ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హానీమూన్-2 హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితురాలు అంజూతన ప్రియుడు సంజూల మధ్య ఏడేళ్ల క్రితమే ప్రేమ మెుదలైనట్లు అధికారుల విచారణలో తేలింది. అంతేకాకుండా వీరిద్దరూ గతంలో ఓ వివాహంలో పరిచయం అయినట్లు తెలుస్తోంది.
పెళ్లైన మూడు నెలలకే జనవరి 30న అంజలి అనే మహిళ తన భర్త అశీశ్‌ను ప్రియుడితో కలిసి హత్య చేయించిన సంగతి తెలిసిందే. అయితే వీరు ఏడేళ్ల క్రితమే తొలిసారిగా పరిచయం అయినట్లు విచారణలో తేలింది. విచారణలోని వివరాలు..2018లో జరిగిన ఓ వివాహంలో అంజలి, సంజయ్‌లు తొలిసారిగా కలిశారు. ఆవివాహంలో వెయిటర్‌గా పనిచేయడానికి వచ్చిన సంజయ్, అంజలిని ప్రేమలోకి దింపాడు. అనంతరం తన ఫోన్ నెంబర్ ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ సమయంలో తనకు మెుబైల్ లేకపోవడంతో వేరే వారి ఫోన్‌తో వారికి సంజయ్‌కి కాల్ అంజలి కాల్ చేసేది. అయితే కొద్దిరోజుల తర్వాత ఇద్దరికి కాంటాక్ట్ లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో 2024లో అంజలి ఫోన్ కొనుగోలు చేయడంతో ఇద్దరికి తిరిగి కాంటాక్ట్ ప్రారంభమయ్యింది. ఆసమయంలో వారిద్దరూ మరింతగా దగ్గరయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే వారి కుటుంబసభ్యులు తనకు అశీశ్‌తో వివాహం నిశ్చయించారు. అయితే కుటుంబసభ్యులకు భయపడి అంజలి 2025 అక్టోబర్ 30న అశీశ్‌ను వివాహం చేసుకుంది. అయితే అనంతరం కూడా సంజయ్‌తో వాట్సాఫ్ కాల్ మాట్లాడుతూ వస్తుంది. అయితే ఈ హత్య జరగడానికి 16 రోజుల ముందు అంజలి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.
జనవరి 30న తన ప్రణాళిక ప్రకారం భోజనం ముగిసిన తర్వాత వాకింగ్‌కు వెళదామని తన భర్తను కోరింది. అనంతరం తన ప్రియుడికి వాట్సాఫ్‌లో వారున్న సమాచారం పంపింది. దీంతో సంజయ్ తన ఇద్దరు మిత్రులు రోహిత్, సిద్ధార్థ్‌లతో కలిసి అక్కడ ఉన్నాడు. వారిని చూడగానే అశీశ్‌ను కొట్టి చంపారు. అనంతరం అతని మృతదేహాం పైనుంచి వాహనం తీసుకెళ్లారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం తెలియడంతో తన గుట్టు రట్టయ్యింది. విచారణలో తాజాగా ఈ విషయాలు వెల్లడయ్యాయి.


