రాయచూరు రూరల్: అంగన్‌వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. శనివారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ ఏళ్ల తరబడి సీ్త్ర శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 నిష్పత్తిలో వేతనాలు పెంచాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.
సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ
రాయచూరు రూరల్: నగరంలో రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ వసంత్ కుమార్ భూమిపూజ చేశారు. శనివారం నగరంలోని రెండో వార్డులో రూ.3 కోట్లతో వివిధ కాలనీల్లో సీసీ రోడ్లను నిర్మిస్తారన్నారు. ప్రజలకు మౌలిక సౌకర్యాలను కల్పిస్తామన్నారు. మాజీ కౌన్సిలర్ జయన్న, మంచాల భీమన్న, నాగేంద్ర, రామకృష్ణ, నిర్మల బెణ్ణి, మురళిఽ యాదవ్, దరూరు బసవరాజ్, రజాక్ ఉస్తాద్, అబ్దుల్ కరీంలున్నారు.
హీమోఫీలియా రోగులకు ఉచిత చికిత్స
బళ్లారిఅర్బన్: సాధారణంగా రక్తం సరిగ్గా గడ్డకట్టక పోవడం, కీళ్లు, కండరాలలో రక్తస్రావం వంటి లక్షణాలతో కనిపించే వారికి హీమోఫీలియా వ్యాధికి రూ.లక్ష ఖర్చయ్యే చికిత్సను బళ్లారిలోని ఆస్పత్రిలో ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీశ్ సుమేరా, రాజేష్, జడ్జి హొసమని హీమోఫీలియో బారిన పడిన ఓ చిన్నారికి ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆరు నెలల ప్రత్యేక చికిత్స కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఆరోగ్యాధికారి డాక్టర్ యల్లా రమేష్‌బాబు, జిల్లా శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్.ఎన్. బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లాభాల్లో హట్టి బంగారు గనుల కంపెనీ
రాయచూరు రూరల్: బంగారు గనుల ఉత్పత్తిలో రాయచూరు జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలోని లింగసూగూరు తాలూకా హట్టి బంగారు గనుల కంపెనీకి రూ.436 కోట్ల లాభం చేకూరింది. దీంతో ప్రభుత్వానికి రూ.97.25 కోట్ల చెక్‌ను అందజేసింది. శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు హట్టి బంగారు గనుల కంపెనీ అధ్యక్షుడు జేసీ పాటిల్ భూ గర్భ గనుల శాఖ మంత్రి ఎస్ ఎస్ మల్లికార్జునతో కలిసి చెక్‌ను అందించారు.
రైలు పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య
హొసపేటె: రైలు పట్టాలపై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్న సంఘటన శనివారం తాలూకాలోని మరియమ్మనహళ్లి గుండా రహదారి వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌పై జరిగింది. మృతుడిని కొప్పళ జిల్లా టణకనకల్ గ్రామానికి చెందిన సురేష్(42)గా గుర్తించారు. అతని తల మొండెం నుంచి వేరుగా పడి పోయింది. రైల్వే ట్రాక్ వద్ద మొండెం మాత్రమే ఉండి పోయింది. హొసపేటె రైల్వే ఉప పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.


