ వలన వారి చదువు దెబ్బతింటుంది. చైనాకు చెందిన ఆ తల్లి ఉత్తరంపై ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ‘ఇది చైనా తల్లి సమస్య మాత్రమే కాదు ఎన్నో దేశాలలోని తల్లుల సమస్య’ ‘ఆ తల్లి ఉత్తరాన్ని ఎన్నో దేశాల ప్రజలు చదివి ఉంటారు. ఆమె కుమారుడు కూడా చదివే ఉంటాడు. అతడు మారుతాడని ఆశిద్దాం’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి.
(చదవండి: ఒరిజినల్ సర్టిఫికెట్లు వారి దగ్గర ఉంచుకునే అధికారం లేదు)


