ప్రధానిని సైతం నవ్వించిన మీమ్‌ ఆర్టిస్ట్‌ కృష్ణ ఇక లేరు : ఫ్యాన్స్‌ దిగ్భ్రాంతి | Atheist, Photoshop artist Krishna passed away of pneumonia | Sakshi
Sakshi News home page

ప్రధానిని సైతం నవ్వించిన మీమ్‌ ఆర్టిస్ట్‌ కృష్ణ ఇక లేరు : ఫ్యాన్స్‌ దిగ్భ్రాంతి

Jul 24 2025 2:44 PM | Updated on Jul 24 2025 2:57 PM

Atheist, Photoshop artist Krishna passed away of pneumonia

ఒడిషాకు చెందిన ప్రముఖ ఫోటోషాప్ కళాకారుడు, మీమ్స్‌ సృష్టికర్త  కృష్ణ (Atheist krishna)  ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న (జూలై 23)న కన్నుమూశారు. దీంతో పలవురు ప్రముఖులు,  అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులో అకాల మరణం అంటూ  అభిమానులు  నివాళులర్పించారు.

కృష్ణ అసలు పేరు  రాధాకృష్ణ పంగా. మీమ్స్ , ఫోటోషాప్‌ ఫోటోలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.  కామెడీ ఫోటోలతో పాటు,  పాత, దెబ్బతిన్న ఫోటోలను పునరుద్ధరించడంలో కూడా ప్రసిద్ధి చెందాడు.  కృష్ణ నైపుణ్యం అనేకమంది సెలబ్రిటీల ప్రశంసలందుకుంది. ముఖ్యంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,  బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ దృష్టిని ఆకర్షించి, వారి  ప్రశంసలను కూడా  దక్కించుకున్నారు.

అనారోగ్యంతో బాధపడుతూ జూలై ప్రారంభంలో  ఆస్పత్రిలో చేరాడు.  అయితే ఊరిపితిత్తుల్లోకి నీరు చేరడంతో వైద్యులు శస్త్రచికిత్స  చేసినా ఫలితం లేకపోయింది. కానీ దురదృష్టవశాత్తు న్యుమోనియా సోకడంతో పరిస్థితి క్షీణించి కన్నుమూశాడు ఈ వార్త తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!

కాగా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికపై నృత్యం చేస్తున్న స్పూఫ్ వీడియోను క్రియేట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై ‍స్వయంగా మోదీ స్పందించారు. మోదీ తన సోషల్ మీడియాలో ఖాతాలో ఈ ఆర్టిస్ట్ వీడియోను పోస్ట్ చేసి మరీ ప్రశంసించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: బాలీవుడ్‌ సాంగ్‌కు చిన్నారుల స్టెప్స్‌ అదుర్స్‌.. ఆ కెమెరా మేన్‌ ఉన్నాడే..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement