
రామేశ్వరం కేఫే శుభ్రమైన, నాణ్యమైన దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఘీ ఇడ్లీ , సాంబార్, ఇడ్లీ, వడ, దోస, పొంగల్, ఫిల్టర్ కాఫీ ఇలా రకాలు చాలా ఫ్యామస్. సామాన్యుల నుంచి భోజన ప్రియులు, పర్యాటకుల దాకా రామేశ్వరం కేఫే ఫుడ్ బాగా ప్రాచుర్యం పొందింది. తాజాగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రామేశ్వరం కేఫే అందించిన ఫుడ్‌లో పురుగు కన్పించడం వివాదాన్ని రేపింది.
గురువారం ఉదయం కేఫ్‌లోని ఒక కస్టమర్ అల్పాహారం కోసం ఆర్డర్ చేసిన పొంగల్‌లో పురుగు కనిపించింది. దీనిపై వినియోగ దారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన తర్వాత కేఫ్ సిబ్బంది మొదట్లో దీన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో రెస్టారెంట్ అంతటా పాక్షికంగా కెమెరాను ప్యాన్ చేయడంతోపాటు, కస్టమర్ ఒక చెంచా పొంగల్‌లో పురుగును హైలైట్ చేస్తూ చూపించాడు.
ఈ వీడియోను, సిబ్బంది ప్రతిస్పందనను వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించిన తర్వాత మాత్రమే వారు క్షమాపణలు చెప్పడం ప్రారంభించారని పేర్కొన్నాడు. ఆ తరువాత సిబ్బంది తనకు రూ. 300 పూర్తి వాపసును అందించారని వెల్లడించాడు.
ఇదీ చదవండి: జిమ్‌కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్ లుక్ వైరల్
అయితే ఈసంఘటనపై రామేశ్వరం కేఫే ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
కాగా బెంగళూరుకు చెందిన రామేశ్వరం కేఫ్‌కు పలు శాఖలున్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కూడా ఒక శాఖ ఉంది. హైదరాబాద్‌లోని గత సంవత్సరం మే నెలలో, గడువు ముగిసిన , తప్పుగా లేబుల్ చేసిన అనేక ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత తెలంగాణ ఆహార భద్రతా శాఖ తనిఖీ కిందకు వచ్చాయి. వీటిలో మార్చి 2024లో గడువు ముగిసిన 100 కిలోల మినప పప్పు, అలాగే 10 కిలోల గడువు ముగిసిన పెరుగు, ఎనిమిది లీటర్ల గడువు ముగిసిన పాలు ఉన్నాయి. అలాగే గత ఏడాది మార్చిలో బెంగళూరులోని రామేశ్వరంకేఫ్‌లో జరిగిన IED పేలుడులో అనేక మంది గాయపడిన సంగతి తెలిసిందే.
చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!