ఆంబులెన్స్‌లో గ్యాంగ్‌రేప్‌ | Bihar Gaya Home Guard Candidate | Sakshi
Sakshi News home page

హోంగార్డు అభ్యర్థిపై ఆంబులెన్స్‌లో గ్యాంగ్‌రేప్‌

Jul 26 2025 2:05 PM | Updated on Jul 26 2025 2:13 PM

Bihar Gaya Home Guard Candidate

ఆమె హోంగార్డ్‌ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఫిజికల్‌ టెస్టులకు హాజరైంది. ఆ సమయంలో ఎక్కువ సేపు లైన్‌లో ఉండడంతో.. కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో అక్కడి నిర్వాహకులు ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో.. అదీ ఆంబులెన్స్‌లోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. దీంతో పలువురు అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.

బీహార్‌ గయ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.  హోంగార్డ్‌ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఫిజికల్‌ టెస్టులకు వెళ్లిన యువతి(26)పై అఘాయిత్యం జరిగింది.  ఫిజికల్‌ టెస్టులో పాల్గొంటున్న ఆమె కళ్లు తిరిగి పడిపోవడంతో ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో.. అదీ ఆంబులెన్స్‌లోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆమె ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది. 

జులై 24వ తేదీన బోధగయలోని బీహార్‌ మిలిటరీ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పృహలోని తనపై ఆంబులెన్స్‌లో నలుగురు అత్యాచారం జరిపారని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే ఇద్దరిని(ఆంబులెన్స్‌ డ్రైవర్‌తో సహా) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటన రాజకీయంగానూ ప్రభుత్వం, పోలీసులపై విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో సిట్‌ను, ఫోరెన్సిక్‌ టీంను ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ శాఖ ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement