
‘స్లిమ్‌గా ట్రిమ్‌గా, పొడవుగా , అందంగా ఉండేవాడివి’
ఆరోగ్య రీత్యా వ్యాయామం చేయాలని బోనీ కపూర్ భార్య శ్రీదేవి నిరంతరం చెప్పేదట
అందాల నటి జగదేకసుందరి, దివంగత శ్రీదేవి భర్త, చిత్ర నిర్మాత బోనీ కపూర్ న్యూలుక్‌లో కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్ చేశాడు. 69 ఏళ్ల వయసులో కేవలం జ్యూస్ డైట్ తర్వాత 26 కిలోలు తగ్గి అంత స్లిమ్‌గా మారాడనే విషయంలో మరోసారి నెట్టింట సందడిగా మారింది. ముఖ్యంగా నిర్మాత కరణ్ జోహార్, టీవీ నటుడు రామ్ కపూర్ బాగా బరువు తగ్గి, న్యూలుక్‌లో అలరిస్తున్న నేపథ్యంలో వైరల్ భయానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బోనీ కపూర్ తాజా చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.
కపూర్ క్రమశిక్షణతో కూడిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కార్బోహైడ్రేట్‌లను నివారించడం, తరచుగా విందుకు బదులుగా తేలికపాటి సూప్‌లను ఎంచుకోవడం ద్వారా ఈ పరివర్తనను సాధించాడట తాను బరువు తగ్గడం వెనుక ప్రేరణ తన భార్య శ్రీదేవి అని 2024లో మీడియాకు ఇంటర్వ్యూలో బోనీ కపూర్ తెలిపాడు. ‘నేను నిన్ను కలిసినప్పుడు, నువ్వు సన్నగా, ట్రిమ్ గా, పొడవుగా అందంగా ఉన్నావు.. ఇపుడు చూడు ఎలా ఉన్నావో.. అంతకంటే నిన్ను ఏమి అడగలను చెప్పు ’’అని నిరంతరం గుర్తు చేసేదట. ఆరోగ్య కారణాల వల్ల, రీత్యా బరువు తగ్గించుకోవాలని కోరుకునేదట. అంతేకాదు కలిసి జిమ్‌కి, వాకింగ్‌కు తీసుకెళ్లేది.. ఆమె కోరుకున్నట్టుగా 10-12 రోజులు కొనసాగించి కానీ కొన్ని సమస్యల కారణంగా మానేశా’ అని తెలిపాడు.
కానీ తరువాత సిన్సియర్‌గా ప్రయత్నించి, కొంత బరువును తగ్గించుకున్నాడు. ప్రస్తుతం ఏకంగా 26 కిలోల బరువు తగ్గాడు. మొదట్లో బోనీ కపూర్ బరువు తగ్గడానికి రహస్యం ఏమిటంటే డిన్నర్ మానేసి సూప్ మాత్రమే తాగేవాడు. దీంతో కొంత బరువు తగ్గడంతో మరింత ప్రయత్నించి బ్రేక్‌ఫాస్ట్‌లో పళ్ల రసాలు, జొన్న రోటీ డైట్‌తో 26 కిలోలు తగ్గాడట. ఈ స్లిమ్ లుక్ కోసం బోనీ జిమ్‌కు కూడా వెళ్ళలేదని వైరల్ భయానీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అయితే నెటిజన్లు మాత్రం బరువు తగ్గించే మందు ఓజెంపిక్ లేదా మౌంజారో వాడి ఉంటాడు అందుకే ఇంత మార్పు అని వ్యాఖ్యానించారు. భార్యకు నివాళిగా ఇలా స్లిమ్‌గా మారి ఉంటాడని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదీ చదవండి: నో జిమ్, నో ట్రైనర్.. 46 రోజుల్లో 11 కిలోలు ఉఫ్..!