
ఉరవకొండ: హెచ్చెల్సీకి తుంగభద్ర జలాలు విడుదల కావడంతో ఎంపీఆర్ లింక్ చానల్ నుంచి 500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. పెన్నహోబిలం క్షేత్రం మీదుగా ఈ నీరు ఎంపీఆర్‌కు చేరుతోంది.

దీంతో పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ప్రకృతి సోయగాలతో కనువిందు చేస్తోంది.

శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పెన్నహోబిలం క్షేత్రానికి వస్తున్న భక్తులు ఇక్కడి సెలయేళ్లలో సరదాగా గడుపుతున్నారు. వనభోజనాలతో సందడి చేస్తున్నారు.

పెన్న అహోబిళం, అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలానికి చెందిన గ్రామం.

ఈ గ్రామం ఉరవకొండ మండలకేంద్రానికి, 12 కి.మీ.దూరంలోనూ, అనంతపురానికి 40 కి.మీ.దూరంలోనూ, సమీప పట్టణమైన గుంతకల్లు నుండి 31 కి. మీ. దూరంలోనూ ఉంది.

















