10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం | 10 Month Old Baby Girl got an organ After Lying On Father Bare Chest In Sweden | Sakshi
Sakshi News home page

10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం

Jul 24 2025 3:52 PM | Updated on Jul 24 2025 5:20 PM

10 Month Old Baby Girl got an organ After Lying On Father Bare Chest In Sweden

స్వీడన్‌లో కనీవినీ ఎరుగని వింత  చోటు చేసుకుంది. ఏమీ జరిగిందో అ‍ర్థం  చేసుకునే లోపే చోటు చేసుకన్న  ఈ వింత వారిని ఆందోళనలోకి నెట్టేసింది. 10 నెలల పాపను ఎప్పుడూ తండ్రి ఛాతీపై పడుకోబెట్టుకునేవాడు.  ఈ లోకంలో అందరి తండ్రుల్లాగానే అతను కూడా తన ప్రతిరూపాన్ని చూసి  మురిసిపోయేవాడు. కానీ అనుకోని వింత వారిని షాక్‌లో ముంచేసింది. ఈ అసాధారణ వైద్య సంఘటన ఆన్‌లైన్‌లో , ఆరోగ్య సంరక్షణ సర్కిల్స్‌లో  విస్తృత  చర్చకు దారి తీసింది.

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, స్వీడన్‌లో నివసించే  ఈ పాప తండ్రి  పది నెలల  ఫీమేల్‌ బేబీని స్కిన్‌ టూ స్కిన్‌ టచ్‌ చేసేలా పడుకోబెట్టుకునేవాడు. అయితే ఆ పాపకు "మైక్రోపెనిస్" పెరగడం సంచలనం రేపింది. పాప తండ్రి రెగ్యులర్‌ టెస్టోస్టెరాన్ జెల్‌ను పూసుకునేవాడట.  ఈ అలవాటు కారణంగానే పాప  "మైక్రోపెనిస్" అభివృద్ధి చెందిందట.   అయితే అది నిజమైన "మైక్రోపెనిస్" కాదని అభివృద్ధి చెందని పురుష జననేంద్రియాలను అలా పిలుస్తారని చెబుతున్నారు నిపుణులు. ఈ ప్రమాదాల గురించి తెలియకుండా, తండ్రి  ఎక్కవగా తన బేబీని ఛాతీపై పట్టుకోబెట్టుకోవడం వల్ల అనుకోకుండా తన కుమార్తె టెస్టోస్టెరాన్ అధిక స్థాయిలోకి బహిర్గతమైందని అదీ ఈ పరిణామానికి దారి తీసిందని అంటున్నారు.  చర్మం నుండి చర్మానికి సంపర్కం ద్వారా ప్రమాదవశాత్తు హార్మోన్ బహిర్గతమయ్యే ప్రమాదాలను ఈ కేసు మరో నిదర్శనమన్నారు. ఇలాంటి అర డజను  కేసులను ఎదుర్కొన్నట్లు  ఒక స్వీడిష్ వైద్యుడు చెప్పడం గమనార్హం.

ఊరట ఏంటంటే
పాపలోని క్లిటోరిస్‌ చిన్న పురుషాంగంలా పొడుచుకు రావడాన్ని గమనించారు. అది చిన్న పురుషాంగంలా మారుతోందని గ్రహించి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. రక్త పరీక్షల ద్వారా అసలు విషయాన్ని గమనించారు. అదృష్టవశాత్తూ, ఆమె తండ్రి జెల్ వాడటం మానేసిన తర్వాత  అది దానంతటకు అదే కుంచించుకుపోవడం ఊరటనిచ్చింది.

ఇదీ చదవండి: బాలీవుడ్‌ సాంగ్‌కు చిన్నారుల స్టెప్స్‌ అదుర్స్‌.. ఆ కెమెరా మేన్‌ ఉన్నాడే..!

టెస్టోస్టెరాన్ జెల్‌ను సాధారణంగా హైపోగోనాడిజం ఉన్న పురుషులకు  ప్రిస్ర్కైబ్‌ చేస్తారట. ఈ పరిస్థితిలో శరీరం తగినంత సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేయదు. ఈ పరిస్థితి ఏ వయసు వారైనా పురుషులను ప్రభావితం చేయవచ్చు, కానీ అధ్యయనాలు 45 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 40శాతం ,  80 ఏళ్లలో సగం మంది పురుషులలో వైద్యపరంగా తక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఔషధం తక్కువ సెక్స్ డ్రైవ్, అంగస్తంభన, అలసట, మానసిక స్థితిలో మార్పులు మరియు కండరాల నష్టం వంటి అనేక లక్షణాలకు దారితీస్తుంది - టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (TRT) చికిత్సకు సహాయపడే సమస్యలు.

చదవండి: ప్రధానిని సైతం నవ్వించిన మీమ్‌ ఆర్టిస్ట్‌ కృష్ణ ఇక లేరు : ఫ్యాన్స్‌ దిగ్భ్రాంతి

కొన్ని కారణాలతో తీసుకునే టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్ల చికిత్సలు ఎంత శక్తివంతమైనవో, ఇతర హార్మోన్లను ఎలా ప్రభావితం చేస్తోయో సాధారణ ప్రజలకు అర్థం కావని సహల్‌గ్రెన్స్కా యూనివర్సిటీ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ ప్రొఫెసర్ జోవన్నా డాల్‌గ్రెన్  అన్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని గుర్తు చేసుకున్నారు. గతంలో ఒక కేసులో  10 ఏళ్ల బాలుడు తన తల్లి ఉపయోగిస్తున్న ఈస్ట్రోజెన్ క్రీమ్‌ కారణంగా  ఆ బాలుడిలో తర్వాత బ్రెస్ట్‌ పెరిగిందని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement