హుబ్లీ: ఉప కాలువలో నీటి పాలైన విద్యార్థి శవం ఇంకా లభించ లేదు. శహాపుర తాలూకా భీమరాయనగుడి బోరుకా ప్లాంట్ వద్ద శహాపుర శాఖ కాలువ ఎస్‌బీసీలో స్నానానికి వెళ్లి నీటి పాలైన వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థి హరీష్ రెడ్డి శవం శుక్రవారం కూడా లభించలేదు. అగ్నిమాపక దళ 17 మంది సిబ్బంది, ఇతర నిపుణులు కాలువలో తీవ్రంగా గాలింపు చేపట్టారు. సుమారు 2 కిలో మీటర్ల వరకు గాలించినా శవం దొరకలేదని కళాశాల ఇన్‌చార్జి డీన్ ప్రకాశ్ కుచనూర మీడియాకు తెలిపారు.
తల్వార్ పట్టుకున్న వీడియో వైరల్
మరో ఘటనలో తల్వార్ పట్టుకొని ప్రాణాలు తీస్తామని బెదిరించే తరహాలో వీడియోను సోషియల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన వ్యక్తిపై హుబ్లీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన సంపత్ చౌహాన్ కత్తి పట్టుకొని డైలాగ్ చెబుతూ ప్రపంచంలో రక్తపిపాసులు ఎవరైనా కానీ బతికేందుకు హక్కు లేదని వీడియో చేసి ఇన్‌స్ట్రాగాంలో వైరల్ చేశారు. దీంతో నిందితునిపై ప్రజల్లో అనవసరంగా భయభ్రాంతులు సృష్టిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని కేసును నమోదు చేసుకున్నారు.


