
పూణే: మహారాష్ట్రలోని పూణే పోలీసులు ఆదివారం ఉదయం ఓ అపార్టుమెంట్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీ గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలతో పాటు హుక్కాలు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే కుమార్తె రోహిణి భర్త ప్రాంజల్ ఖెవల్కర్ సహా పలువురు పట్టుబడ్డారు.
రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఖరాడీ ప్రాంతంలోని స్టూడియో అపార్టుమెంట్‌పై తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో దాడి చేశామని డీసీపీ(క్రైం) నిఖిల్ పింగ్లే చెప్పారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో 2.7 గ్రాముల కొకైన్, 70 గ్రాముల గంజాయి, హుకా సామగ్రి, మద్యం దొరికాయన్నారు. పట్టుబడిన వారిపై నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డీపీఎస్)చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరందరికీ వైద్య పరీక్షలు చేయించామని, నివేదికలు అందాల్సి ఉందన్నారు.
ఎన్‌సీపీ(ఎస్‌పీ)నేత అయిన ఏక్‌నాథ్ షిండే ఈ పరిణామంపై మీడియా ఎదుట స్పందించారు. పోలీసుల దాడి వెనుక రాజకీయ కారణాలున్నాయా అనే విషయం తేల్చేందుకు క్షుణ్నంగా దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్‌సీపీ(ఎస్‌పీ) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా రోహిణీ ఖడ్సే వ్యవహరిస్తున్నారు. ఘటనపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఈ దాడి ఒక హెచ్చరిక వంటిదంటూ శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారె వ్యాఖ్యానించారు.
प्रांजल खेवलकरांच्या रेव्ह पार्टीवर धाडीचा व्हिडिओ आला बाहेर, काय घडलं?#LokmatNews #MaharashtraNews #pranjalkhewalkar #raveparty #Policecase #MarathiNews pic.twitter.com/AufI7xJx0I
— Lokmat (@lokmat) July 27, 2025