
సోషల్‌మీడియాలో ఒక ఇంట్రస్టింగ్ వీడియో హల్‌చల్ చేస్తోంది. రష్యాకు చెందిన చిన్నారులు బాలీవుడ్ సూపర్‌స్టార్ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అడింకా మాండరింకా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 2.4 కోట్ల వీక్షణలను సంపాదించింది.
అమీర్ ఖాన్ , కాజోల్ నటించిన ఫనా (2006) చిత్రం నుండి 'చందా చమ్కే' పాటకు రష్యాకు చెందిన చిన్నారులు అద్భుతంగా స్టెప్పులేశారు. చక్కటి హావభావాలు, అద్భుతమైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అందమైన ఎరుపు లెహంగాలు ధరించిన చిన్నారుల బృందం పాటలోని ప్రతి బీట్‌ను క్యాచ్ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసేలా చేశారు. సో క్యూట్ ఎంత బాగా చేశారో, మంచి డ్యాన్సర్లు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!
అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. చిన్నారుల డ్యాన్స్ వీడియోను రికార్డ్ చేసిన 'కెమెరామెన్' పై ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తాయి. అతని కెమెరా యాంగిల్స్‌పై నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. చక్కటి వీడియోను పాడు చేసేశాడు అంటూ కమెంట్ చేశారు.
ఇవీ చదవండి: జిమ్‌కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్ లుక్ వైరల్
పొంగల్‌లో పురుగు : మరో వివాదంలో రామేశ్వరం కెఫే