
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్ష భారతదేశంలో అత్యంత కఠినమైన పోటీ పరీక్ష. UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చాలామంది కలలు కంటారు. IAS, IFS, IRS లేదా IPS అధికారి కావాలనే కలతో ప్రతీ ఏడాది వేలాది మంది ఈ పరీక్ష రాయాలని కోరుకుంటారు. కానీ వారిలో కొద్దిమంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్య రెడ్డి. తొలి ప్రయత్నంలోనే అసాధారణ ప్రతిభతో సత్తాచాటిన అనన్యరెడ్డి మార్కుల షీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో అనన్య మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైస్కూల్‌లోనూ, హైదరాబాద్‌లో ఇంటర్ విద్యను పూర్తి చేసిన అనన్య ఢిల్లీలో మిరాండా హౌస్ నుండి ఎకనామిక్స్‌లో మైనర్‌తో భౌగోళిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. డిగ్రి పూర్తవుతున్న క్రమంలో UPSCపై దృష్టిపెట్టింది. ప్రతిరోజూ 12 నుండి 14 గంటలు చదువుకుంటూ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించారు. తన సబ్జెక్టు ఆంత్రోపాలజీలో ప్రావీణ్యం సంపాదించడానికి కోచింగ్ తీసుకున్నారట. (చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన)

పట్టుదల దృఢనిశ్చయంతో చదవిUPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో అత్యుత్తమ ఆల్ ఇండియా ర్యాంక్ -3ని సాధించారు అనన్యరెడ్డి. రెండేళ్ల శ్రమతో తన తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకుతో సివిల్స్ సాధించడం విశేషం. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తనకు ప్రేరణ అని వెల్లడించారు. అంతేకాదు నవలలు చదవడం, క్రికెట్ చూడటం ద్వారా అనన్య రెడ్డి తన టెన్షన్‌ను మేనేజ్ చేసుకునేదట.
ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం
