పంజాబ్‌ సీఎంకు కేంద్రం షాక్.. అనుమతి రద్దు | The central has cancelled the Punjab CM foreign trip | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ సీఎంకు కేంద్రం షాక్.. అనుమతి రద్దు

Feb 8 2026 3:27 PM | Updated on Feb 8 2026 3:39 PM

The central has cancelled the Punjab CM foreign trip

కేంద్రప్రభుత్వం పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌కు ఝలక్ ఇ‍చ్చింది. పొలిటికల్ క్లియరెన్స్ లేదనే కారణంతో తన విదేశీ పర్యటనను రద్దు చేసింది. కేంద్రం భగవంత్ మాన్ విదేశీ పర్యటనను రద్దు చేయడం ఇది వరుసగా మూడోసారి.

భగవంత్ మాన్ నెదర్లాండ్స్‌లోని చెక్‌ రిపబ్లిక్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే పొలిటికల్ క్లియరెన్స్ లేదనే కారణంతో ఆయన పర్యటనకు కేంద్రం రద్దుచేసింది. కాగా గతనెలలోనూ భగవంత్ మాన్ విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతులివ్వలేదు. జనవరిలో యునైటెడ్‌ కింగ్‌డమ్ ఇజ్రాయెల్ పర్యటించాల్సి ఉండగా విదేశాంగ శాఖ తన పర్యటనకు అనుమతులు నిరాకరించింది. అదే విధంగా పారిస్ ఒలంపిక్స్ సందర్భంలో ఫ్రాన్స్ పర్యటనను నిలిపివేసింది.

అయితే వచ్చే నెలలో పంజాబ్‌లో పెట్టుబడుల సదస్సు జరగనుంది. ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశం యూరోపియన్ యూనియన్ దేశాలలో భగవంత్ మాన్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించడంపై ఆ రాష్ట్ర నేతలు అసంతృప్తితో ఉన్నారు. కేంద్రం చర్యలతో పంజాబ్‌కు అంతర్జాతీయంగా వచ్చే పెట్టుబడులు సన్నగిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ అంశం రాజకీయంగా సైతం వివాదాస్పదంగా మారింది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం కక్ష‍ సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆప్ ఆరోపిస్తుంది. అయితే ఏదైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు చేయాల్సినప్పుడు విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement