హోటళ్ల ‘గ్యాస్ చార్జీ’లు
పలు నగరాల్లో అదనపు వసూళ్లు
పెరుగుతున్న సిలిండర్ల చోరీలు
చెన్నై/బెంగళూరు: దేశవ్యాప్తంగా నానాటికీ తీవ్రతరమవుతున్న వాణిజ్య సిలిండర్ల (Commercial LPG cylinder) కొరత పలు గమ్మత్తైన పరిణామాలకు కూడా దారి తీస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉన్న బెంగళూరు, చెన్నై వంటి పలు నగరాల్లో బ్లాక్ మార్కెటింగ్ జోరుగా సాగుతోంది. దాంతో పలు హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే ప్రయత్నం చేస్తున్నాయి. ‘గ్యాస్ చార్జీ’ పేరిట కస్టమర్ల నుంచి బిల్లులో అదనంగా వసూలు చేసేస్తున్నాయి! అలా చెన్నైలోని ఒక హోటల్ ఇచ్చిన బిల్లు ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: మండిస్తున్న ఎండలు, పైకప్పు చల్లగా ఇలా..!
బెంగళూరులో కూడా ఒక హోటల్ తన కస్టమర్ నుంచి గ్యాస్ బిల్లు రూపంలో ఏకంగా 30 రూపాయలు వసూలు చేసింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్ ఆ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నగర పోలీస్ కమిషనర్‌ను కూడా ట్యాగ్ చేస్తూ, ఈ వసూళ్ల దందాను కట్టడి చేయాల్సిందిగా కోరాడు. బెంగళూరు హోటళ్ల సంఘం అధ్యక్షుడు పి.సి.రావు దీనిపై వెంటనే స్పందించారు.

సదరు హోటల్ యాజమాన్యంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. బెంగళూరు తదితర నగరాల్లో సిలిండర్ల చోరీలు కూడా పెరిగి పోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
ఇదీ చదవండి: మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్


