
ఇంగ్లండ్ పతనాన్ని అడ్డుకున్న వరుణుడు
తొలి ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పతనాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. 242 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ దాటి 18 పరుగుల ఆధిక్యంలో ఉంది. హ్యారీ బ్రూక్ (48), జోష్ టంగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రిస్ వోక్స్ ఆడే అవకాశం లేదు. గాయం కారణంగా వోక్స్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. తొలి రోజు ఆట సందర్భంగా వోక్స్ భుజానికి తీవ్ర గాయమైంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో భారత పేసర్లు చెలరేగిపోతున్నారు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. సిరాజ్ (12-1-66-3), ప్రసిద్ద్ కృష్ణ (11.5-0-51-3), ఆకాశ్‌దీప్ (17-0-80-1) పోటీ పడి సత్తా చాటుతుండటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో పతనం అంచుల్లో ఉంది. రెండో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు 215 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.
టీ విరామానికి ముందు ఓవర్‌లో ప్రసిద్ద్ విజృంభించాడు. ఐదు బంతుల వ్యవధిలో జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్‌లను పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 9 పరుగులు వెనుకపడి ఉంది. హ్యారీ బ్రూక్ (33) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 64, బెన్ డకెట్ 43, ఓలీ పోప్ 22, జో రూట్ 29, జేకబ్ బేతెల్ 6, జేమీ స్మిత్ 8, జేమీ ఓవర్టన్ డకౌటయ్యాడు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే.