నాన్నను అమ్మే చంపేసింది.. | Woman Ends Her Husband Life With Lover Help, Family Misled Until Daughter Reveals Truth In Bhadradri Kothagudem | Sakshi
Sakshi News home page

నాన్నను అమ్మే చంపేసింది..

Mar 14 2026 11:40 AM | Updated on Mar 14 2026 11:56 AM

 Incident In Chandrugonda Bhadradri Kothagudem District

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రియుడి సాయంతో భర్తను హతమార్చిన మహిళ.. మద్యం మత్తులో కింద పడి గాయాలై మృతి చెందాడని అందరినీ నమ్మించింది. నిజమేనని భావించి కుటుంబీకులు అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే, ఈ దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె తన తండ్రిని అమ్మతోపాటు మరో వ్యక్తి చంపేశాడని చెప్పడంతో విషయం బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన సెంట్రింగ్‌ కూలీ ఎస్‌డీ జాఫర్‌కు 13 ఏళ్ల క్రితం ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ఖతిజాతో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. కుమారుడు హాస్టల్‌లో ఉంటూ చదువుతుండగా, కూతురు వీరితోనే ఉంటోంది. వివాహం తర్వాత వీరు పదేళ్లపాటు తిప్పనపల్లిలోనే ఉన్నారు. 

అనంతరం ఈ దంపతులు మూడేళ్లు చింతలపూడిలో ఉన్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మీరాతో ఖతిజాకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం జాఫర్‌కు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆరు నెలల క్రితం మళ్లీ తిప్పనపల్లి వచ్చేశారు. అయినా మీరాతో ఖతి జా ఫోన్‌లో రహస్యంగా మాట్లా డేది. ఈ విషయాన్ని కూడా జాఫర్‌ గుర్తించడంతో పది రోజులుగా తీవ్రంగా గొడవలు జరుగుతున్నా యి. దీంతో తమకు అడ్డుగా ఉన్న భర్తను హతమార్చాలని నిర్ణయించుకున్న ఖతీజా ఈనెల 11న ప్రియుడికి సమా చారం ఇచ్చింది. అదేరోజు మీరా అర్ధరాత్రి తిప్పనపల్లి చేరుకున్నాడు.

 ఖతీజా సాయంతో నిద్రిస్తున్న జాఫర్‌ ముఖంపై దిండుతో అదిమి పట్టి చంపేశాక మీరా తిరిగి వెళ్లిపోయాడు. అయితే, మద్యం తాగి వచ్చిన భర్త కింద పడటంతో గాయాలయ్యాయని, గురువారం ఉదయంకల్లా చనిపోయాడని ఖతిజా అందరినీ నమ్మించింది. దీంతో కుటుంబీకులు సహజ మరణంగా భావించి అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే, కుటుంబీకులు శుక్రవారం మృతుని కూతురుతో మాట్లాడుతుండగా తండ్రిని తల్లి సహా మరో వ్యక్తి కలిసి చంపేశారని చెప్పింది. దీంతో వారు ఖతిజాను చితకబాది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జూలూరు పాడు సీఐ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement